బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హిట్టు కోసం పరితపిస్తున్నాడు. గతకొంతకాలంగా ఆయన చేసిన సినిమాలేవీ విజయాన్ని సాధించడం లేవు. దీంతో ప్రస్తుతం అతడు నటిస్తున్న "బ్యాటిల్ ఆఫ్ గల్వాన్" సినిమాపైనే ఆశలు పెంచుకున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ వదిలారు. అందులో ఓ సన్నివేశంలో సల్మాన్ లుక్, యాక్టింగ్‌పై ట్రోల్స్ వచ్చాయి.
సల్మాన్‌పై విమర్శలు
సైనికుడు చూపించే ధైర్యసాహసాలు అతడి ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. వీటికి సల్మాన్ తాజాగా కౌంటరిచ్చాడు. ఈ మేరకు ఐఎస్‌పీఎల్ (ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్) ఈవెంట్‌లో మాజీ క్రికెటర్, యాంకర్ మహ్మద్ కైఫ్‌తో సల్మాన్ సంభాషిస్తున్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. అందులో కైఫ్.. సల్మాన్‌ను బ్యాటిల్ ఆఫ్ గల్వాన్‌లో ఎలా పోజిచ్చాడో అలా ఓ లుక్కివ్వమన్నాడు.
నేను కల్నల్‌ని
అప్పుడు సల్మాన్.. ఇప్పుడు కొంతమంది ఇది రొమాంటిక్ లుక్ అనుకుంటారు.. కానీ, ఇది కల్నల్ పోజ్. తన జట్టును, సైనికులను ఎలా ముందుకు తీసుకెళ్లాలో బాగా తెలిసిన కల్నల్ ఇలాగే ఉంటాడు అంటూ ట్రోలర్స్‌కు చురకలంటించాడు . బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా విషయానికి వస్తే.. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ మూవీలో చిత్రాంగద సింగ్, అభిలాష్ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణకు చెందిన వీరజవాన్ కల్నల్ సంతోష్‌బాబు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశభక్తి మూవీ ఏప్రిల్ 17న విడుదల కానుంది.
LATEST: Salman Khan Hits back at all the trolls regarding Battle of Galwan teaser!
"Mai colonel hu movie me, Mujhe Calm rehna parega. Kuch log bs faltu ka troll karte. Mai chila bhi sakta hu, but suit ni karega" #SalmanKhan #BattleOfGalwan pic.twitter.com/MY1PY3LgeA— Being ADARSH⚡ (@IBeingAdarsh_) January 31, 2026
చదవండి: ఐశ్వర్యరాయ్ తొలి సంపాదన ఎంతంటే?


