breaking news
Nari Nari Naduma Murari Movie
-
నెక్స్ట్ సినిమా నుంచి ఒక్క రూపాయి తీసుకోను: శర్వానంద్
సినిమా హిట్టవగానే రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తుంటారు హీరోలు. కానీ శర్వానంద్ మాత్రం ఇకపై ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోనంటున్నాడు. కాకపోతే అన్ని సినిమాలకు కాదు! నిర్మాత అనిల్ సుంకరతో చేసే సినిమాలకు నయాపైసా వద్దని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు.హిట్టు కొట్టిన శర్వానంద్శర్వానంద్-అనిల్ సుంకర కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైంది. పెద్ద సినిమాల పోటీని తట్టుకుని మరీ సక్సెస్ సాధించింది. దీంతో గురువారం నాడు సంక్రాంతి విన్నర్ బ్లాక్‌బస్టర్ ఈవెంట్ పేరిట వేడుకలు జరిపారు.రాసిపెట్టుకోండిఈ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ.. శ్రీవిష్ణుగారు మంచితనంతో మా మూవీలో అతిథి పాత్ర చేశారు. మా ఇద్దరికీ మంచి కథ రాస్తే కలిసి సినిమా చేస్తాం. హిట్టు వచ్చింది కదా.. ఎలా ఫీలవుతున్నారు? అని అందరూ అడుగుతున్నారు. నాకు ఎలా ఫీల్ అవ్వాలో కూడా తెలియడం లేదు. కానీ, అందరూ నవ్వుతూ ఉంటే బాగుంది. ఈ సినిమా ఇక్కడితో ఆగిపోదు, ఇంకో నాలుగు వారాలు ఆడుతుంది. ఇది నా మాట.. రాసిపెట్టుకోండి. ఇప్పుడు థియేటర్లు పెంచాం. దీనంతటికి కారణమైన వ్యక్తి నిర్మాత అనిల్‌గారు.ఒక్క రూపాయి తీసుకోనుథాంక్స్ చాలా చిన్న విషయం. కృతజ్ఞతలు చెప్పి మీ రుణం తీర్చుకోవాలనుకోవడం లేదు. హీరో- నిర్మాత కలిసుంటే ఏమవుతుందనేది మేము చూపిస్తాం. నెక్స్ట్ సినిమాకు అనిల్‌ను రూపాయి కూడా అడగనని మాటిస్తున్నా.. మా అనిల్‌గారు పెద్ద సినిమాలు చేసేవరకు ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర తీసుకోను. ఏడేళ్ల నుంచి కష్టపడుతున్నాం. హిట్టు విలువ ఏంటో మాకు బాగా తెలుసు. అలాంటి విజయాన్ని మీరు నాకిచ్చారు అని సంతోషం వ్యక్తం చేశాడు.చదవండి: కుక్కలు, పిల్లులు, కోతులు పోతాయ్.. : రేణూ దేశాయ్ ఆవేదన -
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆ సినిమాల్లో నన్ను చూసి నాకే ఛీ అనిపించింది : శర్వానంద్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కి చాలా గ్యాప్ తర్వాత ‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్‌పడింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైన ఈ చిత్ర..తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. పండక్కి ఎక్కువ సినిమాలు ఉండడంతో తొలి రోజు చాలా తక్కువ థియేటర్స్‌లో సినిమా రిలీజ్ అయింది. అయితే తొలి రోజే హిట్ టాక్ రావడంతో థియేటర్స్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత తన సినిమాకు హిట్ టాక్ రావడం ఆనందంగా ఉందంటున్నాడు శర్వానంద్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తన పాత చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొన్ని సినిమాలు ఇప్పుడు చూసుకుంటే.. తనకే ఆసహ్యం కలుగుతుందని చెప్పారు. ‘జాను(2019) సినిమా సమయంలో నాకు మేజర్ యాక్సిడెంట్ జరిగింది. నా చేయి కూడా పని చేయదని చెప్పారు. కానీ దేవుడి దయ, సంకల్ప బలంలో త్వరగానే రికవరీ అయ్యాను. అయితే ఆ సమయంలో నేను చాలా లావు అయిపోయాను. ‘శ్రీకారం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాల్లో చాలా లావుగా కనిపిస్తాను. కొన్నాళ్ల తర్వాత ఆ సినిమాలు చూస్తే.. ‘ఛీ ఛీ..ఎలా ఉన్నా? నన్ను చూసి టికెట్స్ ఎందుకు తెగాలి?’ అనిపించింది. అందుకే సినిమాల ఫెయిల్యూర్‌కి నేను కూడా ఒక కారణం అని భావించా. నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. ముందుగా నా శరీరాన్ని మునుపటి మాదిరిగా మార్చాలనుకున్నా. ముందుగా వాకింగ్ ప్రారంభించాను. ఆ తర్వాత రన్నింగ్, యోగా చేస్తూ డైటింగ్ చేశా.ఇప్పుడు నా లుక్ మారింది. నారీ నారీ నడుమ మురారి చిత్రంలో స్టైలీష్‌గా ఉన్నానని చెబుతున్నారు. బైకర్‌లో కూడా అలానే కనిపిస్తా.ఇకపై అన్ని మంచి సినిమాలు అందించడానికే కృషి చేస్తా’ అని శర్వా చెప్పుకొచ్చాడు. -
‘కథ’లేని సినిమాలపై కాసుల వర్షం.. కారణం ఏంటి?
‘సినీ ప్రేక్షకులు మారిపోయారు. కేజీయఫ్, బాహుబలి, పుష్ప లాంటి భారీ యాక్షన్, ఎలివేషన్ ఉన్న సినిమాలకు తప్ప.. మిగతావాటిని చూసేందుకు థియేటర్స్‌కు రావడం లేదు’ అని మొన్నటిదాకా మన దర్శకనిర్మాతలు చెప్పిన మాటలివి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని ఈ సంకాంత్రికి తెలుగు ఆడియన్స్ తేల్చేశారు.కొట్టడాలు.. నరకడాలు లేకున్నా.. స్వచ్ఛమైన వినోదాన్ని అందించేలా సినిమా తీస్తే.. ఫ్యామిలీతో కలిసి సినిమాకు వస్తామని మరోసారి నిరూపించారు. ఈ సంక్రాంతికి తెలుగులో వరుసగా ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో మూడు సినిమాలకు హిట్ టాక్ వచ్చింది. మిగతా రెండు సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చినా .. మంచి వసూళ్లను రాబడుతున్నాయి.ముందుగా హిట్ సినిమా గురించి చెప్పుకుందాం. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ప్రీమియర్ షోతోనే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న చిత్రం ‘మనశంకర వరప్రసాద్’. ఈ నెల 12న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ. 260 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత వచ్చిన అనగనగ ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు కూడా విజయాల బాట పడ్డాయి.ఈ మూడు సినిమాలను పరిశీలిస్తే..ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పుకోవడానికి ఈ మూడింట్లోనూ గొప్ప కథేలేం లేవు. నిజం చెప్పాలంటే.. అసలు కథే లేదు. అయినా కూడా ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తున్నారు. కారణం ఏంటంటే.. ఈ సినిమాల్లో కథ లేకున్నా..రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చునేలా చేసే స్వచ్ఛమైన వినోదం ఉంది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి తరలి వెళ్తున్నారు.చిరంజీవి కాబట్టి మన శంకరవరప్రసాద్ హిట్ అయిందని అనుకుంటే.. మిగతా రెండు సినిమాల్లోని హీరోలకు అంతపెద్ద ఫ్యాన్ ఫాలోయింగే లేదు. సినిమాలోని వినోదమే వారిని కాపాడింది. ఇక స్టార్ హీరో ఉంటేనే థియేటర్స్‌కి జనాలు వస్తారు అనుకుంటే ఈ సంక్రాంతికి ‘ది రాజాసాబ్’ అతిపెద్ద విజయం సాధించాలి. కానీ అది జరగలేదు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో వినోదం ఉన్నా..ప్రేక్షకులను ఆ డోస్ సరిపోలేదు. అందుకే బాక్సాఫీస్ రేసులో కాస్త వెనకబడింది. సంక్రాంతి కాబట్టే ఈ సినిమాలు ఆడుతున్నాయని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కామెడీ చిత్రాలు ఏ సీజన్లో వచ్చినా చూస్తారు. పండగక్కి వస్తే.. ఇంకాస్త ఎక్కువ మంది చూస్తారు. అయితే ప్రతిసారి యాక్షన్ సినిమాలే కాదు అప్పుడప్పుడు ఫ్యామిలీ డ్రామాలు కూడా వస్తే.. వాటిని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సంక్రాంతి సినిమాలతో అర్థమైంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించే దమ్ము ఫ్యామిలీ డ్రామాల్లోనే ఉంది. అందుకే ఇక నుంచి మనవాళ్లు యాక్షన్‌తో పాటు వినోదాత్మక కథలపై కూడా దృష్టిపెడితే మంచిది. -
నావల్లే డబ్బు పోయిందని ఇంతవరకు..: శర్వానంద్
గతేడాది సంక్రాంతికి మనమేతో హిట్టు కొట్టాడు హీరో శర్వానంద్. ఈసారి నారీ నారీ నడుమ మురారి మూవీతో మరోసారి సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించాడు. ఈ యేడు సంక్రాంతి బరిలో నాలుగైదు సినిమాలున్నప్పటికీ వాటి పోటీని తట్టుకుంటూ మళ్లీ హిట్టందుకున్నాడు.ఎమోషనల్ స్పీచ్ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి విన్నర్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శర్వానంద్ మాట్లాడుతూ.. నిర్మాత అనిల్ సుంకర గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన గురించి ఇండస్ట్రీలో ఎవరినైనా అడగండి.. చాలా మంచి వ్యక్తి అని చెప్తారు. ఒక అన్నగా అండగా నిల్చున్నారు. ఈ సినిమాను ఎంత కష్టపడి రిలీజ్ చేశారో నాకు తెలుసు.అలా ఎప్పుడూ అనుకోకుఆయన గురించి ఓ విషయం చెప్పాలి. మహాసముద్రం సినిమా పోయాక నేను ఫోన్ చేసి సారీ చెప్పాను. కథ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. నేను కూడా కొంచెం ఫిట్‌గా ఉండుంటే బాగుండేదన్నాను. అందుకాయన ఛీఛీ శర్వా.. అలా ఎప్పుడూ అనుకోకు. ఇది అందరమూ కలిసి తీసుకున్న నిర్ణయం. కాబట్టి అందరమూ బ్లేమ్ తీసుకోవాలి అన్నాడు. అందరం కలిసి తప్పు చేశాం.. అందరం భరిద్దాం అన్నాడు. ఇంతవరకు చూడలేదుఅలా ఒక నిర్మాత చెప్పడం నేనింతవరకు చూడలేదు. నీవల్ల నాకు డబ్బులు పోయాయని ఇంతవరకు అనలేదు. థాంక్యూ అనిల్‌గారు. మీ బ్యానర్ కోసం నేనెప్పుడూ రెడీగా ఉంటాను అని ఎమోషనలయ్యాడు. శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన మహాసముద్రం 2021లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించాడు.చదవండి: కోలీవుడ్ స్టార్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్ -
‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్ సెలెబ్రేషన్స్ (ఫోటోలు)
-
మళ్లీ హ్యాట్రిక్ అందుకున్నాం
‘‘చిరంజీవిగారి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా అద్భుతంగా ఆడుతోంది. అలాగే ‘అనగనగా ఒక రాజు’ కూడా సూపర్ హిట్ అయింది. ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ విజయాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. 1999లో ‘ఒకే ఒక్కడు, సఖి, నువ్వు వస్తావని’ సినిమాలతో డిస్ట్రిబ్యూటర్‌గా హ్యాట్రిక్ కొట్టాం. ఇప్పుడు మేము రిలీజ్ చేసిన మూడు సినిమాలతో మళ్లీ హ్యాట్రిక్ అందుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చెప్పారు. శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. శుక్రవారం జరిగిన ‘సంక్రాంతి విన్నర్ మీట్’లో శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో హిట్ కొడతానని చెప్పాను... కొట్టాను. ఇది గర్వంతోనో, పొగరుతోనో కాదు... వినయంగా చెబుతున్నాను. రామ్ అబ్బరాజులాంటి డైరెక్టర్ ఇండస్ట్రీకి కావాలి. నేను సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలు బాగుంటాయి. అందుకే కచ్చితంగా నా కోసం ఒక స్లాట్ పక్కన పెట్టండి. శ్రీను వైట్ల, మైత్రీ మూవీ మేకర్స్, నా కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాతో 2027 సంక్రాంతికి వస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా హిట్ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు శ్రీను వైట్ల. ‘‘మా మూవీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అని సంయుక్త పేర్కొన్నారు. ‘‘మా సినిమాని సంక్రాంతి విన్నర్ అని చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అని రామ్ అబ్బరాజు చెప్పారు. ‘‘ఈ సినిమా గురించి మహేశ్‌బాబుగారు ఫోన్ చేసి, మాట్లాడటం మరచి పోలేని ప్రశంస. మా సినిమాకి ఇంత అద్భుతమైన విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు అనిల్ సుంకర. -
ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్.. ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?
ఈ సంక్రాంతి సీజన్లో టాలీవుడ్లో ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరి 9 నుంచి 14 వరకు వచ్చిన ఈ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్', మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు'తో పాటు రవితేజ 'భారత మహాసయులకు విజ్ఞప్తి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' ఉన్నాయి. ఈ సినిమాలు పండగ సీజన్లో బాక్సాఫీస్‌ను హీట్ చేశాయి. మరి ఏ చిత్రం సూపర్ హిట్ అయింది? ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు ఏంటి? పూర్తి వివరాల కోసం రివ్యూస్ చదివేయండి1) ‘ది రాజా సాబ్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి2) ‘మన శంకర్ వరప్రసాద్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి3) ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి4) ‘అనగనగా ఒక రాజు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి5) ‘నారీ నారీ నడుము మురారి’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: నారీ నారీ నడుము మురారినటీనటులు: శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య, నరేశ్, వెన్నెల కిశోర్, సత్య, సుదర్శన్, సంపత్ రాజ్ తదితరులునిర్మాత: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకరస్క్రీన్ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజుసంగీతం: విశాల్ చంద్రశేఖర్విడుదల తేది: జనవరి 14, 2026ఈ సంక్రాంతికి చివరగా వచ్చిన సినిమా ‘నారి నారి నడుమ మురారి’. మిగతా సినిమాలతో పోల్చితే దీనికి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ చిత్రంపై కాస్త ఆసక్తి పెరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వరుస ప్లాఫులతో సతమతవుతున్న శర్వా.. ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆర్కిటెక్ట్ గౌతమ్(శర్వానంద్).. నిత్య(సాక్షి వైద్య)తో ప్రేమలో ఉంటాడు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో..ఆయన తండ్రి కార్తిక్(నరేశ్)కి లేటు వయసులో ప్రేమించిన యువతి పల్లవి(సిరి హనుమంతు)తో పెళ్లి జరిపిస్తాడు. ఆ తర్వాత తన ప్రియురాలు నిత్యని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. నిత్య తండ్రి రామలింగయ్య(సంపత్ రాజ్) తొలుత ఈ పెళ్లికి ఒప్పుకోడు. కానీ కూతురు బాధ చూడలేక చివరకు ఒప్పుకుంటాడు. అయితే రిజిస్టర్ ఆఫీస్‌లోనే పెళ్లి చేసుకోవాలని షరతు విధిస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో గౌతమ్ ఈ రిజిస్టర్ పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి దరఖాస్తు కోసం రిజిస్టర్ ఆఫీసుకి వెళ్లగా.. గౌతమ్‌కి అనుకొని సమస్య ఎదురవుతుంది? అదేంటి? దియా(సంయుక్త) ఎవరు? గౌతమ్‌కి ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? పెళ్లి కోసం కొడుకు చెప్పే అబద్దాల కారణంగా కార్తీక్-పల్లవిల దాంపత్య జీవితంలో ఎలాంటి మలుపు వచ్చాయి. చివరకు గౌతమ్-నిత్యల పెళ్లి జరిగిందా లేదా? ఈ కథకి లవకుశ(సత్య), సత్యమూర్తి(సునీల్), గుణశేఖర్(వెన్నెల కిశోర్)ల పాత్రలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Nari Nari Naduma Murari Review).ఎలా ఉందంటే..కామెడీ సినిమాలకు కథ-కథనం ఎలా ఉన్నా సరే.. కడుపుబ్బా నవ్విస్తే చాలు.. ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. ఇక బలమైన కథ.. ఆ కథలోని పాత్రలకు సరైన నటీనటులు తోడైతే అది నారీ నారీ నడుము మురారీ సినిమా అవుతుంది. సామజవరగమన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు రామ్ అబ్బరాజు..మరోసారి అలాంటి కామెడీ కథతోనే ఈ సినిమాను తెరెక్కించాడు. కథలో కొత్తదనం లేకున్నా.. స్క్రీన్‌ప్లేతో మరోసారి మ్యాజిక్ చేశాడు. ముఖ్యంగా డైలాగులు అదిరిపోతాయి. కథనం మొత్తం కరెంట్ పంచ్ డైలాగులతో హిలేరియస్ యాంగిల్ లో సాగుతుంది.ఆరు పదుల వయసులో హీరో తండ్రి.. పాతికేళ్ల వయసు ఉన్న అమ్మాయిని ప్రేమించడం.. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆమెను స్వయంగా కొడుకే తీసుకొచ్చి.. పెళ్లి చేయించే సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఇలా సినిమా ప్రారంభం నుంచి నవ్వుల యాత్రను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత గౌతమ్-నిత్యల లవ్‌స్టోరీని ‘పులిహోర’తో ముడిపెడుతూ చాలా హిలేరియస్‌గా చూపించాడు. ఈ జంట పెళ్లి కోసం రిజిస్టర్ ఆఫీస్‌కి వెళ్లిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. దియా ఎంట్రీతో కథనం మరో మలుపు తిరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కామెడీ డోస్ మరింత పెరగుతుంది. వెన్నెల కిశోర్ ఎంట్రీ..శ్రీమంతం ఎపిసోడ్..విడాకుల పేరుతో నడిచే కోర్టు డ్రామా.. అన్ని నాన్‌స్టాఫ్‌గా నవ్విస్తాయి. ముఖ్యంగా నరేశ్ పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు..ఆయన చెప్పే డైలాగులకు పడి పడి నవ్వుతారు. ఆయన పర్సనల్ లైఫ్‌పై కూడా పంచ్‌లు వేసుకోవడం..మరింత ఫన్ని జనరేట్ చేసింది. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. అయితే క్లైమాక్స్‌లో కూడా మళ్లీ నరేశ్‌పై పంచ్ డైలాగులు వేయడంతో నవ్వుకుంటూ ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఒకటి రెండు డైలాగులు మినహా ఎలాంటి వల్గారిటీ, బూతు సీన్లు లేకుండా క్లీన్ కామెడీతో ఫ్యామిలీ మొత్తం చూసేలా ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో కొత్తదనం ఆశించకుండా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్తే..హాయిగా రెండున్నర గంటల పాటు నవ్వుకోవచ్చు((Positive And Negatives Of Nari Nari Naduma Murari Movie).ఎవరెలా చేశారంటే...గౌతమ్ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. టైటిల్‌కి తగ్గట్టే ఇద్దరి అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడి పాత్ర ఇది. శర్వా పాత్ర టెన్షన్ పడే ప్రతిసారి ప్రేక్షకుడి నవ్వు ఆగదు. ఇక ఈ సినిమాకు రెండో హీరో నరేశ్. లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న కార్తిక్ పాత్రలో ఆయన జీవించేశాడు. ఆయన నిజ జీవితానికి ఈ పాత్రకు మధ్య పోలికలు ఉండడం.. డైలాగులు కూడా అలానే ఉండడంతో ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. సెకండాఫ్‌లో ఆయనకు మంచి సీన్లు పడ్డాయి. ఇక హీరోయిన్లు సాక్షి వైద్య, సంయుక్త.. ఇద్దరూ తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. కథకు సంబంధం లేకున్నా.. సత్య కామెడీ బాగా వర్కౌట్ అయింది. గురువుపై విపరీతమైన ప్రేమ చూసే గుణశేఖర్‌గా వెన్నెల కిశోర్ తనదైన నటనతో నవ్వించేశాడు. సంపత్ రాజు, సునీల్, సుదర్శన్.. ఇలా ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న ప్రతి చోట నవ్విస్తూనే ఉంటారు. భాను భోగవరపు అందించిన కథ.. డైలాగులు బాగున్నాయి. కేవలం హీరోకు మాత్రమే కాదు సినిమాలో అన్నిపాత్రలకు అదిరిపోయే డైలాగులు ఉంటాయి. రామ్ మంచి స్క్రీన్‌ప్లేతో ఫుల్ ఎంటర్టైనింగ్గా సినిమాను తెరకెక్కించాడు. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతగా గుర్తుండవు. జ్ఞానశేఖర్, యువరాజ్‌ల సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అండర్‌వేర్‌తో రోడ్డుపై నడుస్తా: టాలీవుడ్ నటుడు
శర్వానంద్ హీరోగా వస్తోన్న సంక్రాంతి సినిమా నారీ నారీ నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని అనిల్ సుంకర, రామబ్రహ్మ సుంకర నిర్మించారు.ఈ మూవీ రిలీజ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు మేకర్స్. ఈ ప్రెస్ మీట్‌కు హాజరైన టాలీవుడ్ నటుడు వీకే నరేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఏ క్యారెక్టర్ అయినా నేను ఎలాంటి లిమిట్స్ పెట్టుకోనని వీకే నరేశ్ అన్నారు. క్యారెక్టర్‌కు గౌరవం ఇస్తానని.. అందరికీ నచ్చేలా చేయడమే నా పని అన్నారు. గుంటూరు టాకీస్‌లో బాత్రూమ్లో సీన్ పెట్టారు.. అందులో చాలా ఎమోషన్ ఉంది అందుకే ఆ క్యారెక్టర్ చేశానని తెలిపారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఆండర్ వేర్‌తో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తానని వీకే నరేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా.. వీకే నరేశ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.ఒక నటుడిగా ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోను.. పాత్ర కోసం కావాలంటే ఆండర్ వేర్ తో రోడ్డు మీద నిల్చోమన్నా నేను రెడీ - నరేష్#Sharwanand #Samyuktha #SakshiVaidya #NariNariNadumaMurari #AnilSunkara pic.twitter.com/PAvkfJHXVf— Filmy Focus (@FilmyFocus) January 12, 2026 -
'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
పూతరేకులు కావాలి.. ఎవరైనా తీసుకురండి: హీరోయిన్ కామెంట్స్ వైరల్
శర్వానంద్ హీరోగా వస్తోన్న సంక్రాంతి సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజవ్వగా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో నారీ నారీ నడుమ మురారి మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఏపీలో ఆత్రేయపురంలో జరిగిన ఈ వేడుకలో హీరోయిన్స్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త తన కోరికను ఆడియన్స్‌తో పంచుకుంది. తనకు ఇక్కడ ఫేమస్ అయిన పూతరేకులు కావాలని అడిగింది. ఎవరైనా ఇంట్లో తయారు చేసిన పూత రేకులు తెచ్చిఇవ్వాలని ఫ్యాన్స్‌ను కోరింది. డ్రై ఫ్రూట్స్‌తో చేసిన పూతరేకులు తీసుకువస్తే.. హైదరాబాద్‌కు పట్టుకెళ్లిపోతానంటూ కామెంట్స్ చేసింది. హీరోయిన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #NariNariNadumaMurari is a Perfect Sankranthi Feast 🤩❤️🔥-Beautiful @iamsamyuktha_ at the Trailer launch 😍Watch Trailer here 🔗 https://t.co/Q9gnNSPYipLets Celebrate in theatres from Jan 14 | 5:49 PM onwards ✨🍿#SharwaSankranthiCharming Star @ImSharwanand @AnilSunkara1… pic.twitter.com/XF9d8LIS2Z— AK Entertainments (@AKentsOfficial) January 12, 2026 -
సంక్రాంతి సినిమాకు బంపరాఫర్.. ఎమ్మార్పీకే టికెట్స్..!
ఈ సంక్రాంతి టాలీవుడ్ సినిమాలు పెద్దఎత్తున సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ది రాజాసాబ్, మనశంకర వరప్రసాద్‌గారు రిలీజై థియేటర్లలో అలరిస్తున్నాయి. వీటితో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు చిత్రాలు అలరించేందుకు రెడీ అయిపోయాయి. ఈ నెల 14న శర్వానంద్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ఆడియన్స్‌కు బంపరాఫర్ ప్రకటించింది. నారీ నారీ నడుమ మురారి మూవీ టికెట్ ధరలపై క్రేజీ ఆఫర్ అనౌన్స్ చేసింది. కేవలం ఎమ్మార్పీ ధరలకే ఈ మూవీ టికెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని.. ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించగా.. శ్రీవిష్ణు అతిథి పాత్రలో మెప్పించనున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మ సుంకర నిర్మించారు. ఈ సంక్రాంతికి అసలైన పండుగ ఆఫర్! 🔥 MRP ధరలకే టికెట్లు 🎟️Catch #NariNariNadumaMurari at no extra charges! 🙌𝐎𝐧𝐥𝐲 𝐄𝐱𝐭𝐫𝐚 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭! 😎🤩💥Watch Trailer here 🔗 https://t.co/iZRE43vZzlLets Celebrate in theatres from Jan 14 | 5:49 PM onwards… pic.twitter.com/cDfrEBhL8e— AK Entertainments (@AKentsOfficial) January 12, 2026 -
'నారీ నారీ నడుమ మురారి' అదిరిపోయేలా ట్రైలర్
శర్వానంద్ నటిస్తున్న 'నారీ నారీ నడుమ మురారి' మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో విడుదలకానుంది. ఈ మూవీని దర్శకులు రామ్ అబ్బరాజు తెరకెక్కించగా.. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఇందులో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. వివాహ భోజనంబు, సామజవరగమన వంటి సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన రామ్ అబ్బరాజు తొలిసారి సంక్రాంతి రేసులో ఉన్నారు. ఈ మూవీలో శ్రీవిష్ణు అతిథి పాత్రలో కనిపించనున్నారు. -
నాతో నేను పోటీ పడుతుంటాను: సంయుక్త
‘‘బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్: ది సీక్రెట్ ఏంజెట్, అఖండ 2’.. ఇలా నా కెరీర్లో నటిగా నేను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలే చేస్తున్నాను. భవిష్యత్‌లో బయోపిక్ సినిమాల్లో నటించాలని ఉంది. ఇటీవల హిందీలో ‘హక్’ (యామీ గౌతమ్ నటించారు) అనే సినిమా చూశాను. కొన్ని సన్నివేశాలకు భావోద్వేగానికి గురై ఏడ్చాను.ఈ తరహా పాత్రలూ చేయాలని ఉంది’’ అని చెప్పారు హీరోయిన్స్ సంయుక్త. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంయుక్త విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో దియా అనే పాత్రలో నటించాను.తోటియాక్టర్స్తో పోలిక పెట్టుకోను. ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరచుకోవడానికి నాతో నేను పోటీ పడుతుంటాను. శర్వాగారి నుంచి మంచి కామిక్ టైమ్‌ను నేర్చుకున్నాను. సాక్షితో మంచి అనుబంధం ఏర్పడింది. రామ్‌గారు క్లారిటీ ఉన్న డైరెక్టర్. అనిల్‌గారు ఫ్యాషనేట్ ప్రోడ్యూసర్. పూరి జగన్నాథ్–విజయ్ సేతుపతిగార్ల సినిమాలో నటించాను. నేను మెయిన్స్ లీడ్‌లో ‘ది బ్లాక్‌గోల్డ్’ మూవీ చేస్తున్నాను’’ అని తెలిపారు. -
సంక్రాంతికి నా సినిమా రావడం సంతోషం
‘‘చిన్నప్పటి నుంచి సంక్రాంతికి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది డైరెక్టర్‌గా తొలిసారి సంక్రాంతికి నా సినిమా రావడం చాలా ఆనందాన్నిస్తోంది’’ అని రామ్ అబ్బరాజు చెప్పారు. శర్వానంద్ హీరోగా సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామ్ అబ్బరాజు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘శర్వానంద్‌గారి ‘బైకర్’ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడటంతో మాకు సంక్రాంతికి వచ్చే చాన్స్ దొరికింది. నేను తీసిన ‘వివాహ భోజనంబు, సామజవరగమన’ లానే ‘నారీ నారీ నడుమ మురారి’ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ‘రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు..’ వంటి వినోదాత్మక చిత్రాల తర్వాత శర్వానంద్‌గారు చేసిన ఎంటర్టైనర్ మూవీ ఇది. ఈ చిత్రంలో మంచి అతిథి పాత్ర ఉంది.. శ్రీవిష్ణుగారిని అడిగిన వెంటనే చేశారు. నా తర్వాతి సినిమాని శ్రీవిష్ణుగారితో క్రైమ్ కామెడీ జోనర్లో చేస్తున్నాను. నా ప్రతి సినిమాకి భాను, నందు రైటర్స్‌గా ఉన్నారు. ఇకపైనా ఇలానే కొనసాగుతుంది. ఇండస్ట్రీలో రచయితల కొరత ఉందనేది వాస్తవమే. చాలామంది డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వస్తారు. కాక΄ోతే కొందరు రైటర్‌గా కొన్నాళ్లు చేసి, ఆ తర్వాత డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తారు. నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గానే వచ్చాను. గుణశేఖర్‌గారి ‘నిప్పు’ సినిమాకి పని చేశాను’’ అని చెప్పారు. -
ఏజెంట్ సమయంలో మాటిచ్చి నిలబెట్టుకున్నారు!
'నారీ నారీ నడుమ మురారి' సినిమా కథ విన్నప్పుడు మంచి సినిమా చేసే అవకాశం వచ్చిందనిపించి, వెంటనే అంగీకరించాను. అంతేకానీ.. ఈ మూవీలో నా క్యారెక్టర్‌కు ఎంత స్క్రీన్ టైమ్ ఉంటుంది? నాతో పాటు మరో హీరోయిన్ నటిస్తున్నారా? లేదా? అన్న విషయాలను ఆలోచించలేదు. ఈ సినిమాకు స్టోరీ ఈజ్ కింగ్. మంచి వినోదాత్మక చిత్రం. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని తెలిపింది హీరోయిన్ సాక్షి వైద్య.కామెడీ టైమింగ్ అద్భుతంశర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఇందులో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర, రామ బ్రహ్మం సుంకర నిర్మించిన ఈ మూవీ జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాక్షి వైద్య విలేకరులతో మాట్లాడుతూ.. ఈ మూవీలో అమాయకంగా, చాలా నిజాయితీగా ఉండే నిత్య పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్ నాకు పర్సనల్‌గానూ రిలేట్ అవుతుంది. శర్వాగారి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. సంయుక్తతో నాకు మంచి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. మాట నిలబెట్టుకున్నారుతెలుగులో డైలాగ్స్ చెప్పడంలో దర్శకుడు రామ్‌గారు నాకు సాయపడ్డారు. నాకు మరోసారి అవకాశం కల్పిస్తానని ఏజెంట్ మూవీ సమయంలోనే నిర్మాత అనిల్ సుంకర గారు చెప్పారు. నారీ నారీ నడుమ మురారి మూవీతో ఆ మాటను నిలబెట్టుకున్నారు. అనూప్‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను ఫిజియోథెరపీ చేశాను. కానీ, ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం లేదు. సంక్రాంతిని మేం సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఉత్తరాదితో సంక్రాంతి సెలబ్రేషన్స్ హడావుడి కాస్త తక్కువగా ఉంటుంది. కొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశాను అని చెప్పుకొచ్చింది.చదవండి: ఈ కష్టం తనకు అవసరమే లేదు: కూతురిపై చిరంజీవి ప్రశంసలు -
తానున్న చోటే వేడుక...
‘‘అమ్మాయి అచ్చ తెలుగు సాంప్రదాయ సుందరి... సౌభాగ్య లక్ష్మిపోలిక.., అబ్బాయి మాటకారి... మోహనాంగుడే మరి... తానున్న చోటే వేడుక’’ అంటూ సాగుతుంది ‘భల్లే భల్లే’ పాట. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంలోని పాట ఇది. ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలుగా నటించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14 సాయంత్రం నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ఈ సినిమాలోని ‘భల్లే భల్లే’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.‘భల్లే భల్లే భల్లే భల్లే బాగుందిలే ఈ రెండు మనసుల కూడిక... మాయే చేసిందిలే... మంత్రం వేసిందిలే’ అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, హరిచరణ్ పాడారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ‘‘కేరళలోని పచ్చని ప్రకృతి సౌందర్యం నేపథ్యంలో చిత్రీకరించిన పాట ఇది. ఈ పాటలో శర్వా, సాక్షిల మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. హీరో శ్రీవిష్ణు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాలో సత్య, సునీల్, సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి. ఈ సీజన్ అంటే టాలీవుడ్‌కి చాలా ప్రత్యేకం అని చెప్పాచ్చు. అందుకే పెద్దా... చిన్నా అనే తేడా లేకుండా చాలా సినిమాలు సంక్రాంతి రోజుల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. ఈ కారణంగానే స్టార్ హీరోలు, యువ కథానాయకులు, దర్శక నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి ఏటా మంచి పోటీ నెలకొంటుంది.పైగా సంక్రాంతి సెలవులు ఉంటాయి కాబట్టి ఇంటిల్లిపాదీ సరదాగా సినిమాలకు వెళుతుంటారు. అందుకే ఈ సమయంలో వచ్చే సినిమాల్లో చాలా వరకు మంచి కమర్షియల్ సక్సెస్‌లు అందుకుంటూ ఉంటాయి. ఈ సంక్రాంతి కూడా గట్టి పోటీ నెలకొంది. చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాలన్నీ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కడంతో ఈ సంక్రాంతి ఫ్యామిలీ స్పెషల్‌గా మారింది. ఈ సంక్రాంతి రేసులో నిలిచిన కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.భార్యా భర్తల నేపథ్యంలో... చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ ఏడాది వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బిగ్టెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘మన శంకర వరప్రసాద్‌గారు’కి దర్శకుడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, హీరో వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషించారు. అదే విధంగా కేథరిన్ కీలక పాత్ర చేశారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ సినిమా ఆరంభం నుంచే 2026 సంక్రాంతికి విడుదల లక్ష్యంగా శరవేగంగా చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పోందిన ఈ సినిమాలో నయనతార, చిరంజీవి భార్యాభర్తలుగా నటించారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోతుందట. ఆ తర్వాత వీరిద్దరూ తిరిగి కలిశారా? లేదా అనే నేపథ్యంలో భావోద్వేగాలు, వినోదాలతో ఈ సినిమా రూ పోందినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. తనదైన మార్క్ కామెడీ, యాక్షన్ తో ఈ చిత్రాన్ని రూ పోందించారట అనిల్ రావిపూడి. ఇద్దరు స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఒకే సినిమాలో కనిపించనుండటంతో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ పై ట్రేడ్ వర్గాల్లో మంచి జోష్ నెలకొంది. అదే విధంగా ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల...’, ‘శశిరేఖ...’ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ పోందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతి పండగకి ప్రేక్షకులకు సరైన వినోదాలను అందిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.ఆదివారం విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ‘‘శశీ.. వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావ్? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవా అందరూ చూస్తున్నారు ప్లీజ్’, ‘నా వాట్సప్ నంబరు కొంచెం అన్‌బ్లాక్ చేయవా ప్లీజ్’, ‘మనల్ని టార్చర్ పెట్టే పెళ్లాం తరఫు బంధువుల్ని... మరీ ముఖ్యంగా అత్తగార్ని, మావగార్ని ఆడుకుంటుంటే ఉంటదయ్యా పిచ్చ హై వస్తుంది’ అంటూ చిరంజీవి చెప్పే డైలాగులు బాగున్నాయి. అదే విధంగా ‘చూడ్డానికి మాంచి ఫ్యామిలీ మేన్‌లా ఉన్నావ్... ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావేంటి?’ అని చిరంజీవి అంటే... ‘మాస్కే బాస్‌లా ఉన్నావ్... నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి’ అంటూ వెంకటేశ్ చెప్పడం కూడా ఆసక్తిగా ఉంది. భార్య... భర్త... ఓ ప్రేయసి రవితేజ మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులకు వినోదాలు అందించేందుకు సిద్ధమమ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ‘నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టైటిల్‌ని బట్టి చూస్తే ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండబోతోందని అర్థమవుతోంది.డింపుల్ హయతితో ఏడడుగులు వేసిన రవితేజ (రామసత్యనారాయణ) స్పెయిన్ వెళతాడు. అక్కడ ఆషికా రంగనాథ్‌తో ప్రేమలో పడతాడు. ఈ విషయం రామసత్యనారాయణ భార్యకి తెలిసిందా? రామసత్యనారాయణకి అప్పటికే పెళ్లయిన విషయం తెలుసుకున్న ఆషికా రంగనాథ్ ఏం చేశారు? ఈ ముక్కోణపు కుటుంబ ప్రేమకథా చిత్రం చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది? అన్నది ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తుందట. సున్నితమైన అంశాలకు తనదైన శైలిలో భావోద్వేగాలను జోడించి, తెరకెక్కించే కిశోర్ తిరుమల ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో భార్య, భర్త, ఓ ప్రేయసి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ను వినోదాత్మకంగా చూపించినట్లు తెలుస్తోంది. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు... సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ... ఇలా అన్నింటినీ అడిగాను... బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో.అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను. ఆశ్చర్యపోయారే త΄్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ గ్లింప్స్‌లో ఇప్పటికే ఆకట్టుకున్నాయి. అదే విధంగా ఈ మూవీ టీజర్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్‌ని నేడు గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు మేకర్స్. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూ పోందిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల టచ్‌తో ఉంటుంది. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇందులో వినోదంతో పాటు మనసుని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉంటాయి’’ అని మేకర్స్ తెలిపారు. నానమ్మమనవడి కథ వరుస పాన్ ఇండియా సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’. నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 2026 సంక్రాంతికి వస్తున్న తొలి చిత్రం ఇది.‘ది రాజాసాబ్’ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రభాస్ వింటేజ్ లుక్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీ పోస్టర్స్, టీజర్, గ్లింప్స్‌కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి ద్విపాత్రాభినయం చేయడంతో ఇటు ట్రేడ్ వర్గాల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే ఫుల్ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాలో తాతయ్య పాత్రను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, నానమ్మ క్యారెక్టర్‌ను జరీనా వాహబ్ చేశారు. ఈ మూవీ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కినప్పటికీ కథ మొత్తం ప్రధానంగా నానమ్మమనవడిపైనే సాగుతుందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ తెలిపారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.‘‘ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అందరితోనవ్వులు పూయిస్తుంది. మా సినిమా ఏ ఒక్కర్ని కూడా నిరాశపరచదు’’ అంటూ డైరెక్టర్ మారుతి ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నారు. ‘‘ది రాజా సాబ్’ సినిమాలో మా నానమ్మగా జరీనా వాహబ్గారు నటించారు. ఆమె అద్భుతమైన నటి. డబ్బింగ్ చెబుతుంటే నా సీన్న్స్ మర్చిపోయి నానమ్మ సీన్న్స్ చూస్తుండిపోయాను. ఆమె నటనకు ఫ్యాన్ అయిపోయాను.‘ది రాజా సాబ్’లో నాతో పాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఈ సినిమా నానమ్మమనవడి కథ’’ అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడటాన్ని బట్టి చూస్తే... ఇది తప్పకుండా నానమ్మమనవడి కథ అని చెప్పడానికి ఆలోచించక్కర్లేదు. ‘‘మా సంస్థ (పీపుల్స్ మీడియా) నుంచి వస్తున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ప్రభాస్‌గారిని ‘బుజ్జిగాడి’ సినిమా స్టైల్లో వింటేజ్ లుక్‌లో చూపిస్తున్నాం. ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేశాం. 40 నిమిషాల క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని టీజీ విశ్వప్రసాద్ ఇటీవల తెలిపారు. నారీ నారీ నడుమ మురారి నారీ నారీ నడుమ హీరో శర్వానంద్ ఎలాంటి తిప్పలు పడ్డారు? అన్నది తెలియాలంటే ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదల వరకూ ఆగాల్సిందే. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ‘సామజ వరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాని ఈ నెల 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.‘ఎక్స్‌ప్రెస్ రాజా’ (2016), ‘శతమానం భవతి’ (2017) వంటి సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచి, విజయాలు అందుకున్న శర్వానంద్ మరోసారి ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త ప్రేమించుకుంటారు. అయితే మనస్పర్థల వల్ల ఆ ప్రేమకు ఫుల్స్టాప్ పడుతుంది. ఈ నేపథ్యంలో సాక్షీ వైద్యతో ప్రేమలో పడతారు శర్వానంద్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఒకే ఆఫీసులో పని చేస్తుంటారు. అదే ఆఫీసులో టీమ్ లీడర్‌గా తన మాజీ ప్రేయసి సంయుక్త జాయిన్ అవుతారు.ఓ వైపు మాజీ ప్రేయసి... మరోవైపు ప్రజెంట్ గర్ల్‌ఫ్రెండ్. వీరిద్దరి మధ్య శర్వానంద్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనే కథాంశంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు రామ్ అబ్బరాజు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘‘శర్వానంద్ నటించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఇప్పటికే విడుదలైన మా మూవీ ఫస్ట్ లుక్, ప్రమోషనల్ పోస్టర్లు బజ్ క్రియేట్ చేశాయి. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. శర్వానంద్‌కి సంక్రాంతి లక్కీ సీజన్ అని చెప్పాచ్చు. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మురారి’తో మరో సంక్రాంతి హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది. రాజుగారి పెళ్లి... ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నవీన్ పోలిశెట్టి. ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా ద్వారా మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (2023) సినిమా తర్వాత బైక్ యాక్సిడెంట్ కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్నారు నవీన్.రెండేళ్లకు పైగా విరామం అనంతరం ఆయన నుంచి వస్తున్న తాజా సినిమా ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నవీన్ పోలిశెట్టి భార్యా భర్తలుగా నటించారు. ఈ మూవీ పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూ పోందింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి విడుదలైన ‘భీమవరం బల్మా..’ అంటూ సాగే మొదటి పాట ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా పలు వేదికలపై ఈ పాటకు నవీన్, మీనాక్షి కలిసి వేసిన డ్యాన్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ పాటతో నవీన్ పోలిశెట్టి మొదటిసారి గాయకుడిగా మారడం మరో విశేషం. ‘‘అనగనగా ఒక రాజు’ సినిమాలో వినోదం, మాస్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమకథ వంటి అంశాలన్నీ ఉంటాయి. ఈ సినిమాలో మీనాక్షి కామెడీ టైమింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మా చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నమ్ముతున్నాను. ఈ 14న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం’’ అంటూ నవీన్ పోలిశెట్టి ఇటీవల ఓ వేడుకలో మాట్లాడారు.జన నాయగన్తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తమిళ చిత్రం ‘జన నాయగన్’. (తెలుగులో జన నాయకుడు). హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ కెరీర్లో 69వ మూవీ. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, మమితా బైజు కీలకపాత్రల్లో నటించారు. కేవీఎన్ ్ర΄÷డక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ సినిమా ఈనెల 9న తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. తమిళ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ‘జన నాయకుడు’ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అంటే... ఇదే ఆయన ఆఖరి సినిమా అన్నమాట. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. కుటుంబ కథా చిత్రాంగా రూపొందిన ఈ మూవీలో విజయ్ కుమార్తెగా మమితా బైజు నటించారు. ఈ సినిమా తెలుగు హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా రూపొందినట్లు తమిళ చిత్ర పరిశ్రమ టాక్. తెలుగులో శ్రీలీల చేసినపాత్రని తమిళంలో మమితా బైజు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైనపాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా విజయ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. – డేరంగుల జగన్ మోహన్ -
సంక్రాంతికి రిలీజ్ అంటే చాలా మంది నమ్మలేదు : అనిల్ సుంకర
‘‘స్క్రిప్ట్ విని, ఈ కథతో సినిమా చేయగలమా? లేదా అనే ఓ జడ్జ్‌మెంట్‌కు రాగలగాలి. సినిమా రిజల్ట్ ఎలాగూ మన చేతిలో ఉండదు. అందుకే సినిమా స్క్రిప్ట్ లెవల్లోనే అన్నీ జాగ్రత్తగా చూసుకోగలగాలి. అఖిల్‌తో మేం చేసిన ‘ఏజెంట్’ సినిమాకు బౌండ్ స్క్రిప్ట్ లేదు. దాంతో ఆ సినిమాకు సరైన ఫలితం రాలేదు. అందుకే మంచి స్క్రిప్ట్‌తో వస్తేనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. స్క్రిప్ట్ ప్రకారం సినిమా వచ్చిందంటే ఆ సినిమా బాగున్నట్లే’’ అని చె΄్పారు నిర్మాత అనిల్ సుంకర. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న సాయంత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్ సుంకర మాట్లాడుతూ–‘‘నారీ నారీ నడుమ మురారి’ పండగ మూవీ. ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రం ఇది. ఈ చిత్రంలో శర్వానంద్ మంచి క్యారెక్టర్ చేశారు. శ్రీవిష్ణు గెస్ట్ రోల్ చేశారు. ఒకే ఆఫీసులో ఓ అబ్బాయి మాజీ ప్రేమికురాలు, ఆ అబ్బాయి ప్రస్తుత లవర్ ఉంటే... ఆ అబ్బాయి పరిస్థితి ఏమిటి? అన్నదే ఈ సినిమా కథ. పెళ్లి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. మా సినిమాను మేం సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అంటే చాలా మంది నమ్మలేదు. కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు. కానీ మేం ముందుగా చెప్పినట్లే సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రాన్ని నైజాం, వైజాగ్ ఏరియాల్లో ‘దిల్’ రాజుగారు, వెస్ట్, కృష్ణా, గుంటూరులో రాజా, సీడెడ్‌లో శోభన్ రిలీజ్ చేస్తున్నారు. ఈస్ట్‌లో మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. ఇక సంక్రాంతి సీజన్లో నాలుగైదు సినిమాలు రావడం అనేది కామన్. ఈ సీజన్లో విడుదలైన సినిమాలన్నీ హిట్ అయిన సందర్భాలూ ఉన్నాయి. మన తెలుగు చిత్రాలతో పాటు అనువాద చిత్రాలూ విడుదలవుతున్నాయి. అయితే కంటెంట్ బాగున్న సినిమాలకే ప్రేక్షకాదరణ లభిస్తుంది. ‘నారీ నారీ నడుమ మురారి’కి ఓటీటీ డీల్ పూర్తయింది. నూతన నటీనటులతో ‘ఎయిర్ ఫోర్స్ బెజవాడ బ్యాచ్’ అనే మూవీ చేయబోతున్నాం. అడివి శేష్‌తో ‘గూఢచారి 2’ రాబోతోంది. సాయిదుర్గాతేజ్, తేజ సజ్జాలతో సినిమాలున్నాయి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘ఏజెంట్’ సినిమా విఫలమైంది. అఖిల్‌కు ఓ హిట్ ఇస్తే ఆ బాధ పోతుంది. ‘భోళా శంకర్’ సినిమాకూ సరైన ఫలితం రాలేదు. ఇదే సినిమా నాలుగేళ్ల క్రితం విడులై ఉంటే, బాక్సాఫీస్ ఫలితం మరోలా ఉండేది’’ అని పేర్కొన్నారు. -
'నారీ నారీ నడుమ మురారి' మూవీలో మరో హీరో
టాలీవుడ్ హీరో శర్వానంద్ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. నారీ నారీ నడుమ మురారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సర్ప్రైజ్ వదిలారు. టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు కీలక పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఒక స్పెషల్ సర్ప్రైజ్ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో వదిలారు. ఒక ప్రత్యేక జోడింపు.. ఒక ప్రత్యేక ప్రకటన.. నవ్వుల పండగకి సిద్ధంగా ఉండండి అంటూ శ్రీవిష్ణు ఎంట్రీని చూపించారు. నారీనారీ నడుమ మురారి విషయానికి వస్తే.. సామజవరగమన ఫేమ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించారు. సంక్రాంతి బరిలో సినిమాలుసంక్రాంతి బరిలో నారీనారీ నడుమ మురారితో పాటు మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి. ప్రభాస్ 'రాజాసాబ్', విజయ్ 'జననాయగణ్' జనవరి 9న విడుదలవుతున్నాయి. శివకార్తికేయన్ 'పరాశక్తి' జనవరి 10న, చిరంజీవి 'శంకరవరప్రసాద్' జనవరి 12న, రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జనవరి 13న, నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' జనవరి 14న విడుదల కానున్నాయి. A special addition, a special announcement! 📢The stage is set to welcome King of Entertainment @sreevishnuoffl into #NariNariNadumaMurari 😍❤️🔥Get ready for laughter overload! 😂🔥Catch it in theatres from Jan 14 | 5:49 PM onwards ✨🍿Charming Star @ImSharwanand… pic.twitter.com/XrmD6fRh5b— AK Entertainments (@AKentsOfficial) January 4, 2026 చదవండి: జన నాయగణ్ ట్రైలర్లో ఏఐ -
పెద్ద టైటిల్.. ఇప్పుడు ఇదే ట్రెండ్ గురూ!
టైటిల్ క్యాచీగా ఉంటే ఆడియన్స్ అటెన్షన్‌ని ఈజీగా క్యాచ్ చేస్తుంది... అది చిన్న టైటిలా? పెద్ద టైటిలా? అన్నది కాదు. అయితే ఒక్కోసారి రెండక్షరాలతోనే టైటిల్ కుదరొచ్చు... ఇరవై అక్షరాలతోనూ కుదరొచ్చు. ఇప్పుడు కొన్ని టైటిల్స్ చూస్తే మాత్రం ‘పెద్ద’ టైటిల్ ట్రెండ్ సాగుతున్నట్లనిపిస్తోంది. ఆ లెంగ్తీ టైటిల్స్ అన్నీ అచ్చ తెలుగులో చక్కగా క్యాచీగా ఉన్నాయి. ఆ టైటిల్స్, ఆ చిత్రాల్లో నటిస్తున్న హీరోలు, ఆ కథా కమామీషులోకి వెళదాం. మన శంకరవరప్రసాద్‌గారు... ‘ఆచార్య, గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్, విశ్వంభర’ వంటి చిన్న టైటిల్స్ చిత్రాల తర్వాత చిరంజీవి నటిస్తున్న పెద్ద టైటిల్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ కావడం విశేషం. ఈ చిత్రంలో శంకర వరప్రసాద్, శశిరేఖల ప్రేమకథ, కుటుంబ గాథల కహానీ ఏంటి? అన్నది తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ (2019) చిత్రం తర్వాత చిరంజీవి–నయనతార జోడీగా నటిస్తున్న సినిమా ఇది (‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో అన్న, చెల్లెలుగా నటించారు). ఈ చిత్రంలో హీరో వెంకటేశ్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, కేథరీన్ , సచిన్ ఖేడేకర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నయనతార (శశిరేఖ), చిరంజీవి (వరప్రసాద్ పాత్రలో) భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వెండితెరపై వీరిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? అన్నది ‘మీసాల పిల్ల...’ అనే పాటలో చూపించారు. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. అంతేకాదు... తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలైన చిరంజీవి–వెంకటేశ్ కలిసి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో నటస్తుండటంతో ఈ సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన తొలి΄ాట ‘మీసాల పిల్ల...’, ద్వితీయ పాట ‘శశిరేఖ...’ ఏ స్థాయిలో శ్రోతలను అలరించాయో తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47... కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని., మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను అలరించడంలో వెంకటేశ్ దిట్ట. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తన కెరీర్లో ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకున్నారాయన. అంతేకాదు... కెరీర్లో తొలిసారి రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డును సాధించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక– హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేశ్ సినీ ప్రయాణంలో 77వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ అనే టైటిల్‌ని ఖరారు చేసి, ఈ నెల 10న ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ‘‘కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేశ్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. వీరిద్దరి కలయికలో రానున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా వెండితెరపై వినోదాల విందుని అందించనుంది. వెంకటేశ్–త్రివిక్రమ్ కలయిక ప్రేక్షకులందరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘నారప్ప, దశ్యం 2, ఎఫ్ 3, సైంధవ్, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి షార్ట్ టైటిల్స్ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న బిగ్ టైటిల్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47’. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి.... హీరో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. రవితేజ కెరీర్లో 76వ సినిమాగా రూ΄÷ందుతోన్న ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామసత్యనారాయణ పాత్రలో నటిస్తున్నారు రవితేజ. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోలో.. ‘‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, ఏఐ, చాట్ జీపీటీ, జెమిని.. ఇలా అన్నింటినీ అడిగాను. మే బీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్లని ముఖ్యంగా మొగుళ్లని అడిగాను.. ఆశ్చర్యపోయారే తప్పా ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు అడగకూడదని, పెళ్లయిన వాళ్లకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ.. మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే... భర్త మహాశయులకు విజ్ఞప్తి’’ అంటూ రవితేజ పలికిన సంభాషణలకు మంచి స్పందన వచ్చింది. ‘‘చాలా రోజుల తర్వాత రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్ చేయడం రిఫ్రెషింగ్‌గా ఉంది. అద్భుతమైన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో తన వెర్సటాలిటీని ప్రజెంట్ చేశారు రవితేజ. కిషోర్ తిరుమల టచ్‌తో ఈ టైటిల్ ఫ్యామిలీ ఫీలింగ్ కలిగించింది. మా సినిమా పక్కా ఎంటర్టైనింగ్గా, మనసుని హత్తుకునేలా ఉంటుంది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్కి సంక్రాంతి పర్ఫెక్ట్ సీజన్’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే... ‘ధమాకా, మాస్ జాతర’ వంటి చిత్రాల తర్వాత హీరో రవితేజ–సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కాంబినేషన్లో వస్తోన్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా నుంచి విడుదలైన ‘బెల్లా బెల్లా...’, ‘అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే...’ వంటి ΄ాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా ‘ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర’ వంటి చిన్న టైటిల్స్ సినిమాల తర్వాత రవితేజ నటిస్తున్న పెద్ద టైటిల్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో నిలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘గబ్బర్ సింగ్’ (2012) సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వీరి కలయికలో రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి విడుదల చేసిన పవన్ కల్యాణ్ ప్రత్యేక ΄ోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘దేఖ్ లేంగే సాలా...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ ΄ాటను భాస్కరభట్ల రాయగా, విశాల్ దడ్లానీ ΄ాడారు. ఇప్పటికే టాకీ ΄ార్ట్ పూర్తి చేసుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని 2026లో థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నారీ నారీ నడుమ మురారి బాలకృష్ణ హీరోగా శోభన, నిరోషా హీరోయిన్లుగా రూ΄÷ందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఎ. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో నరసింహ నాయుడు నిర్మించిన ఈ మూవీ 1990 ఏప్రిల్ 27న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రిలీజైన ముప్పై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే.. ‘నారీ నారీ నడుమ మురారి’ పేరుతో శర్వానంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. ‘సామజవరగమన’ మూవీ ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంయుక్త, సాక్షీ వైద్య కథానాయికలు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రంలో శర్వానంద్, సంయుక్త, సాక్షీ వైద్య బావా మరదల్లుగా నటించారట. మరి... ఇద్దరు మరదల్లు కలిసి బావని ఎలా ఆటపట్టించారు? ఈ బావా–మరదల్లు వెండితెరపై చేసిన సందడి ఏ స్థాయిలో నవ్వులు పంచింది? అన్నది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5:49 గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ (2016’, ‘శతమానం భవతి’ (2017) వంటి సినిమాలతో సంక్రాంతి బరిలో దిగి హిట్స్ అందుకున్న శర్వానంద్, ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో 2026 సంక్రాంతికి ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. ‘‘ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. జాయ్ ఫుల్ హిలేరియస్ రైడ్‌గా ఈ చిత్రం ఆడియ¯Œ ్సను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అనగనగా ఒకరాజు ‘జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాలు పంచిన నవీ¯Œ ΄÷లిశెట్టి హీరోగా నటిస్తున్న తాజా వినోదాత్మక చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూ΄÷ందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్, ప్రోమోస్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రత్యేకించి సంక్రాంతి ప్రోమో అంటూ రిలీజ్ చేసిన నవీన్ లుక్ ఆకట్టుకుంది. బ్లూ అండ్ వైట్ కుర్తా, పైజామా ధరించి కళ్లజోడు పెట్టుకుని పక్కా సంక్రాంతి బుల్లోడిలా ఉన్నారు నవీన్. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో జాయింట్ వీల్, భారీ ఎత్తున ప్రజలు ఉన్నారు. ఆ పోస్టర్ పక్కాగా సంక్రాంతి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి నవంబరు 27న విడుదలైన ‘భీమవరం బల్మా...’ అంటూ సాగే ΄ాటకి అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ‘‘సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే సంక్రాంతికి సరైన సినిమాగా ‘అనగనగా ఒక రాజు’ను రిలీజ్ చేయనున్నాం. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేలా మా చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల ప్రేక్షకులముందుకొస్తోంది. ఓం శాంతి శాంతి శాంతి ‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. దర్శకుడిగా తనకంటూ చక్కని గుర్తింపు సొంతం చేసుకున్న ఆయన నటుడిగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈషా రెబ్బా కథానాయికగా నటించారు. నూతన దర్శకుడు ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో ఎస్ ఒరిజినల్స్–మూవీవెర్స్ స్టూడియోస్‌పై సజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మించారు. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ ఇతర పాత్రలు పోషించారు. మలయాళ సినిమా ‘జయ జయ జయ జయహే’కి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాని తొలుత ఆగస్టు 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ విడుదల వాయిదా పడింది. 2026 జనవరి 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ ఓ వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా, ఈషా రెబ్బా కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయి ΄ాత్ర చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. అంబటి, ప్రశాంతిల పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదాలు, గొడవలు ఆరంభమవుతాయి. ఈ సమయంలో కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది?’’ అనేది మా సినిమాలో ఆసక్తిగా ఉంటుంది. మా మూవీ ఆడియన్స్‌ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఆకాశంలో ఒక తార ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్నారు దుల్కర్ సల్మాన్. అంతేకాదు... మలయాళ హీరో అయినప్పటికీ తెలుగు కథానాయకుడే అన్నట్లు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారాయన. మలయాళంలో స్టార్ హీరోల్లో ఒకరిగా దూసుకెళుతున్న ఆయన తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సైతం మంచి ఫ్యాన్ బేస్ సం΄ాదించుకున్నారు. దుల్కర్ నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. జూలై 28న దుల్కర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్‌కి చక్కని స్పందన వచ్చినట్లు చిత్రబందం పేర్కొంది. దుల్కర్ సల్మాన్ ఓ సాధారణ రైతు ΄ాత్ర చేశారు. ఓ పల్లెటూరికి చెందిన ఆయన అంతరిక్షంలోకి వెళ్లాలనే తన కలని ఎలా నెరవేర్చుకున్నాడు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని తెలుస్తోంది. ‘‘సీతారామం, లక్కీ భాస్కర్, మహానటి’ వంటి వరుస హిట్లతో టాలీవుడ్లో దూసుకెళుతున్న దుల్కర్ సల్మాన్.. ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటారనే నమ్మకం ఉంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం మా సినిమాకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ టైటిల్స్ మాత్రమే కాదు... ఇంకా లెంగ్తీ టైటిల్ ఉన్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రిలీజ్
గత కొన్నేళ్లుగా సరైన హిట్ అనేదే లేక ఇబ్బంది పడుతున్న తెలుగు హీరో శర్వానంద్.. ల్యాంగ్ గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'నారీ నారీ నడుమ మురారి' పేరుతో తీసిన సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రానుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో శర్వా సరసన సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర నిర్మించారు.(ఇదీ చదవండి: పెళ్లిలో తెలుగు స్టార్ హీరో భార్యతో కీర్తి సురేశ్ డ్యాన్స్)టీజర్ చూస్తుంటే కామెడీ బాగానే ఉంది. విజువల్స్, మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా అనిపించాయి. కాకపోతే సంయుక్త, నరేశ్, సునీల్ డబ్బింగ్ ఏదో తేడాగా అనిపించింది. ఆఫీస్‌లో ఓ అమ్మాయిని ప్రేమించిన హీరో, హీరోయిన్‌తో పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ ఇతడి టీమ్ లీడర్‌గా మరో హీరోయిన్ వస్తుంది. ఈమెకి హీరోకి గతంలో లవ్ స్టోరీ ఉంటుంది. మరి ఇద్దరు హీరోయిన్లలో హీరో ఎవరిని పెళ్లి చేసుకున్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది.సంక్రాంతి బరిలో దీనితో పాటు చాలా సినిమాలు ఉన్నాయి. జనవరి 9న ప్రభాస్ 'రాజాసాబ్' రానుంది. ఇదే రోజున తమిళ డబ్బింగ్ మూవీ 'జననాయగణ్' పోటీలో ఉంది. 10వ తేదీన మరో తమిళ డబ్బింగ్ సినిమా 'పరాశక్తి' విడుదల కానుంది. 12వ తేదీన 'చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు', 13న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 14న నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' రిలీజ్ కానున్నాయి. మరి వీటితో పోటీపడి శర్వా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి?(ఇదీ చదవండి: స్టార్ హీరో రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన ప్రముఖ నిర్మాత) -
అటు ప్రభాస్..ఇటు చిరు..నడుమ శర్వా.. పెద్ద రిస్కే!
టాలీవుడ్‌కి సంక్రాంతి పండగ పెద్ద సీజన్. ప్రతిసారి రెండు, మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు ఒకటి, రెండు చిన్న సినిమాలు విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. పొంగల్ బరిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లాంటి చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీలోకి చివరికి ఎంట్రీ ఇచ్చిన హీరో శర్వానంద్(Sharwanand ). అంతేకాదు సంక్రాంతి పండక్కి చివరి రోజు రిలీజ్ అయ్యే సినిమా కూడా శర్వానంద్‌దే. ఆయన నటించిన ఫ్యామిలీ డ్రామా ‘నారీ నారీ నడుము మురారి’(Nari Nari Naduma Murari) చిత్రం జనవరి 15 విడుదల కానుంది. రిలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే.. జనవరి 14న సాయంత్రం ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్‌గా అసలు డేట్ 15 అయినప్పటికీ.. జనవరి 14నే ఈ చిత్రం విడుదల అవుతున్నట్లు లెక్క. పోటీలో ఐదు పెద్ద సినిమాలు ఉన్నన్నప్పటికీ.. సంక్రాంతి బరిలోకి తన సినిమాను కూడా నిలపడానికి శర్వాకు ఉన్న ధైర్యం ఏంటి? గతంలో ఇలాంటి ప్రయోగాలు ఫలించాయా?శర్వా నమ్మకం అదే.. ఈ సంక్రాంతికి మొదటి ప్రేక్షకులను పలకరించబోతున్న హీరో ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన హారర్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’ జనవరి 9న రిలీజ్ కానుంది. అదే రోజు విజయ్ చివరి చిత్రం జననాయక్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు చిత్రంతో చిరంజీవి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. డేట్ ప్రకటించలేదు కానీ..జనవరి 12న ఈ చిత్రం ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. రవితేజ భర్త మహాశయులు కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. మరోవైపు శివకార్తికేయన్ పరాశక్తి, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు నారీ నారీ నడుమ మురారీ కూడా అదే రోజు విడుదల అవుతుంది. సినిమాపై నమ్మకంతో శర్వా పోటీలోకి దిగుతున్నాడు. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందట. అదిరిపోయే కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్గా కథనం సాగుతుందట. ఈ సినిమా ప్రివ్యూని కొంతమంది సినీ పెద్దలకు చూపించగా..అదిరిపోయిందని చెప్పారట. ఆ నమ్మకంతోనే స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు శర్వా. గత చరిత్ర ఏం చెబుతోంది?గతంలో బడా హీరోలతో సంక్రాంతి బరిలోకి దిగి శర్వా రెండు సార్లు గెలిచారు. 2016 సంక్రాంతి పండక్కీ శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’విడుదలై భారీ విజయం సాధించింది.అప్పుడు నాగార్జున 'సొగ్గాడే చిన్ని నాయన', బాలకృష్ణ 'డిక్టేటర్', ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'లాంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ.. శర్వా సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2017 సంకాంత్రికి శతమాణం భవతి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. అప్పుడు చిరంజీవి 'ఖైదీ నెం. 150', బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో క్లాష్ వచ్చింది. అయినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌తో పాటు నేషనల్ అవార్డ్ (బెస్ట్ పాపులర్ ఫిల్మ్) కూడా దక్కించుకున్నాడు.ఈసారి అంత ఈజీకాదు.. !అయితే గతంలో శర్వానంద్ సినిమాలు సంక్రాంతికి వచ్చినప్పడు.. ఒకటి రెండు సినిమాలతో మాత్రమే పోటీ ఉంది. ఈసారి అలా కాదు ఏకంగా అరడజను సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులోనూ చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలన్నింటిపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో శర్వా పెద్ద రిస్కే చేశాడు. సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్ దొరకడమే కష్టం. మిగతా సినిమాల టాక్ బాగుంటే.. ఈ సినిమాను ఆదరించడం కష్టమే. సూపర్ హిట్ టాక్ వస్తే తప్పా..మురారి దగ్గరకు ప్రేక్షకులు రారు. మరి శర్వా సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. -
సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి.. ఇలా కూడా రిలీజ్ చేస్తారా?
సంక్రాంతి సినిమాల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాది ముందే కర్ఛీప్ వేసేయాల్సిందే. లేదంటే చివరికీ వచ్చేసరికి పోటీ మరింత పెరిగిపోతుంది. అలా ఇప్పటికే వచ్చే ఏడాది రిలీజయ్యే పొంగల్ సినిమాలు చాలా వరకు డేట్స్ ప్రకటించారు. వాటిలో మనశంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, ది రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి అఫీషియల్ తేదీలు వెల్లడించారు.తాజాగా మరో టాలీవుడ్ హీరో సంక్రాంతి పోటీలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు, శర్వానంద్ హీరోగా వస్తోన్న నారీ నారీ నడుమ మురారి రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుందని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ రివీల్ చేసింది. అయితే ఈ సినిమా సాయంత్రం ఐదు గంటల 49 నిమిషాలకు విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇదే ఆడియన్స్‌కు కాస్తా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఏ మూవీ అయినా రిలీజ్ డే మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఇలా సాయంత్రం వేళ మూవీని విడుదల చేసి కొత్త ట్రెండ్‌కు తెర తీస్తున్నారా అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. ఈ లెక్కన ఈవినింగ్ ఫస్ట్ షోతో నారీ నారీ నడుమ మురారి షురూ కానుంది. కాగా.. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్లో 37వ చిత్రంగా నిలవనుంది. This Sankranthi is set to deliver a HATTRICK BLOCKBUSTER for our Charming Star @ImSharwanand! 🌟The celebration begins with #NariNariNadumaMurari, hitting theatres January 14th, 2026 from 5:49 PM onwards! 🤩🎋@AnilSunkara1 @iamsamyuktha_ @sakshivaidya99 @RamAbbaraju… pic.twitter.com/akIyawyACH— AK Entertainments (@AKentsOfficial) December 9, 2025


