టాలీవుడ్ జనవరి రిపోర్ట్ కార్డ్.. పైచేయి ఎవరిది? | Telugu Movies Situation And Result January 2026 | Sakshi
Sakshi News home page

Tollywood: టాప్ లేపిన చిరంజీవి.. తర్వాత ఎవరెవరు?

Jan 31 2026 1:10 PM | Updated on Jan 31 2026 1:23 PM

 Telugu Movies Situation And Result January 2026

2026లో అప్పుడే మొదట నెల పూర్తయిపోయింది. కళ్లు మూసి తెరిచేలేపో జనవరి అయిపోయింది. ఈ నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే సందడి వినిపించింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలే దీనికి కారణం. ఇంతకీ తెలుగు ఇండస్ట్రీకి ఈ నెల ఎలా గడిచింది? ఏమేం జరిగింది? అనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా)

నెల ప్రారంభంలోనే సైక్ సిద్ధార్థ్, వనవీర, 45, గులాబీ తదితర తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ వచ్చాయి. వీటిలో ఒక్కటి కూడా మెప్పించలేకపోయాయి. మరోవైపు సంక్రాంతి సినిమాల గురించి జనాల ఎదురుచూడటంతో తొలివారం ముగిసిపోయింది. రెండోవారం వచ్చేసరికి ప్రభాస్ 'రాజాసాబ్' థియేటర్లలోకి వచ్చింది. ట్రైలర్స్, దర్శకుడి మారుతి మాటలు వినేసరికి అభిమానులు చాలా అంచనాలు పెంచుకున్నారు. కట్ చేస్తే తొలిరోజే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. లాంగ్ రన్‌లో డిజాస్టర్‌గా మిగిలింది.

ఈసారి చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు'.. ఓ మాదిరి అంచనాలతోనే థియేటర్లలో రిలీజైంది. కానీ ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన వారం పదిరోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులే దర్శనమిచ్చాయి. కంటెంట్ పరంగా పెద్దగా మెరుపులేం లేనప్పటికీ చిరంజీవి మ్యాజిక్ బాగానే వర్కౌట్ అయింది. రూ.350 కోట్ల కలెక్షన్స్‌తో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత రోజు 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రిలీజైంది. చిరు సినిమాకు అదిరిపోయే టాక్ రావడంతో దీన్ని జనాలు లైట్ తీసుకున్నారు. రవితేజ గత చిత్రాలతో పోలిస్తే ఇది కాస్త బెటర్ అనే మాట వినిపించింది కానీ పెద్దగా వసూళ్లు రాబట్టుకోలేకపోయింది.

(ఇదీ చదవండి: 'మన శంకరవరప్రసాద్' ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడేనా?)

తర్వాత నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు' వచ్చింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీతో సక్సెస్ అందుకుంది. నాగవంశీ నిర్మాత కావడంతో ఉన్నంతలో థియేటర్లు కూడా బాగానే దొరికాయి. శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి'కి హిట్ టాక్ వచ్చింది గానీ అప్పటికే జనాలు చిరంజీవి మూవీ మూడ్‌లో ఉండటంతో దీన్ని కొందరు మాత్రమే చూశారు. పండగ మూవీస్ హడావుడి ఉంటుందని మూడో వారం ఒక్క కొత్త చిత్రం కూడా రిలీజ్ కాలేదు. చివరి వారంలో తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా 'ఓం శాంతి శాంతి శాంతిః' రిలీజైంది. మక్కీకి మక్కీ రీమేక్ కావడం, కంటెంట్ ఓకే ఓకే ఉండటంతో జనాల్లోకి పెద్దగా వెళ్లలేదు. హిట్ అయ్యే అవకాశాలు తక్కువే. అలానే 'దేవగుడి'తో పాటు ఒకటి రెండు చిన్న చిత్రాలు కూడా రిలీజయ్యాయి. కానీ వీటిని పట్టించుకునే నాథుడు లేడు.

ఓవరాల్‌గా చూసుకుంటే చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు', నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారీ' మాత్రమే ఈ నెలలో హిట్స్ అయ్యాయి.

(ఇదీ చదవండి: నమ్మలేని పనులన్నీ చేస్తున్న రాజమౌళి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement