నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే మాస్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'ఆంధ్ర టూ తెలంగాణ' అంటూ సాగే ఈ పాటలో నవీన్ స్టెప్పులకు శాన్వీ మేఘన గ్లామర్‌తో ఆకట్టుకుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను ధనుంజయ్ సీపానా, సమీర్ భరద్వాజ్ పాడారు. సంగీతం మిక్కీ జె. మేయర్ అందించారు.


