బాలీవుడ్‌లో రిచెస్ట్ హీరోయిన్, అందాలరాశి ఎవరంటే ముందు ఐశ్వర్యరాయ్ పేరే వినిపిస్తుంది. ఒకప్పుడు సినిమా రంగాన్ని ఏలిన ఐష్ ఆస్తి విలువ దాదాపు రూ.900 కోట్లు ఉంటుందని అంచనా.. అయితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించడం అంత ఈజీ కాదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్న ఐశ్వర్య తొలి సంపాదన ఎంతో చూసేద్దాం..
తొలి సంపాదన ఎంతంటే?
బాలీవుడ్ నిర్మాత శైలేంద్ర సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఒడిదుడుకులను గురించి వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. నేను ఐశ్వర్యరాయ్‌ను తొలిసారి చూసినప్పుడు ఆమెకు 18 లేదా 19 ఏళ్లు ఉంటాయనుకుంటా.. ఐదువేల రూపాయలకే మూడు యాడ్స్‌లో నటించింది.
అలా మొదలైంది
ఒకదాంట్లో అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కడో ఉందంతే! కానీ ఐశ్వర్య లుక్స్ అందరినీ ఆకర్షించేవి. దాంతో వాణిజ్య ప్రకటనలో నటించమని ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అలా అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఈయన ఫిరాఖ్, ఫిర్ మిలేంగే, పేజ్ 3 వంటి పలు సినిమాలు నిర్మించాడు.
జర్నీ
1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. జీన్స్ అనే తమిళ చిత్రంతో అందరి కంట్లో పడింది. దేవదాస్, జోధా అక్బర్, ఏ దిల్ హై ముష్కిల్, హమ్ దిల్‌దే చుకే సనం వంటి పలు చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా మారింది. కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్స్ పలికిస్తూ డ్యాన్స్‌తో అద్భుతః అనిపిస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. చివరగా పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలో యాక్ట్ చేసింది. 2009లో కేంద్రం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.


