మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఫంకీ. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ సినిమా నుంచి ధీరే.. ధీరే సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా సెకండ్ సాంగ్‌ను వదిలారు.
'ఒప్పేసుకుంట పిల్ల తప్పు అంత నాదేనంటు రట్టాటటావ్.. తప్పించుకోను పిల్ల సారీ నీకు చెప్పుకుంట రట్టాటటావ్.. అరెరె కుక్క పిల్లలాగా తిప్పుకోకే పిల్లా..' అంటూ పాట మొదలవుతుంది. అంటూ సాగే ఈ పాట ప్రారంభం నుంచి చివరి వరకు ఫుల్ జోష్‌తో కొనసాగింది. భీమ్స్ సంగీతం అందించిన ఈ పాటకు దేవ్ పవార్ లిరిక్స్ సమకూర్చాడు. రామ్ మిర్యాల ఆలపించాడు. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఫిలిం ఫిబ్రవరి 13న విడుదలవుతోంది.


