చిరంజీవికి ఇష్టమైన హీరో ఇతడే: దర్శకుడు బాబీ | Director Bobby Says Chiranjeevi Likes Naveen Polishetty | Sakshi
Sakshi News home page

చిరంజీవి మెప్పు పొందిన ఈతరం హీరో.. ఎవరో చెప్పిన బాబీ

Jan 31 2026 12:26 PM | Updated on Jan 31 2026 12:34 PM

Director Bobby Says Chiranjeevi Likes Naveen Polishetty

టాలీవుడ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అనగనగా ఒక రాజు. మారి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది.

టైమింగ్‌తో హీరో అయ్యాడు 
తాజాగా సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ పేరిట ఓ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు బాబీ అతిథిగా హాజరయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా టైమ్‌ బాగుంటే హీరోలవుతారు అంటారు. కానీ టైమింగ్‌ బాగుండి హీరో అయినవాడు నవీన్‌ పొలిశెట్టి. నవీన్‌ సినిమా మొత్తంలో ఎక్కడ కూడా ఎనర్జీని కోల్పోలేదు. నీ కష్టంతో ఇలాగే ముందుకెళ్తావ్‌..

చిరంజీవి రియాక్షన్‌
ఈ సినిమా రిలీజయ్యాక చిరంజీవిగారిని కలిశాను. అప్పుడాయన ఏమన్నారంటే.. నవీన్‌ పొలిశెట్టిది అనగనగా ఒకరాజు సినిమా చాలా బాగుందట కదా బాబీ.. అని అడిగాడు. అవునన్నయ్య.. చాలా బాగుందన్నాను. ఆ అబ్బాయికి ఎంత ఎనర్జీ ఉంటుంది.. ఇప్పుడు వస్తున్న జెనరేషన్‌లో నాకు బాగా నచ్చిన హీరో నవీన్‌ అని చెప్పాడు. ఆయన సినిమా సక్సెస్‌ అయిన ఆనందంలో ఉంటూనే నీ మూవీ సక్సెస్‌ను కూడా ఎంజాయ్‌ చేశాడు. చిరంజీవి కళ్లలో పడి ఆయన మెప్పు పొందావు అని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విని నవీన్‌ ఉప్పొంగిపోయాడు.

చదవండి: మన శంకరవరప్రసాద్‌గారు ఓటీటీలో వచ్చేది అప్పుడేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement