టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కి చాలా గ్యాప్ తర్వాత ‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్‌పడింది.
సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైన ఈ చిత్ర..తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.
పండక్కి ఎక్కువ సినిమాలు ఉండడంతో తొలి రోజు చాలా తక్కువ థియేటర్స్‌లో సినిమా రిలీజ్ అయింది. అయితే తొలి రోజే హిట్ టాక్ రావడంతో థియేటర్స్ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి.
చాలా రోజుల తర్వాత తన సినిమాకు హిట్ టాక్ రావడం ఆనందంగా ఉందంటున్నాడు శర్వానంద్.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు.


