సోషల్‌ మీడియా డిలీట్‌ చేయాలనుకున్నా: ఆలియా | Alia Bhatt: I Wanted to Quit Social Media after Motherhood | Sakshi
Sakshi News home page

అమ్మనయ్యాక పూర్తిగా మారిపోయా.. సోషల్‌ మీడియా కూడా..

Jan 31 2026 2:43 PM | Updated on Jan 31 2026 2:50 PM

Alia Bhatt: I Wanted to Quit Social Media after Motherhood

అమ్మ అన్న పిలుపుతో ఆడదాని లోకమే మారిపోతుందంటారు. హీరోయిన్‌ ఆలియా భట్‌ కూడా అందుకు అతీతురాలు కాదు. తల్లయ్యాక తన ప్రపంచమే మారిపోయిందంటోంది ఆలియా. మాతృత్వం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గర్భిణీగా ఉన్న తొమ్మిది నెలల్లో చాలా మార్పులొస్తాయి. శరీరమే కాదు మన ఆలోచన విధానాలు కూడా మారుతుంటాయి. 

డిలీట్‌ చేయాలన్న ఆలోచన
ఎప్పుడైతే కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డను కళ్లారా చూస్తామో అప్పుడు పూర్తిగా మనల్ని మనమే మర్చిపోతాం. తనే ప్రపంచంగా మనకే తెలియనంతగా మారిపోతాం. మళ్లీ ఒకప్పటిలా ఉండాలనుకున్నా అది అసాధ్యం. చాలాసార్లు సోషల్‌ మీడియా డిలీట్‌ చేయాలనిపించేది. కానీ నా కెరీర్‌ ప్రారంభం నుంచి నన్ను సపోర్ట్‌ చేసినవారితో బంధాన్ని తెంచుకోవడం ఇష్టం లేక ఆ ఆలోచన విరమించుకున్నాను. కొన్నిసార్లు నా వ్యక్తిగత విషయాల్ని అందరితో పంచుకోవాలనిపించడం లేదు. 

నేను కూడా ట్రై చేయాలి
అది నా పర్సనల్‌ అని నా అభిప్రాయం. నా ఫోన్‌లో మొత్తం రాహా ఫోటోలే ఉన్నాయి. నేను కూడా అప్పుడప్పుడు ఫోటోలు దిగడానికి ప్రయత్నించాలి అని చెప్పుకొచ్చింది. ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌ 2022లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది వీరికి కూతురు రాహా జన్మించింది. ప్రస్తుతం ఆలియా, రణ్‌బీర్‌.. లవ్‌ అండ్‌ వార్‌ సినిమా చేస్తున్నారు. నిర్మాతగా డోంట్‌ బీ షై సినిమా చేస్తోంది.

చదవండి: సినిమాలు వర్కవుట్‌ కాకపోతే సీరియల్స్‌? చంద్రహాస్‌ ఏమన్నాడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement