క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అండర్‌వేర్‌తో రోడ్డుపై నడుస్తా: టాలీవుడ్ నటుడు | Vk Naresh Comments About His Character In movies | Sakshi
Sakshi News home page

Vk Naresh: 'క్యారెక్టర్ డిమాండ్ చేస్తే రోడ్డుపై అండర్‌వేర్‌తో వెళ్తా'

Jan 13 2026 5:06 PM | Updated on Jan 13 2026 5:43 PM

Vk Naresh Comments About His Character In movies

శర్వానంద్ హీరోగా వస్తోన్న సంక్రాంతి సినిమా నారీ నారీ నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని అనిల్ సుంకర, రామబ్రహ్మ సుంకర నిర్మించారు.

ఈ మూవీ రిలీజ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో టీమ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు మేకర్స్. ఈ ప్రెస్‌ మీట్‌కు హాజరైన టాలీవుడ్ నటుడు వీకే నరేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఏ క్యారెక్టర్‌ అయినా నేను ఎలాంటి లిమిట్స్ పెట్టుకోనని వీకే నరేశ్ అన్నారు. క్యారెక్టర్‌కు గౌరవం ఇస్తానని.. అందరికీ నచ్చేలా చేయడమే నా పని అన్నారు. గుంటూరు టాకీస్‌లో బాత్‌రూమ్‌లో సీన్‌ పెట్టారు.. అందులో చాలా ఎమోషన్ ఉంది అందుకే ఆ క్యారెక్టర్ చేశానని తెలిపారు. క్యారెక్టర్‌ డిమాండ్ చేస్తే ఆండర్ వేర్‌తో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తానని వీకే నరేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా.. వీకే నరేశ్ ఈ  చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement