breaking news
samyuktha
-
బ్లాక్ లవ్.. అనసూయ పూల్‌లో సంయుక్త చీరలో
మినీ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న అనసూయనలుపు చీరలో మెరిసిపోతున్న సంయుక్తబ్లాక్ ఔట్ఫిట్లో నందితా శ్వేత వయ్యారాలునాభి అందాలతో 'మసూద' బ్యూటీ బాంధవిచీరలో మల్లెపూలతో మెరిసిపోతున్న అపర్ణ దాస్డిజైనర్ డ్రస్సులో 'విక్రమ్' బ్యూటీ గాయత్రి View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Bandhavi Sridhar (@bandhavisridhar) View this post on Instagram A post shared by MISHHTI (@mishtichakravarty) View this post on Instagram A post shared by Gayathrie Shankar (@gayathrieshankar) View this post on Instagram A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
రూట్ మార్చిన సంయుక్త.. జపనీస్ బ్యూటీలా మీనాక్షి
'జాతిరత్నాలు' ఫరియా వింటేజ్ పోజులుగ్లామర్ చూపిస్తూ రూట్ మార్చిన సంయుక్తమోడ్రన్ డ్రస్సులో మెరిసిపోతున్న శ్రీలీలపూల్లో తడిసిపోతూ నభా నటేశ్ స్టిల్స్జపనీస్ అమ్మాయిలా మీనాక్షి చౌదరిఇంగ్లీష్ బ్యూటీలా దక్ష నగర్కర్ స్టైలింగ్ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) -
ఏడాదిన్నర గ్యాప్.. ఇప్పుడేమో చేతిలో 8 సినిమాలు
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. హీరోలతో పాటు హీరోయిన్లు కూడా చాలా తక్కువగానే సినిమాలు చేస్తున్నారు. ఉన్నంతలో రష్మిక పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె కంటే బిజీగా ఉన్న మరో బ్యూటీ ఉంది. ఆమెనే మలయాళ బ్యూటీ సంయుక్త. దాదాపు ఏడాదిన్నరగా ఈమె నుంచి కొత్త మూవీ అప్డేట్ అనేదే లేదు. అలాంటిది ఇప్పుడు ఈమె చేతిలో ఏకంగా 8 మూవీస్ ఉండటం విశేషం. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి?2016 నుంచి మలయాళంలో సినిమాలు చేస్తున్న సంయుక్త.. 'భీమ్లా నాయక్'తో టాలీవుడ్లోకి వచ్చింది. దీని తర్వాత బింబిసార, సర్, విరూపాక్ష.. ఇలా వరస హిట్స్ అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే 2023లో ఈమె హీరోయిన్గా చేసిన 'డెవిల్' ఫ్లాప్ అయింది. గతేడాది ఓ తెలుగు మూవీలో అతిథి పాత్రలో కనిపించింది. అప్పటినుంచి ఈమె నుంచి రిలీజులు ఏం లేవు. తీరా ఇప్పుడు చూస్తే ఎనిమిది చిత్రాలు లైన్లో ఉన్నాయి.(ఇదీ చదవండి: 'మిరాయ్'లో రాముడిగా ప్రభాస్? ఇది అసలు నిజం)సంయుక్త చేస్తున్న వాటిలో బాలకృష్ణ 'అఖండ 2', పూరీ-విజయ్ సేతుపతి సినిమా, శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారీ', బెల్లంకొండ శ్రీనివాస్ 'హైందవ', నిఖిల్ 'స్వయంభు', లారెన్స్ 'బెంజ్', మహారాణి అనే హిందీ చిత్రం, తెలుగులో ఓ ఫిమేల్ సెంట్రిక్ చిత్రం ఈమె చేతిలో ప్రస్తుతం ఉన్నాయి. వీటిలో 'అఖండ 2'.. ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ కానుంది. మిగిలినవన్నీ కూడా దాదాపు వచ్చే ఏడాది, ఆపై ఏడాది థియేటర్లలోకి రానున్నాయి.సంయుక్త ప్రస్తుతం చేస్తున్న వాటిలో పూరీ-విజయ్ సేతుపతి, అఖండ 2, స్వయంభు.. పాన్ ఇండియా టార్గెట్‌గా తీస్తున్న మిగిలినవన్నీ కూడా ఆయా భాషల్లో తీస్తున్నారు. మరి వీటి వల్ల సంయుక్త కెరీర్ మళ్లీ గాడిన పడుతుందా? హీరోయిన్గా నిలదొక్కుకుంటుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'కిష్కింధపురి' సినిమా రివ్యూ) -
ఓనం స్పెషల్.. మలయాళ బ్యూటీస్ అందం చూడతరమా?
మలయాళీలు ఎంతో ఇష్టంగా సెలబ్రేట్ చేసుకునే ఓనం వచ్చేసింది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేసే మలయాళ బ్యూటీస్‌తో పాటు దక్షిణాది చిత్రాల్లో నటించే పలువురు బ్యూటీస్.. అందమైన చందమామల్లా రెడీ అయిపోయారు. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. వీరిలో మాళవిక మోహనన్, సంయుక్త, ఐశ్వర్య లక్ష్మి, అపర్ణ బాలమురళి, సానియా అయ్యప్పన్ తదితరులు ఉన్నారు. మీరు ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Aparna Balamurali✨ (@aparna.balamurali) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Mirnalini Ravi (@mirnaliniravi) View this post on Instagram A post shared by Sakshi Agarwal |Actress |Fitness & Lifestyle (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Saniya (@_saniya_iyappan_) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
సంయుక్త మేఘాలయ టూర్.. 'కన్నప్ప' బ్యూటీ ఇలా
మేఘాలయ టూర్ వేసిన హీరోయిన్ సంయుక్తకన్నప్ప బ్యూటీ ప్రీతి ముకుందన్ గ్లామరస్ లుక్స్దిల్లీలో 'పరమ్ సుందరి' ప్రమోషన్లలో జాన్వీ కపూర్జీన్ డ్రస్సులో కృతిశెట్టి సెల్ఫీల మోతవయ్యరాలు ఒంపుసొంపులతో అనన్య నాగళ్లఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో హీరోయిన్ మేఘా ఆకాశ్డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న యాంకర్ రష్మీ View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Preity Mukhundhan (@preity_mukhundhan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
హిట్ బ్యూటీని పట్టేసిన పూరీ జగన్నాథ్
'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' డిజాస్టర్ల దెబ్బకు పూర్తిగా ఆలోచనలో పడిపోయిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. తన రూట్ మార్చి స్టోరీ రాశాడు. దాన్ని తమిళ నటుడు విజయ్ సేతుపతికి చెప్పి మెప్పించాడు. కొన్ని నెలల క్రితం ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ కాగా.. ఇందులో ఎవరెవరు నటిస్తారనే విషయాన్ని ఒక్కొక్కరిగా ప్రకటిస్తున్నారు. తాజాగా హిట్ చిత్రాల హీరోయిన్ని తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.మలయాళ నటి సంయుక్త.. ఇప్పటివరకు చాలా సినిమాలు చేసింది. వాటిలో చాలావరకు హిట్ అయ్యాయి. తెలుగులోనూ భీమ్లా నాయక్, బింబిసార, సర్, విరూపాక్ష తదితర చిత్రాలతో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం స్వయంభు, అఖండ 2, హైందవ, నారీ నారీ నడుమ మురారీ అని నాలుగు చిత్రాలు చేస్తోంది. ఇప్పుడు పూరీ-విజయ్ సేతుపతి ప్రాజెక్ట్‌లోకి ఎంటరైంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం)సంయుక్తని తీసుకున్న విషయాన్ని పూరీ-ఛార్మీ ప్రకటించారు. ఆమెతో కలిసున్న ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విజయ్ సేతుపతి మూవీలో ఇప్పటికే టబు, కన్నడ నటుడు దునియా విజయ్ ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సంయుక్త కూడా ఉందనేసరికి మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో సేతుపతి.. బిచ్చగాడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది చివర్లోనే రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారని సమాచారం.ఈ సినిమా విషయంలో పూరీ జగన్నాథ్ చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో తాను తీసిన సినిమాలు విషయంలో ఏ తప్పులైతే జరిగాయో ఈసారి అలాంటివేం జరగకుండా కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరించాలని భావిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం విజయ్ సేతుపతిని పూరీ సినిమా చేస్తున్న సినిమా గురించి అడిగితే.. తనకు కథ నచ్చే అవకాశమిచ్చానని, ఆయన గత చిత్రాల ఫ్లాప్ కావడం తనకేం సమస్య కాదని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్.. రిలీజ్‌కు ముందే రికార్డు!) -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన లారెన్స్.. ముగ్గురు బ్యూటీస్!
సినిమాటిక్ యూనివర్స్ అనగానే గుర్తొచ్చే పేరు లోకేశ్ కనగరాజ్. ఖైదీ, విక్రమ్ సినిమాలని ఒకదానికొకటి లింక్ చేసిన ఇతడు.. ఎల్సీయూ సృష్టించాడు. ప్రస్తుతం రజనీకాంత్‌తో 'కూలీ' తీస్తున్నాడు. ఇది ఆగస్టులో రిలీజ్ కానుంది. ఓవైపు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు నిర్మాతగానూ పలు చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటే 'బెంజ్'. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు క్రేజీ రూమర్ ఒకటి వినిపిస్తోంది.సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. లోకేశ్ ఇప్పటివరకు తీసిన చిత్రాల్లోనూ హీరోయిన్లు కనిపించేది కూడా తక్కువే అని చెప్పొచ్చు. కానీ 'బెంజ్'లో మాత్రం ఏకంగా ముగ్గురు భామల్ని తీసుకున్నారట. వాళ్లలో సంయుక్త, ప్రియాంక మోహన్ ఇప్పటికే ఖరారు కాగా.. మడోన్నా సెబాస్టియన్‌ని కూడా తీసుకోవాలని చూస్తున్నారట.(ఇదీ చదవండి: బన్నీతో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో?)సంయుక్త, ప్రియాంక హీరో సరసన నటిస్తారని.. మడోన్నా మాత్రం విలన్ వాల్టర్‌గా చేస్తున్న నివీన్ పౌలీ పక్కన కనిపించబోతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. రీసెంట్గా 'బెంజ్' విలన్‌కి సంబంధించిన ఓ వీడియోని రిలీజ్ చేసి నివీన్ పౌలీ పాత్రని పరిచయం చేశారు. లోకేష్ యూనివర్స్‌లో ఈ మూవీ కూడా భాగమేనని చెప్పుకొచ్చారు. మరి ఎలా ఏ సినిమాతో లింక్ చేస్తారనేది ఇంకా సస్పెన్స్. ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు.లోకేశ్ ప్రస్తుతం 'కూలీ' తీస్తున్నాడు. దీని తర్వాత 'ఖైదీ 2' ఉంటుంది. అలానే రోలెక్స్, విక్రమ్ 2 చిత్రాల్ని కూడా తీస్తానని ఇదివరకే చెప్పాడు. అయితే కొన్నిరోజులుగా ఆమిర్ ఖాన్‌తో ఓ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. చూడాలి మరి వీటిలో ఏది ముందు మొదలవుతుందో?(ఇదీ చదవండి: కోటా శ్రీనివాసరావు ఇలా అయిపోయారేంటి?) -
నిఖిల్ పాన్ ఇండియా మూవీ.. ఇన్నాళ్లకు అప్డేట్
హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'స్వయంభు'. పీరియాడికల్ సబ్జెక్ట్‌తో తీస్తున్న చిత్రం కావడంతో చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకొంటోంది. ఇప్పుడు అది చివరి దశకు వచ్చేసినట్లు ఉంది. ఈ క్రమంలోనే నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశారు. అలానే త్వరలో టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సమంత ‘శుభం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 'బాహుబలి' తరహా సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నారు. సంయుక్త హీరోయిన్. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో హీరో నిఖిల్‌తో పాటు ఈమె కూడా కత్తి పట్టుకుని కదన రంగంలో ఉన్నట్లు కనిపించింది. మరి మూవీ ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.'కార్తికేయ 2' మూవీతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్.. తర్వాత 'స్పై', '18 పేజీస్' చిత్రాలు చేశాడు గానీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇతడి దృష్టంతా 'స్వయంభు' మీదే ఉంది. దీంతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: కమెడియన్ అలీకి చిరంజీవి గిఫ్ట్.. ఈసారి స్పెషల్‌గా..!) -
ఎర్రని బుగ్గలతో సుప్రీత.. రెడ్ శారీలో సంయుక్త
ఎర్రని బుగ్గలతో యంగ్ బ్యూటీ సుప్రీతచుడీదార్ లో పద్ధతిగా కనిపించిన కేతిక శర్మరెడ్ శారీలో హాట్ హాట్ గా సంయుక్త స్టిల్స్40ల్లోనూ అందంతో కేక పుట్టిస్తున్న శ్రియహైదరాబాద్ లో బాలీవుడ్ నిర్మాత భార్య దివ్య ఖోస్లాడ్యాన్స్ తో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్చీరలో కవ్విస్తున్న కీర్తి సురేశ్.. ఐశ్వర్య రాజేశ్ కూడా View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Esha Chawla (@eshachawla63) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) -
రెడ్ మిర్చిలా మీనాక్షి చౌదరి.. మట్టికుండతో పూజాహెగ్డే
రెడ్ హాట్ మిర్చిలా హీరోయిన్ మీనాక్షి చౌదరిమట్టి కుండతో రెట్రో లుక్స్ లో పూజా హెగ్డేతొలి తెలుగు సినిమా పూర్తి చేసిన ధనశ్రీ వర్మబీచ్ లో బికినీతో గ్లామరస్ గా నేహా శర్మస్విమ్మింగ్ పూల్ లో ఫ్యామిలీతో కలిసి శ్రియఅమ్మకి ముద్దు పెట్టి విషెస్ చెప్పిన కృతిశెట్టితమిళ బ్యూటీ దివ్య భారతి అందాల విందు View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
ఏడేళ్లకే తైక్వాండో శిక్షకురాలిగా గిన్నిస్ రికార్డు..!
కొంతమంది చిన్నారులు అత్యంత చిన్న వయసులో అపారమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తుంటారు. వారి అద్భుతమైన ప్రతిభ ఎవ్వరినైనా ఆశ్చర్యంలో ముంచెత్తడమే గాక కట్టిపడేస్తాయి. అంతేగాదు వాళ్లని చూడగానే "పిట్ల కొంచెం కూత ఘనం" అనే ఆర్యోక్తి గుర్తుకురాక మానదు. అలాంటి ప్రతిభ పాటవాలనే ప్రదర్శిస్తోంది ఈ చిన్నారి. చిన్న వయసులో అత్యంత క్లిష్టమైన విద్యలో ఆరితేరి శెభాష్ అనిపించుకుంటోంది.ఆ చిన్నారే మధురైకి చెందిన ఏడేళ్ల సంయుక్త నారాయణన్. అసాధారణమైన తైక్వాండో నైపుణ్యాలతో యావత్తు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఆ అసాధారణమైన ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది కూడా. అంతేగాదు గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇన్‌స్టా పోస్ట్‌లో ఏడేళ్ల 270 రోజుల వయసులో అతి పిన్న వయస్కురాలైన తైక్వాండో బోధకురాలిగా చరిత్ర సృష్టించిందని పేర్కొంది. ఈ చిన్నారి ఎంతో మంది పిల్లలకు ప్రేరణ. పిల్లలను క్రీడలకు సంబంధించిన వాటిల్లో ప్రోత్సహిస్తే వారిలోని అపారమైన నైపుణ్యాలు వెలికివస్తాయనేందుకు ఈ చిన్నారే నిదర్శనం. అయితే నెటిజన్లు ఈ గిన్నిస్ పోస్ట్‌పై రకరకాలుగా స్పందించారు. కొందరేమో చిన్న వయసులో తైక్వాండో సాధన చేయడం హానికరం అని ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం పిల్లలు అసాధారణమై విజయాలు అందుకోగలరని ప్రూవ్ చేసింది ఆ చిన్నారి అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఆ పెర్ఫ్యూమ్ ప్రతి గంటకు 108 బాటిళ్లు సేల్ అవుతాయ్..! తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..) -
టీనేజీ బ్యూటీలా నమ్రత.. మైమరిపించేస్తున్న సంయుక్త
యువరాణిలా నిధి అగర్వాల్ అలంకరణపూరీ జగన్నాథుడిని దర్శించుకున్న భాగ్యశ్రీఒంపు సొంపులతో అందాలని చూపించేస్తున్న సంయుక్తఅవార్డ్ అందుకున్న 'డ్రాగన్' బ్యూటీ కాయదు లోహర్గాగ్రా చోళీలో మెరిసిపోతున్న మహేశ్ భార్య నమ్రతఒంటికి రంగులు పూసుకుని హోలీ చేసుకున్న పూనమ్ బజ్వాక్యూట్ అండ్ స్వీటుగా రీతూ వర్మ పోజులు View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sangeerthana (@sangeerthana__vipin) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) -
Samyuktha: సీక్రెట్ బయటపెట్టిన స్టార్ హీరోయిన్
ఒకప్పుడు మందు తాగడం అంటే ఏదో పెద్ద తప్పులా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు చాలామందికి అలవాటు ఉండే ఉంటుంది. కాకపోతే బయటకు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. సెలబ్రిటీలైతే ఈ విషయంలో బయటపడరు. ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం తనకు తాగే అలవాటుందని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?)సంయుక్త మీనన్ మలయాళీ అనే సంగతి అందరికీ తెలుసు. కానీ తండ్రి నుంచి విడిపోయిన తర్వాత మీనన్ అనే ఇంటి పేరు తొలగించుకుంది.ట్రావెలింగ్ అంటే పిచ్చి. షూటింగ్ రీత్యా రకరకాల ప్రదేశాలు తిరిగినా, పర్సనల్ ట్రావెల్ ప్రిఫర్ చేస్తుంటుంది. ఈ ప్రయాణాల్లో ప్రకృతి సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక విశిష్టత ఉన్న ప్రాంతాలకు వెళ్తుంటుంది. కుంభమేళాకు కూడా వెళ్లి పవిత్ర స్నానాలు చేసి వచ్చింది.సంయుక్త మంచి ఫుడ్ లవర్ . కేరళ స్టయిల్ వంటకాలంటే ప్రాణం. సినిమాల్లో కూడా ఆయా ప్రాంతాల ప్రత్యేక వంటకాలు తెలియ చేసే సినిమాలు రావాలంటుంది.తెలుగులో ఉలవచారు బిర్యానీ సినిమా వచ్చిందిగా అంటే.. అది మలయాళ పెప్పర్ సాల్ట్ సినిమా రీమేకేగా అంటుంది.ఏ విషయం అయినా, బోల్డ్‌గా చెప్పేయడం సంయుక్త అలవాటు. తను అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటానని ఓపెన్‌గా చెప్పేసింది. అయితే అన్ని పార్టీల్లో కాదు.. క్లోజ్ ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నప్పుడేనని చెప్పింది.తెలుగు సినిమాల్లో హీరోయిన్లని గ్లామరస్‌గా చూపించినా, సెట్స్ బయట తెలుగు సినిమా పరిశ్రమ లేడీ ఆర్టిస్టులతో ప్రవర్తించినంత మర్యాదగా.. మరే భాషా రంగం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేసింది.కో –ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్తోనే తను కూడా పోటీ పడి నటించగలనని, అవతల ఆర్టిస్టు డమ్మీ అయితే తను కూడా నీరు కారిపోతానని సంయుక్త చెప్పుకొచ్చింది. అందుకే విరూపాక్ష, సార్, బింబిసార లాంటి సినిమాలు అంత సూపర్ హిట్ అయ్యాయని చెప్పింది.∙పుస్తకాల పురుగు. ఫిక్షన్ నవలలు ఎంత ఇష్టమో, భారతీయ సంస్కృతిని తెలియచేసే బుక్స్ అన్నా అంతే అభిమానం. నందమూరి బాలకృష్ణతో ఓ జ్యుయెలరీ యాడ్ లో యాక్ట్ చేసినప్పుడు – ఆయనతో నటించే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అనుకుందట. కానీ అఖండ–2లో ఆఫర్ వచ్చేటప్పటికీ ఆ ఎగ్జయిట్మెంట్ మాటల్లో వర్ణించలేను అంది.తను చేయబోతున్న ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కోసం ఫిజికల్ ఫిట్నెస్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటోంది.(ఇదీ చదవండి: కథ కనిపెట్టు.. ఈ బైక్ గిఫ్ట్ పట్టు: హీరో కిరణ్ అబ్బవరం) -
కవ్వించే అందాలతో సంయుక్త మీనన్.. చీరకట్టులో మైమరిపిస్తోందిగా!
-
రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త
రిలీజై రెండు వారాలవుతున్నా సరే ఇంకా 'పుష్ప 2' హవా కొనసాగుతోంది. మూవీలోని జాతర సీన్ అయితే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఒకరిద్దరు మహిళలు.. ఏకంగా కూర్చున్న సీటులోనే పూనకాలతో ఊగిపోయిన ఒకటి రెండు వీడియోలు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఓ షాకింగ్ అనుభవం.. యువ నటికి ఎదురైంది. ఆ విషయాన్ని ఇన్ స్టాలో పంచుకుంది.(ఇదీ చదవండి: మన సినిమా.. ఆస్కార్ రేసు నుంచి ఔట్)తమిళ నటి, బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్త షణ్ముగనాథన్.. రీసెంట్గా 'పుష్ప 2' సినిమా చూడటానికి వెళ్లింది. జాతర సీన్ వచ్చినప్పుడు ఈమె పక్కన కూర్చున్న మహిళ.. సామీ అని గట్టిగా అరిచిందట. దీంతో సంయుక్త తెగ భయపడిపోయింది. ఆమె భర్త ఏమో తనని కంట్రోల్ చేయాలని చూశాడు. భయమేసి.. పది రూపాయుల టికెట్‌కు వెళ్లి కూర్చున్నా అని సంయుక్త ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది.అయితే పూనకాలు రావడం, భయపడటం కాదు గానీ థియేటర్లలో ఇంకా రూ.10 టికెట్స్ ఉన్నాయా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అది కూడా మాల్లో ఇంత తక్కువ రేటు ఏంటి? అని ఈమెని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదలా ఉంచితే 12 రోజుల్లో రూ.1450 కోట్లపైనే వసూళ్లని 'పుష్ప 2' సాధించింది. ఈ వీకెండ్, వచ్చే వారం క్రిస్మస్ పండగ కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్) -
అలాంటి స్క్రిప్ట్ రావడం నా అదృష్టం : సంయుక్త
వరుస సినిమాలలో దూసుకెళ్తోంది సంయుక్త. ఇప్పటికే ఆమె హీరోయిన్గా నటిస్తున్న ఐదు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా మరో కొత్త సినిమాకు సైన్ చేసింది.. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాలను అందించిన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా నిర్మించనున్న ఈ చిత్రానికి యోగేష్ కెఎంసి దర్శకత్వం వహించనున్నారు. మాగంటి పిక్చర్స్‌తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 6ని నిర్మించనున్నారు. సంయుక్త ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈరోజు రామానాయుడు స్టూడియోస్‌లో పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఆ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది.ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథ వినాలని కొన్ని నెలలుగా అనుకుంటున్నాను. షూటింగ్ బిజీ వలన కుదరలేదు. ఫైనల్ గా రెండ్రోజుల క్రితం కథ విన్నాను, కథ అద్భుతంగా ఉంది. డైరెక్టర్ గారు కొన్ని ఇయర్స్ గా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. ఇలాంటి స్క్రిప్ట్ రావడం నా అదృష్టం. ఈ సినిమాని ఫిమేల్ సెంట్రిక్ మూవీ అని లేబుల్ చేయడం ఇష్టం లేదు. ఇది బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ. ఫిమేల్ సెంట్రిక్ అనగానే టూ మచ్ థ్రిల్లర్ లేదా ఎంపవర్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మిగతా సినిమాల్లా సహజంగా ప్రజెంట్ చేసే కథలు ఎందుకు రావడలేదని భావిస్తున్నా తరుణంలో ఇలాంటి అద్భుతమైన కథ వచ్చింది. ఇందులో ఫీమేల్ లీడ్ ఉన్న కథే.. కానీ ఈ కథని హీరో కూడా చేయొచ్చు’ అన్నారు.‘సంయుక్త ఒకే సిట్టింగ్‌లో స్క్రిప్ట్‌కి ఓకే చెప్పి నెక్స్ట్ డే కి పూజ పెట్టుకోవడం అనేది నా కెరీర్ లో ఇదే ఫస్ట్ . అంత స్క్రిప్ట్ ఎక్సయిట్మెంట్ ఉన్న సినిమా ఇది’ అని నిర్మాత రాజేశ్ దండా అన్నారు. -
అమ్మ కోసం ‘సరే’ అన్నాను: సంయుక్త
‘మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు...’ అంటూ ‘సార్’ సినిమాలో మాస్టారు (ధనుష్)తో ప్రేమలో పడ్డారు హీరోయిన్ సంయుక్త. ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ప్రేమను పొందారు ఈ మలయాళ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో ‘స్వయంభూ’, హిందీలో ‘మహారాజ్ఞి’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారామె. ఇక ‘సాక్షి’తోసంయుక్త పంచుకున్న విశేషాల్లో కొన్ని ఈ విధంగా...కేరళ టు హైదరాబాద్ షిఫ్ట్ అయినట్లున్నారు? ఈ మధ్య వరుసగా తెలుగులో నాలుగైదు సినిమాలు సైన్ చేశాను. ఇక్కడే ఉంటే బాగుంటుందని ముందు సర్వీస్ అపార్ట్మెంట్లో ఉండటం మొదలుపెట్టాను. మా అమ్మగారు కూడా నాతో పాటే ఉండాలనుకున్నారు. మా ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయి. అమ్మా, నేను, కుక్కపిల్లలు... ఇదే నా ప్రపంచం. వాళ్లను విడిచి ఉండలేను. అందుకే ఇప్పుడు ఒక ఫ్లాట్ తీసుకుని, వాళ్లని కూడా హైదరాబాద్ తీసుకొచ్చేశాను.మలయాళంలో చేసిన ఫస్ట్ మూవీ ‘పాప్‌కార్న్’ (2016) చూసి, మీకు నటించడం రాదని కొందరు అన్నారు... మీకూ అలా అనిపించిందా? ఇప్పుడైతే ఇంకా బాగా నటించి ఉండేదాన్ని అనిపిస్తుంటుంది. యాక్టింగ్‌ని నా కెరీర్‌గా అనుకోలేదు. సినిమాకి అవకాశం వచ్చింది. ‘ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి.. ఒప్పుకో’ అని మా అమ్మగారు అన్నారు. ‘సరే’ అన్నాను. అప్పుడు నా వయసు 19, 20 ఏళ్లు ఉండి ఉంటాయి. ప్రపంచం గురించి పెద్దగా అవగాహన లేదు. షూటింగ్ లొకేషన్‌కి వెళ్లాక, అక్కడ రెండు కెమెరాలు ఉండటం చూసి రెండు ఎందుకు? ఉన్నాయా అనిపించింది. రెండు సైడ్స్ నుంచి షూట్ చేస్తారనే కనీస అవగాహన కూడా లేదు నాకు. పైగా బాగా బిడియస్తురాల్ని. (చదవండి: జూనియర్ ఎన్టీఆర్ దేవర.. ఓవర్సీస్లో మరో క్రేజీ రికార్డ్!)మా కుటుంబానికి చెందినవాళ్లెవరూ సినిమాల్లో లేరు. షూటింగ్ వాతావరణం మొత్తం చాలా అసౌకర్యంగా అనిపించింది. ఏదో నటించామంటే నటించాం అన్నట్లు చేశాను. ‘సినిమాలు మన వల్ల కాదు’ అని, చదువుకోవాలని డిసైడ్ అయిపోయాను. కానీ ఆ తర్వాత ‘తీవండి, లిల్లీ’ అనే సినిమాలకు అవకాశం వస్తే, ఒప్పుకున్నాను. ‘లీల్లీ’ లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో సవాల్ అనిపించింది. సినిమా విధానాన్ని నేను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది ‘లిల్లీ’తోనే. ‘మనం నటించగలం’ అనే నమ్మకం కలిగింది కూడా ఆ సినిమాతోనే.‘సినిమాలు మన వల్ల కాదు’ అనుకున్నానని ఇంతకుముందు అన్నారు. లైఫ్‌లో ఏదైనా విషయంలో ‘వల్ల కాదు’ అంటే అలా సింపుల్‌గా వదిలేస్తారా? సింపుల్‌గా వదిలేయడం కూడా నా వల్ల కాదు. మనం ఎందుకు చేయలేం అనే ఆలోచన కూడా కలుగుతుంది. అయితే ఫస్ట్ మూవీకి నాకు సినిమా అంటే అర్థం కాలేదు. అర్థం కాని విషయం గురించి ఆలోచించడం ఎందుకని సినిమాలు వదిలేద్దామనుకున్నాను. ‘లీల్లీ’ చేసేటప్పుడు కాస్త అర్థమైంది. దాంతో కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏదైనా విషయాన్ని సాధించాలని నేను ఒక్కసారి ఫిక్స్ అయితే ఎంత కష్టపడటానికైనా రెడీ అయిపోతా. పైగా ఫస్ట్ మూవీ తర్వాత నేను సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నప్పుడు ఇంకోటి ఎందుకు చేయడంలేదు? అని చుట్టూ ఉన్నవాళ్లు అనుకున్నారు. అప్పుడు సినిమా అనేది వర్ల్ పూల్ లాంటిదని అర్థమైంది. ఒక్కసారి వస్తే వెనక్కి వెళ్లలేం. ఫెయిల్యూర్‌గా మిగిలిపోవడం ఇష్టం లేక రెండో సినిమా ‘తీవండి’ ఒప్పుకున్నాను. ఆ తర్వాత ‘లిల్లీ’ చేశాను. ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఉండాలని ఫిక్స్ అయిపోయాను. మొదట్లో అసౌకర్యంగా అనిపించిందని అన్నారు... ఇండస్ట్రీలో కొందరికి ఎదురయ్యే ‘క్యాస్టింగ్ కౌచ్’లాంటిది ఏమైనా... అలా ఏం లేదు. ఆ విషయంలో నేను లక్కీ. సినిమా మేకింగ్ ప్రాసెస్ అర్థం కాకపోవడంవల్లే వెళ్లిపోదామనుకున్నాను. ఒకవేళ క్యాస్టింగ్ కౌచ్‌లాంటి చేదు అనుభవం ఎదురై ఉంటే... అప్పటికప్పుడే అడిగేదాన్ని. ఇంట్లో ఏడ్చేసి, ఆ తర్వాత ఎప్పటికో ఆ విషయాన్ని బయటపెట్టేదాన్ని కాదు. మలయాళంలో నా ఫస్ట్ మూవీ నుంచి తెలుగు, తమిళంలో నాకన్నీ మంచి ప్రొడక్షన్ హౌస్లే దొరికాయి.‘మహారాజ్ఞి’తో హిందీకి కూడా వెళుతున్నారు... భాష తెలియకపోతే నటనకు న్యాయం చేయలేనని తెలుగు నేర్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి... హిందీ వచ్చా? స్కూల్లో హిందీ ల్వాంగేజ్ ఉండటంతో రాయడం, చదవడం వచ్చు. అయితే అనర్గళంగా మాట్లాడలేను. అందుకే తెలుగుకి ట్యూటర్ని పెట్టుకున్నట్లు హిందీకి కూడా పెట్టుకున్నాను. భాష నేర్చుకోవడం అంటే డైలాగ్స్ బట్టీ పట్టి ఆ సినిమా వరకు చెప్పడం వరకే అనుకోను. విడిగా కూడా తెలుగు మాట్లాడాలనుకున్నాను. అందుకే గ్రామర్ కూడా తెలుసుకోవాలని ట్యూటర్ పెట్టుకున్నాను. స్కూల్‌కి వెళ్లేటప్పుడు నోట్ బుక్ ఉంటుంది కదా.. అలాంటి నోట్‌బుక్ పెట్టుకుని, భాషలు నేర్చుకుంటున్నాను. మనం ఒక జాబ్ చేస్తున్నామంటే పూర్తి న్యాయం చేయాలన్నది నా అభిప్రాయం. -
హీరోయిన్గా పొందిన ప్రేమను హ్యూమన్‌గా తిరిగి ఇస్తున్నా
పాలక్కాడ్ టు హైదరాబాద్... చెన్నై... ముంబై... సినిమా అనేది సంయుక్తను అన్ని రాష్ట్రాల్లోనూ పాపులర్ చేసింది. రీల్‌పై హీరోయిన్... రియల్‌గానూ అంతే... ఆపన్న హస్తం అందించడానికి వెనకాడరామె. 2018లో కేరళలో వరదలు సంభవించినప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సంయుక్త. తాజాగా వయనాడ్ బాధితులకు విరాళం ఇచ్చారు. ‘ఆది శక్తి’ పేరుతో సేవా సంస్థను ఆరంభించారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఈ మలయాళ బ్యూటీ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...→ కేరళలో పుట్టి పెరిగిన మీకు ఇప్పుడు వయనాడ్‌ని చూస్తుంటే బాధ అనిపించడం సహజం. వయనాడ్ ఎన్నిసార్లు వెళ్లారు? సంయుక్త: ఇప్పటివరకూ నేను ఒకే ఒక్కసారి వెళ్లాను. చాలా అందమైన ప్రదేశం. మంచి హిల్ స్టేషన్. హాయిగా గడపడానికి అక్కడికి వెళుతుంటారు. అలాంటి వయనాడ్ రూపు రేఖలు వర్షాల వల్ల మారి΄ోవడంతో బాధ అనిపించింది. ఇప్పుడు వయనాడ్ వెళదామనుకున్నాను కానీ సందర్శనలకు అనుమతి లేదు.→ వయనాడ్‌లో షూటింగ్స్ ఏమైనా చేశారా?ఆ అవకాశం ఇప్పటివరకూ రాలేదు. యాక్చువల్లీ అక్కడ వర్షాలప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. ప్రతి గంటకూ మా అమ్మగారు ఫోన్ చేసి, పరిస్థితులు చెప్పేవారు. ఆ బీభత్సం చూసి, ఆవిడైతే నాలుగైదు రోజులు నిద్ర΄ోలేదు. నిజానికి వయనాడ్‌కి ఏమైనా చేయమని అమ్మే చెప్పింది. నేనూ అదే అనుకున్నాను కాబట్టి వెంటనే విరాళం ఇచ్చాను. → ఆర్థిక సహాయమేనా? 2018 కేరళ వరదలప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాలు చేసినట్లు చేయాలనుకుంటున్నారా? ఇంకా చేయాలని ఉంది. కేరళలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థతో మాట్లాడాను. ఏం చేస్తే బాగుంటుందో వాళ్లు గ్రౌండ్ లెవల్లో స్టడీ చేస్తున్నారు. దాన్నిబట్టి సహాయ కార్యక్రమాలను ΄్లాన్ చేస్తాను.→ 2018లో చేసిన సేవా కార్యక్రమాల గురించి...2018లో కేరళ వరదలప్పుడు నేను చెన్నైలో ఇరుక్కు΄ోయాను. బాధితుల కోసం చాలా చిన్న స్థాయిలో ఓ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేశాను. నేను ఊహించినదానికన్నా ఎక్కువ నిత్యావసర వస్తువులు రావడంతో పెద్ద గోడౌన్ తీసుకోవాల్సి వచ్చింది. వచ్చినవి వచ్చినట్లు సరఫరా చేశాం. ఇక కేరళ వెళ్లాక పాడై΄ోయిన ఇళ్లను బాగు చేసే కార్యక్రమంలో పాల్గొన్నాను. చెప్పలేనంత మట్టి పేరుకు΄ోవడంతో క్లీన్ చేయడానికి ఇబ్బందిపడ్డాం.→ సంయుక్తా మీనన్లోంచి ‘మీనన్’ ఎందుకు తీసేశారు? మా అమ్మానాన్న విడి΄ోయారు. అమ్మంటే నాకు చాలా ప్రేమ, గౌరవం. తన ఫీలింగ్స్‌ని గౌరవించి పేరులోంచి సర్ నేమ్ తీసేశాను. ఇంకో విషయం ఏంటంటే... నేను ఆడ.. మగ సమానం అని నమ్ముతాను. సర్ నేమ్ వద్దనుకోవడానికి అదో కారణం. → సింగిల్ పేరెంట్‌గా మీ అమ్మగారు మిమ్మల్ని పెంచారు కాబట్టి తండ్రి ప్రేమను మిస్సయిన ఫీలింగ్... యాక్చువల్లీ నాకు అమ్మానాన్న ఇద్దరి ప్రేమనీ పంచారు మా తాతగారు (సంయుక్త అమ్మ తండ్రి). నేను ఏం అడిగినా కాదని చెప్పలేనంత ప్రేమ మా తాతగారిది. అలాగని గుడ్డిగా ఓకే చెప్పలేదు. ఆయన బాధపడే పనులు చేయనని, అసలు తప్పు చేయనని నమ్మకం. అంత ప్రేమ పంచి, నమ్మకాన్ని పెంచుకున్న మా తాత నా ఫస్ట్ బాక్సాఫీస్ సక్సెస్‌ని చూడకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లి΄ోయారు. కానీ, ఎక్కడున్నా తన మనవరాలి విజయాన్ని చూస్తున్నారన్నది నా నమ్మకం.→ ‘స్వయంభూ’, హిందీ ‘మహారాజ్ఞి’ కోసం ఫైట్స్ కూడా నేర్చుకున్నారు... ఇప్పటివరకూ దాదాపు సున్నితమైన పాత్రల్లో కనిపించిన మీరు ఇప్పుడు పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారన్న మాట... ‘స్వయంభూ’ కోసం గుర్రపు స్వారీ, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. అటు హిందీ ‘మహారాజ్ఞి’ కోసం కూడా యాక్షన్ నేర్చుకున్నాను. ఒకప్పుడు సినిమాలకు దూరంగా పారి΄ోవాలనుకున్న నేను ఇప్పుడు సినిమా కోసం ఏం నేర్చుకోవడానికైనా రెడీ అయి΄ోయాను. చేసే ప్రతి పాత్ర ఒకదానికి ఒకటి భిన్నంగా ఉండాలనుకుంటున్నాను. స్క్రీన్ మీద చూసి నాపై ప్రేమ పెంచుకున్న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంతైనా కష్టపడొచ్చు. → ప్రేక్షకుల మీద ప్రేమతోనేనా ఈ సేవా కార్యక్రమాలు...అవును. పాలక్కాడ్‌లో మొదలై ఇతర రాష్ట్రాల్లో ఆదరణ పొందడం అంటే చిన్న విషయం కాదు. నటిగా నేను సక్సెస్ అయ్యానంటే అది నా విజయం కాదు. నన్ను ప్రేక్షకులే సక్సెస్ చేశారు. హీరోయిన్గా నేను పొందిన ప్రేమను హ్యూమన్‌గా తిరిగి ఇవ్వాలనుకున్నాను. ఏదైనా అర్థవంతంగా, ఉపయోగపడేది చేయాలన్నది నా సంకల్పం. అందుకే ‘ఆది శక్తి’ సేవా సంస్థ ఆరంభించాను. → కేరళ నుంచి నిత్యామీనన్, నయనతార, సమంత (సమంత అమ్మ మలయాళీ) వంటివారిని హైదరాబాద్ తీసుకొచ్చి స్టార్స్‌ని చేసింది టాలీవుడ్. ఇప్పుడు మీరు... మాలీవుడ్ అమ్మాయిలకు టాలీవుడ్ లక్కీ అనొచ్చా? ఒక్క మాలీవుడ్ ఏంటి? ఎవరికైనా ఆహ్వానం పలుకుతుంది టాలీవుడ్. సో.. మాకే కాదు అందరికీ లక్కీయే. ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడటం మొదలుపెట్టారంటే ఇక ఆ స్టార్‌ని ఎప్పటికీ ఇష్టపడతారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ సినిమాని సెలబ్రేట్ చేస్తుంది. ఇంతగా ప్రేమించే తెలుగు పరిశ్రమలో భాగం కావడం హ్యాపీగా ఉంది. అందుకే కేరళ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. → మీ ‘ఆది శక్తి’ ఫౌండేషన్ గురించి క్లుప్తంగా... ఎవరికైనా సహాయం చేయాలంటే జస్ట్ డబ్బులు ఇచ్చేస్తే సరి΄ోదు. వాళ్లు జీవించినంత కాలం పనికొచ్చే సహాయం చేయాలి. నేను స్త్రీ సంక్షేమంపై దృష్టి పెట్టాను. చదువు, ఆరోగ్యం, ఉద్యోగం... వీటికి సంబంధించి సహాయం చేయాలన్నది నా ఆశయం. ముఖ్యంగా నేటి స్త్రీల మానసిక ఆరోగ్యం చాలా దెబ్బ తింటోంది. ఆ విషయం మీద వారిని ఎడ్యుకేట్ చేయాలి. నేను ‘ఆది శక్తి’ ఆరంభించే ముందు పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో మాట్లాడాను. కొంత రిసెర్చ్ చేసి, అవగాహన తెచ్చుకుని ‘ఆది శక్తి’ ఆరంభించాను. – డి.జి. భవాని -
Samyuktha : సంయుక్తకు బాలీవుడ్ ఆఫర్
-
దుబాయ్‌లో మరో అమ్మాయితో భర్త ఎఫైర్.. మోసం చేశాడన్న నటి
ప్రేమ, పెళ్లి అనేది నమ్మకం అనే పునాదులపైనే నిలబడుతుంది. కానీ తన భర్త తానే సర్వస్వం అని నటిస్తూనే మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నాడని వాపోయింది నటి సంయుక్త. ఈ బ్యూటీ తమిళ బిగ్‌బాస్ 4వ సీజన్లో పాల్గొంది. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్‌తో వారసుడు, తుగ్లక్, దర్బార్ వంటి పలు చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. ప్రేమ పెళ్లి.. దుబాయ్‌లో మరో అమ్మాయితో 'నా భర్త దుబాయ్‌లో వ్యాపారం చేస్తుంటాడు. కరోనా సమయంలో అతడి గురించి నాకు భయంకరమైన నిజం తెలిసింది. నాలుగేళ్లుగా అతడు మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్న విషయం తెలిసింది. అప్పుడు నా మనసు ముక్కలైంది. అసలేం చేయాలో కూడా తోచలేదు. లాక్డౌన్ వల్ల ఎక్కడికీ వెళ్లలేకపోయాను. అప్పుడే నాకు యాంకర్ భావన పరిచయమైంది. నేను ఉంటున్న అపార్ట్మెంట్లోనే తను కూడా ఉంటుంది. కలిసినప్పుడల్లా హాయ్, బై.. ఇంతే మాట్లాడుకునేవాళ్లం. తర్వాత కలిసి వాకింగ్‌కు వెళ్లడం మొదలుపెట్టాం. ఒకరోజు తను నా భర్త, కుటుంబం గురించి అడిగింది. అప్పుడే నా గుండెల్లో ఉన్న బాధనంతా ఒక్కసారిగా కన్నీటిరూపంలో తన్నుకుంటూ వచ్చింది. బిగ్‌బాస్‌కు ట్రై చేయొచ్చుగా అని సలహా నా మనసులో ఉన్న బాధనంతా తనతో చెప్పుకున్నాను. అప్పటికి తనింకా నాకంత క్లోజ్ ఏమీ అవలేదు. అయినా నా తరపున నిలబడింది. నన్ను ఓదార్చింది. లాక్డౌన్ కావడంతో ఇంటిదగ్గరే కలిసి వర్కవుట్ చేసేవాళ్లం. అలా చాలా క్లోజ్ అయిపోయాం. మేలో నా 8వ వివాహ వార్షికోత్సవం వచ్చింది. నా బతుకు ఇలా అయిపోయిందేంటని ఒక్కదాన్ని ఎంతలా ఏడ్చానో! నాకు ఓ కొడుకు ఉన్నాడు. ఇల్లు గడవాలంటే సంపాదన అవసరం. అందుకే నాకేదైనా పని దొరుకుతుందేమో చూడమని భావనకు చెప్పాను. తను నీకేది నచ్చితే అదే చేయాలంది. బిగ్‌బాస్ షోకి ట్రై చేయవచ్చు కదా అని సలహా ఇచ్చింది. అంతేకాదు, బిగ్‌బాస్ షోకి నన్ను రిఫర్ చేసింది కూడా! విడాకులిస్తానంటే రావట్లేదు సంయుక్త ఎవరనేది ఈ ప్రపంచానికి తెలిసిందంటే అది భావన వల్లే! తన వల్లే నేను ఇక్కడిదాకా వచ్చాను. ఇప్పటికీ నా కొడుకు నాన్న ఎక్కడ? అని అడుగుతుంటాడు. తను బయట దేశంలో పని చేస్తున్నాడు, ఇండియాకు రాలేడు అని సర్ది చెప్తూ వస్తున్నాను. ఆయన మాకు ఎందుకింత అన్యాయం చేశాడో తెలియడం లేదు. తనకు విడాకులిచ్చేందుకు ఎప్పుడో సిద్ధమయ్యాను. కానీ తను ఇండియాకు రావడానికి కూడా ఇష్టపడటం లేదు. అందుకే ఇంకా విడాకుల ప్రక్రియ పూర్తి కాలేదు' అని చెప్తూ ఎమోషనలైంది. కాగా సంయుక్త ఎంటర్ప్రెన్యూర్ కార్తీక్ శంకర్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఒక బాబు రేయాన్ ఉన్నాడు. బిగ్‌బాస్ తర్వాత తను మోడల్, నటిగా కెరీర్లో దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Samyuktha Shan (@samyuktha_shan) చదవండి: కట్టప్పనే మించిపోయావ్, నీకన్నా పాము నయం.. గడగడలాడించిన గీతూ.. షాకైన రతిక -
ప్రేమ పెళ్లి, కొన్ని వారాలకే విడాకులు.. కొత్త కారు కొన్న నటి
పెళ్లికి ముందు ఉన్న ప్రేమ.. ఆ తర్వాత ఉండదని చాలామంది అంటుంటారు. ఏళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగి మనసారా ప్రేమించుకున్న జంటపక్షులు పెళ్లి తర్వాత మాత్రం సడన్‌గా మారిపోతారు. అప్పటిదాకా ఒకరిపై మరొకరు కురిపించుకున్న ప్రేమ.. మెడలో మూడు ముళ్లు పడ్డ తర్వాత మాత్రం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. ప్రేమ స్థానంలో గొడవలు, విభేదాలు మొదలవుతాయి. అది చిలికి చిలికి గాలివానలా మారి విడాకుల వరకూ వెళ్తాయి. ఇప్పుడు చెప్పుకునే బుల్లితెర జంట కూడా అదే జాబితాలోకి వస్తుంది. సీరియల్‌తో మొదలైన ప్రేమకథ సంయుక్త.. తర్వాతి కాలంలో తన పేరును సంయుతగా మార్చుకుంది. సంయుత-విష్ణుకాంత్ సిప్పినీల్ ముత్తు సీరియల్లో కలిసి నటించారు. అప్పుడే వీరి చూపులు, మనసులు కలిశాయి. కొంతకాలం పాటు ప్రేమ జర్నీని ఎంజాయ్ చేసిన వీరు పెద్దలను ఒప్పించి ఈ ఏడాది మార్చి 3న పెళ్లి చేసుకున్నారు. అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ అప్పుడు మొదలైంది అసలు సమస్య. ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చలేదు. నెల రోజులకే విభేదాలు మొదలయ్యాయి. సర్దుకుపోదామనుకున్నారు, కుదర్లేదు.. మరో నెలరోజులకు విడిపోతున్నట్లు ప్రకటించారు. తన భార్య.. మాజీ ప్రియుడు విజయ్‌తో ఇంకా టచ్‌లో ఉందని ఆడియోక్లిప్ వదిలాడు విష్ణుకాంత్. నటికి పట్టపగలే చుక్కలు చూపించిన భర్త! తానే తప్పూ చేయలేదని, విష్ణుకాంతే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది సంయుత. వీరి విడాకుల వ్యవహారం అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా సంయుత కొత్త కారు కొనుగోలు చేసింది. 'స్వతంత్రంగా కష్టపడి జీవించగలిగే మహిళకు ఏదైనా సాధ్యమే.. మంచి మనసుతో, సద్భావాలతో ఈ సమాజంలో నెట్టుకురావడం ఒక అమ్మాయికి చాలా కష్టం. మనమేం చేసినా సరే కొందరు అదేపనిగా తిడుతూ ఉంటారు. అలాంటి వారిని పట్టించుకోకపోవడమే మేలు. మనమేంటనేది ఎవరికీ నిరూపించుకోవాల్సిన పని లేదు. కుక్కలను మొరగనివ్వండి.. కుక్కలను అలాగే మొరగనివ్వండి. వాళ్ల మనసులు కుళ్లుకుతంత్రాలతో ఎంత మురికిగా మారిందో వాళ్లకే తెలుసు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ ఆశయాలపై ఫోకస్ చేయండి. స్వతంత్రంగా జీవించండి. పురుషాహంకారంతో విర్రవీగే వాళ్లముందు బాస్ లేడీగా ధైర్యంగా నిలబడండి. మీరు అందుకునే విజయాలతో వాళ్ల ఆలోచన తప్పని వారికే అర్థమయ్యేలా చేయండి. ఒంటరిగా తనకాళ్లపై తను నిలబడి బతుకుతున్న ప్రతి మహిళకు ఈ పాజిటివ్ వైబ్స్ అందిస్తున్నాను' అని రాసుకొచ్చింది. దీనికి తన కొత్త కారు వీడియోను జత చేసింది. మూడేళ్ల కష్టార్జితం ఇది చూసిన కొందరు.. భర్తను వదిలేసి జల్సా చేస్తున్నావా? నువ్వేదో రోల్స్ రాయిస్ కారు కొన్నట్లు బిల్డప్ ఇస్తున్నావే అని కామెంట్లు చేశారు. దీనికి సంయుత స్పందిస్తూ.. 'నేను మూడేళ్లు కష్టపడి మొదటిసారి ఓ కారు కొన్నాను. ఇది మిగతావారికి గొప్ప విషయం కాదేమో కానీ నాకు మాత్రం అద్భుతమైనదే! అయినా నీ పని నువ్వు చేసుకోకుండా ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టడం నీకవసరమా?' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Samyutha (@samyutha.official) View this post on Instagram A post shared by Samyutha (@samyutha.official) చదవండి: చంద్రయాన్ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ హీరోయిన్ -
సంయుక్త కోసం బుట్టబొమ్మకి హ్యాండ్ ఇచ్చిన త్రివిక్రమ్ ?
-
బెడ్రూమ్లో కెమెరా.. నన్ను టార్చర్ పెట్టాడు: మాజీ భర్తపై నటి ఆరోపణలు
కోలీవుడ్ బుల్లితెర జంట సంయుక్త- విష్ణుకాంత్‌ల పెళ్లి మూన్నాళ్ల ముచ్చటే అయింది. ప్రేమించి, పెద్దలను ఒప్పించి వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసిన వీరిద్దరూ రెండు నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. అప్పటినుంచి వీరు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మొదట విష్ణుకాంత్.. సంయుక్త తన మాజీ ప్రియుడిని ఇంకా మర్చిపోలేదని, తనకు గతంలో ఒక లవ్ స్టోరీ ఉందన్న విషయాన్ని కూడా చెప్పలేదంటూ ఆమెకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ లీక్ చేశాడు. అది నెట్టింట వైరల్ అవడంతో పలువురూ సంయుక్తను తిట్టిపోశారు. ఈ క్రమంలో తానే తప్పూ చేయలేదని, విష్ణుకాంతే తనకు నరకం చూపించేవాడని ఆరోపించింది నటి. శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. అడల్ట్ వీడియోలు చూడమని బలవంతం చేసేవాడని, తనతో హింసాత్మకంగా ప్రవర్తించేవాడంది. బెడ్రూమ్లో కెమెరా పెట్టి అన్నింటినీ రికార్డు చేయడానికి ప్రయత్నిస్తే తాను వ్యతిరేకించానని చెప్పుకొచ్చింది. తనను భార్యగా కాకుండా వ్యభిచారిలా చూశాడని కన్నీళ్లు పెట్టుకుంది. తనకు అలర్జీ వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్తానంటే అంగీకరించలేదని, అప్పుడు ఎంతో బాధేసిందని ఆవేదన వ్యక్తం చేసింది సంయుక్త. అయితే సంయుక్త ఆరోపణలను విష్ణుకాంత్ తిప్పికొట్టాడు. 'ఆమె ఇప్పటికీ తన తప్పు ఒప్పుకోవడం లేదు. తనను తాను రక్షించుకోవడానికి నా మీద నిందలు మోపుతోంది. తను చెప్పేది నిజమైతే అందుకు తగ్గ సాక్ష్యాలు చూపించాలిగా. నేను శారీరకంగా, లైంగికంగా టార్చర్ పెట్టానంటోంది. మరి చూడటానికి ఆరోగ్యంగానే కనిపిస్తుందిగా! సంయుక్త చెపుతోందంతా అబద్ధం. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నా ప్రతిష్టను దిగజార్చేందుకే ఆమె ఇదంతా చేస్తోంది. సాక్ష్యాధారాలు లేకుండా ఆమె చెప్పే మాటలను ఎవరూ నమ్మకండి' అని కోరాడు. చదవండి: ఒక్క సినిమాతో ఫేమస్.. తల్లి కాబోతున్న నటి -
ప్రియుడితో టచ్‌లో ఉన్న నటుడి భార్య.. అందుకే విడాకులు!
ప్రేమ-పెళ్లి-విడాకులు.. ఇండస్ట్రీలో ఇది సర్వసాధారణ విషయం. కొన్ని ప్రేమలు బ్రేకప్‌తోనే ఆగిపోతే, మరికొన్ని మాత్రం పెళ్లయ్యాక విడాకులతో ముగిసిపోతాయి. తమిళ సినీ జంట సంయుక్త-విష్ణుకాంత్లు రెండో కోవలోకి చెందుతారు. 'సిప్పినీల్ ముత్తు' సీరియల్లో కలిసి నటించిన వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరు పెద్దల అంగీకారంతో మార్చి 3న పెళ్లి చేసుకున్నారు. బ్యూటిఫుల్ కపుల్ అని అంతా పొగిడారో లేదో అంతలోనే విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. పెళ్లైన రెండు నెలలకే విడాకులు తమ పెళ్లి ఫోటోలను సైతం సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. ఆ సమయంలో విష్ణుకాంత్.. 'మౌనంగా ఉంటే ఎఫైర్స్ నిజమైన ప్రేమను కూడా ఫేక్ ప్రేమగా మార్చేస్తాయి' అని పోస్ట్ చేశాడు. అటు సంయుక్తా కూడా.. 'ఇది కొత్త జీవితానికి ఆరంభం, ఇక మీదట మరింత ధృడంగా ముందుకు వెళ్తా'నని పోస్ట్ చేసింది. పెళ్లైన రెండు నెలలకే విడిపోయిన ఈ జంట తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. మాజీ భార్య సంయుక్త ఆడియో క్లిప్‌ను నెట్టింట రిలీజ్ చేశాడు విష్ణు. సంయుక్త తన మాజీ ప్రియుడు విజయ్‌తో ఇంకా టచ్‌లో ఉందని తెలియజేస్తూ ఈ క్లిప్ వదిలాడు. విష్ణుకాంత్తో పెళ్లికి సిద్ధమయ్యాక కూడా మాజీ ప్రేమికుడిని మర్చిపోలేనందువల్లే వీరు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. విష్ణు ఆమె అందాన్ని కోరుకున్నాడు ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ తమిళనాట బుల్లితెర ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. ఇది చూసిన కొందరు సంయుక్తను విమర్శిస్తుండగా ఆమె అభిమానులు మాత్రం మేము నీవెంటే ఉన్నామంటూ ధైర్యాన్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని.. 'విష్ణు చెప్పేది తప్పా?ఒప్పా? అనేది పక్కన పెడితే పాత ఆడియో రికార్డింగ్‌ను ఇప్పుడు నెట్లో పెట్టడం అనేది చాలా తప్పు. ఇక్కడ విష్ణునే సంయుక్త అందాన్ని చూసి పడిపోయి ఆమెతో శారీరకంగా కలిసి ఉండాలనుకున్నాడు. కానీ పెళ్లనేది ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వారి పెళ్లి వర్కవుట్ కాలేదు. సామ్ ప్రేమ వ్యవహారం విష్ణుకు తెలుసు తను నిజంగా సామ్‌ను ప్రేమిస్తే ఇలా అందరి ముందు ఆమెను అవమానపర్చడు. సామ్, రవి ఇద్దరూ 'నిరమతే నిలవే' అనే వెబ్ సిరీస్‌లో కలిసి నటించారు. ఎన్నో ఇంటర్వ్యూల్లో వారు తమ గురించి బాహాటంగానే చెప్పారు. కాబట్టి పెళ్లికి ముందే ఆమె గతం గురించి అతడికి కచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇప్పుడేమో ఏమీ ఎరగనట్లు నటిస్తున్నాడు. సామ్ ఈ సమస్య నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను' అని కామెంట్ చేశాడు. దీన్ని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన సంయుక్త.. లవ్ ఎమోజీతో పాటు కృతజ్ఞతగా నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది. చదవండి: పవిత్రా లోకేశ్ ఒక్క రోజు పారితోషికం ఎంతో తెలుసా? -
కోపంతో నడిరోడ్డుపై అతడి చెంప పగలగొట్టా.. హీరోయిన్
హీరోయిన్ సంయుక్తకు కోపం ఎక్కువేనట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. 2016లో పాప్‌కార్న్ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామ తమిళంలో జులై కాట్రిల్, ఇరుడా చిత్రాలలో నటించింది. అయితే అవేవీ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో ధనుష్ కథానాయకుడిగా నటించిన వాత్తీ చిత్రంలోనూ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వెంటనే తెలుగులో నటుడు సాయిధరమ్ తేజ్ సరసన విరూపాక్ష చిత్రంలో నటించింది. లక్కీగా ఆ చిత్రం హిట్ అయింది. ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సమంత వీరాభిమానినని చెప్పింది. ఆమె నటన అంటే చాలా ఇష్టమని పేర్కొంది. తనను ఆమెలా ఉంటానని చాలా మంది అంటున్నారని, అయితే ఆమెలా నటిస్తున్నానని చెప్తుంటే ఇంకా సంతోషంగా ఉందని చెప్పింది. అదేవిధంగా నటుడు ధనుష్ నటన నచ్చుతుందని పేర్కొంది. తాను 10వ తరగతి చదువుతున్నప్పుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన ఆడుగళం చిత్రం పాటలను బస్సులో చూసి డాన్స్ చేసేదాన్నని చెప్పింది. అలాంటిది ఆయనకు జంటగా నటిస్తానని ఊహించలేదని పేర్కొంది. తనకు నటనకు అవకాశం వున్న పాత్రలు చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలలో నటించాలని ఆశిస్తున్నానంది. తనకు కోపం ఎక్కువ అని.. ఒకసారి తాను, తన తల్లి కలిసి బయటకు వెళుతుండగా ఒక వ్యక్తి సిగరెట్ కాల్చుతూ పొగను తమపై వదిలాడని దీంతో కోపంగా అతని చెంప పగలగొట్టానని సంయుక్త తెలిపింది. తనకు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టమని, అదీ ఒంటరిగా ప్రయాణం చేయడం ఇంకా ఇష్టమని చెప్పింది. ఎక్కువగా హిమాలయాలకు వెళుతుంటానని, ఖాళీ సమయాల్లో కవితలు రాస్తుంటానంది. తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు విడిపోయారని, అందుకే తండ్రి ఇంటి పేరును తన పేరులో నుంచి తీసేసానని సంయుక్త తెలిపింది. చదవండి: మా అమ్మ చాలా స్ట్రిక్ట్: శ్రీలీల -
పెళ్లైన రెండు నెలలకే భర్తతో విడాకులు? నటి ఇన్‌స్టా పోస్ట్ వైరల్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు ఎంత కామనో, పెళ్లిళ్లు, విడాకులు కూడా అంతే కామన్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు కొద్దికాలానికే విడిపోతున్నారు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు విడాకులు తీసుకొని ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. తాజాగా మరో సినీ జంట కూడా విడాకులు తీసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న రెండు నెలలకే వాళ్లు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. తమిళంలోని ప్రముఖ సీరియల్ ‘సిప్పినీల్ ముత్తు’ లో సంయుక్త-విష్ణుకాంత్ కలిసి నటించారు. వారి పరిచయం ప్రేమకు దారితీసింది. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం పెద్దలను ఒప్పించి మార్చి 3న వైభవంగా పెళ్లి చేసుకున్నారు. చూడముచ్చటగా కనిపించే ఈ జంట మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత కలిసుండలేమంటూ ప్రకటించారు. సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేసి షాకిచ్చారు. చదవండి: హీరో అజిత్ రీల్ కూతురు చనిపోయినట్లు పోస్టర్ కలకలం అంతేకాకుండా ఇద్దరూ ఇన్‌స్టాలో స్పెషల్ నోట్‌తో విడిపోతున్నాం అంటూ ఇన్‌డైరెక్ట్ కోట్స్ చేస్తున్నారు. విష్ణుకాంత్ తన ఇన్‌స్టా స్టోరీలో.. 'ఎఫైర్స్ నిజమైన ప్రేమను ఫేక్ లవ్‌గా మార్చేస్తాయి. నో మోర్ సైలెన్స్' అంటూ ఓ పోస్ట్ చేశాడు. సంయుక్తా కూడా.. 'ఒక మహిళను శక్తివంతంగా ఎదుర్కోలేనప్పుడు ఇలాంటి నిందలు వేస్తారు.. ఫేక్‌లవ్' అంటూ ఇన్‌స్టా స్టోరీ లో పంచుకుంది. ఇది కొత్త జీవితానికి ఆరంభం అని, ఇప్పట్నుంచి మరింత ధృడంగా ముందుకు వెళ్తానంటూ పేర్కొంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో వీరి విడాకుల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. పెళ్లైన రెండు నెలలకే విడిపోవడం ఏంటని పెదవి విరుస్తున్నారు. చదవండి: బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్ వీడియోను షేర్ చేసిన హీరోయిన్ -
ఓకే చెప్పాకే ఆలోచిస్తా, ఇకపై అలాంటి ప్రశ్న తలెత్తకూడదు: హీరోయిన్
కోలీవుడ్‌లో వరుసగా రెండు సక్సెస్‌లను అందుకుని జోరుమీదున్న నటి సంయుక్త. మాలీవుడ్‌లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ ఇంతకుముందు ధనుష్ కథానాయకుడిగా తమిళం, తెలుగు భాషల్లో నటించిన వాత్తీ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో పాటు ఆమెకు మంచి పేరు వచ్చింది. దీంతో వెంటనే విరూపాక్ష అనే మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గత వారం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నటి సంయుక్త నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించింది. కాగా విరూపాక్ష చిత్రం తమిళంలోనూ అనువాదం అయి ఈనెల 5వ తేదీన తెరపైకి రాబోతుంది. ఈ సందర్భంగా శనివారం చైన్నెలో మీడియాతో ముచ్చటించిన నటి సంయుక్త ఏ విషయంలోనైనా తాను ముందు ఓకే చెప్పి ఆ తరువాతే ఆలోచిస్తానని చెప్పింది. విరూపాక్ష వంటి కమర్షియల్ కథా చిత్రంలో కథానాయిక పాత్రకు ప్రాధాన్యతను ఇవ్వడం అన్నది అభినందించదగ్గ విషయం అని పేర్కొంది. ఈ చిత్రం కోసం చాలా రిస్క్ చేసి నటించినట్లు చెప్పింది. భవిష్యత్‌లో కథానాయికల పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందా? అన్న ప్రశ్నకు తావే ఉండరాదని పేర్కొంది. దయచేసి దర్శక, నిర్మాతలు మహిళా పాత్రలకు ప్రాధాన్యత నివ్వాలని విజ్ఞప్తి చేసింది. ప్రతిభావంతమైన నటీమణులు ఇక్కడ చాలా మంది ఉన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమిళంలో మరిన్ని చిత్రాలలో నటించాలని కోరుకుంటున్నానని నటి సంయుక్త పేర్కొంది. చదవండి: ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ ఆత్మహత్య -
విరూపాక్ష హీరోయిన్ సంయుక్త స్పెషల్
సౌతిండియన్ చిత్రాల్లో అన్ని లాంగ్వేజ్ సినిమాల్లో నటించిన సంయుక్త(సంయుక్త మీనన్)కు.. ఈ ఏడాది టాలీవుడ్లో బాగా కలిసొచ్చింది. ధనుష్ సార్ చిత్రంతో తెలుగులోనూ సాలిడ్ హిట్ అందుకున్న సంయుక్త.. ఇప్పుడు విరూపాక్షతోనూ ఆడియొన్స్‌ను మెస్మరైజ్ చేసింది. కిందటి ఏడాది భీమ్లా నాయక్, బింబిసారలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు సంయుక్త. ► 1995, సెప్టెంబర్ 11న పాలక్కాడ్(కేరళ)లో జన్మించింది సంయుక్త(సంయుక్త మీనన్). ► ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసి.. 2016లో పాప్‌కార్న్ చిత్రంతో మాలీవుడ్‌లో అగుడుపెట్టింది. ► కలరి చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టారు సంయుక్త. జులై కాట్రిల్, ఎరిడా, వాతి చిత్రాల్లో నటించారు. ► మాలీవుడ్‌లో ‘లిల్లీ’, టోవినో థామస్ సరసన ‘కల్కి’, ‘తీవండి’, వెల్లమ్, వోల్ఫ్, కడువా, బూమరాంగ్ తదితర చిత్రాల్లో నటించింది. ఉయరేలో ఓ కీలక పాత్ర పోషించింది. ► పవన్-రానాల మల్టీస్టారర్ భీమ్లా నాయక్‌తో టాలీవుడ్లో అడుగుపెట్టింది. కల్యాణ్ రామ్ బింబిసార, ధనుష్ బైలింగువల్ సార్(వాతి), సాయి ధరమ్‌తేజ్ విరూపాక్షతో హిట్లు అందుకుంది. ► కిందటి ఏడాది గాలిపటా2తో శాండల్‌వుడ్‌లో అడుగుపెట్టింది ఈ మల్లు బ్యూటీ. ► తనను సంయుక్తా మీనన్ అని పిలవొద్దని అంటున్నారామె. సంయుక్తా మీనన్లో ఇంటి పేరు ‘మీనన్’ను తాను పక్కనపెట్టానని, తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారామె. ► టిపికల్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సంయుక్త.. హీరోయిన్లను సినిమా ఫలితం ఆధారంగా గోల్డెన్ లెగ్-ఐరెన్ లెగ్ అని విభజించడాన్ని తాజాగా విరూపాక్ష ప్రెస్మీట్లో తీవ్రంగా ఖండించారు తాజాగా. -
సస్పెన్స్,ట్విస్టులతో పిచ్చెక్కిపోతారు..
-
తేజ్ పైనే ఆశలు...
-
ఊహించని లాభాలలో విరుపాక్ష మూవీ ప్రాఫిట్ ఎన్ని కొట్లో తెలిస్తే బిత్రరాపోతారు..
-
దూసుకుపోతున్న సార్.. ఇప్పటిదాకా ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం వాత్తీ. తెలుగులో సార్ పేరుతో రిలీజైంది. కేరళ కుట్టి సంయుక్త హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలవగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకుడిగా వ్యవహరించారు. ఈ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్ ..తొమ్మిది రోజుల్లోనే రూ.75 కోట్ల మార్క్ దాటిందంటూ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. సార్ త్వరలోనే వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. Our beloved #Vaathi / #Sir has garnered unconditional love ❤️ & 75+ crores gross worldwide 💸 Blockbuster Classes All Over! 🌎@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @iSumanth @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya @SitharaEnts @7screenstudio @adityamusic pic.twitter.com/shZXZXBTiP— Sithara Entertainments (@SitharaEnts) February 25, 2023 చదవండి: జోర్దార్గా రాకింగ్ రాకేశ్, సుజాతల హల్ది ఫోటోలు వైరల్ -
ఆ హీరోయిన్ కు 'ఐ లవ్ యు' చెప్పిన త్రివిక్రమ్.. వీడియో వైరల్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచులకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా మరోసారి త్రివిక్రమ్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోలీవుడ్ హీరో ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్న సినిమా సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ధనుష్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీతో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక తన స్పీచ్‌లో మూవీటీంపై ప్రశంసలు కురిపించిన త్రివిక్రమ్.. హీరోయిన్ సంయుక్త గురించి మాట్లాడుతూ.. అందరి ముందే ఆమెకు 'ఐ లవ్ యు' చెప్పేశారు. దీంతో ఈవెంట్‌కు వచ్చిన అభిమానులు ఈలలు, కేకలతో వేదికను హోరెత్తించారు. దాంతో ‘లేదండి బాబూ.. పూర్తిగా చెప్పేది వినండి.. కంగారు పడకండి అంటూ కాస్త కవర్ చేశారు త్రివిక్రమ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈవెంట్లో త్రివిక్రమ్ స్పీచ్ హైలైట్‌గా నిలిచింది. -
అమ్మానాన్న విడాకులు.. అందుకే ఇంటిపేరు తీసేశా: హీరోయిన్
'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సంయుక్త మీనన్. తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఆమె సార్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో హీరో ధనుష్ సరసన కథానాయికగా నటించనుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన పేరెంట్స్ గురించి మాట్లాడింది. నేను స్కూలులో జాయిన్ అయ్యేటప్పుడు ఇంటిపేరు రాయమన్నారు. అప్పటిదాకా మన పేరు పక్కన ఈ తోక ఏంటా? అనుకునేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక నటిగా నాకు బాధ్యత తెలిసివచ్చింది. మీనన్ అనే పదం నా పేరు పక్కన ఉండటం సబబు కాదనిపించింది. సమానత్వం, మానవత్వం, ప్రేమ అన్నింటినీ నేను కోరుకున్నప్పుడు ఇంటి పేరు అడ్డొస్తుందనిపించింది. పైగా నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అమ్మ.. నాన్న ఇంటిపేరును కొనసాగించకూడదని కోరుకుంది. తన అభిప్రాయాన్ని నేను గౌరవించాలనుకున్నాను అని చెప్పుకొచ్చింది. ఇకపోతే సంయుక్త మీనన్ సాయిధరమ్ తేజ్ విరూపాక్షలోనూ నటించనుంది. చదవండి: తమాషాగా ఉందా? రెండో భర్తకు కూడా విడాకులా? -
తెలుగు తెరపై మలయాళ కుట్టీల హవా.. పవన్, మహేశ్ సినిమాల్లో చాన్స్!
కొత్త సినిమా చర్చ జరుగుతోంది... చర్చ హీరోయిన్ దగ్గర ఆగింది... కొత్త హీరోయిన్ కావాలి... ‘హల్లో మల్లు’ అంటూ టాలీవుడ్ నుంచి మల్లూవుడ్కి ఫోన్ వెళ్లింది.. అలా ఈ ఏడాది అరడజనకు పైగా కేరళ కుట్టిలకు ఫోన్ వెళ్లింది.. తెలుగు తెరకు పరిచయం కానున్న ఈ మలయాళ కుట్టీల గురించి తెలుసుకుందాం. బాలనటి నుంచి హీరోయిన్గా మారి మలయాళం, తమిళ ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేశారు నజ్రియా నజీమ్. ‘నిరమ్’, ‘రాజారాణి’, ‘బెంగళూరు డేస్’, ‘ట్రాన్స్’ వంటి చిత్రాల్లోని నటన నజ్రియాను స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేర్చింది. ఇప్పుడు ఈ బ్యూటీ నాని తాజా సినిమా ‘అంటే.. సుందరానికీ’తో తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నట్లు.. నజ్రియా భర్త, ప్రముఖ మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ ‘పుష్ప’తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక బుల్లితెరపై సూపర్ హిట్ అయి, ఇప్పుడిప్పుడే వెండితెరపై ఫేమస్ అవుతున్న రజీషా విజయన్ ‘రామారావు: ఆన్ డ్యూటీ’తో తెలుగులో తొలి అడుగు వేశారు. రవితేజ హీరోగా శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరో మలయాళ కుట్టి అనిఖా సురేంద్రన్ అజిత్ నటించిన ‘ఎన్నై అరిందాల్’, ‘విశ్వాసం’ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొంది, ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్గా చేస్తున్నారు. మలయాళ హిట్ ‘కప్పేలా’ తెలుగు రీమేక్‌లో హీరోయిన్గా నటిస్తున్నారు అనిఖా. ఇందులో విశ్వస్ సేన్ హీరో. మరోవైపు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఐదేళ్లలోనే దాదాపు పదిహేను సినిమాలను ఖాతాలో వేసుకోవడమే కాకుండా స్టార్ డైరెక్టర్ మణిరత్నం రూపొందిస్తున్న పీరియాడికల్ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’లో ఓ కీ రోల్ చేసే చాన్స్ దక్కించుకున్నారు ఐశ్వర్యా లక్ష్మీ. ‘గాడ్సే’ ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయం కానున్నారామె. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి గోపీ గణేష్ దర్శకుడు. ఇంకోవైపు మ్యూజిక్ వీడియోస్‌తో ఫేమస్ అయి, హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుని దూసుకెళుతున్నారు సౌమ్యా మీనన్. ఈ బ్యూటీ మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’లో కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. ఇక పవన్‌కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రంతో టాలీవుడ్‌కి హాయ్ చెబుతున్నారు సంయుక్తా మీనన్. ఇందులో రానాకు జోడీగా నటిస్తున్నారు సంయుక్తా. అలాగే కల్యాణ్ రామ్ ‘బింబిసారా’లో కూడా ఓ హీరోయిన్గా నటిస్తున్నారు సంయుక్తా మీనన్. మరి.. ఈ మల్లూవుడ్ కుట్టీలు తెలుగు తెరను ఏ రేంజ్లో రూల్ చేస్తారో చూడాలి. -
తమిళ హిజ్రాకు కీలక పదవి
సాక్షి, చెన్నై: తమిళనాట పుట్టి, ఇక్కడే చదువుకుని ఐరోపా, అమెరికాల్లో రాణించి మళ్లీ భారత్‌కు వచ్చిన మూడో కేటగిరి (హిజ్రా)కి చెందిన సంయుక్తా విజయన్‌కు స్విగ్గీలో కీలక పదవి వరించింది. సంయుక్తను ప్రిన్సిపల్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించారు. ఈ పదవిలో చదువుకున్న మూడో కేటగిరి వారికి ప్రాధాన్యతను కల్పించే విధంగా ముందుకు సాగుతానని సంయుక్తా పేర్కొన్నారు. పురుషులు, స్త్రీలతో సమానంగా ఏ రంగంలో నైనా తామూ రాణిస్తామన్నట్టుగా హిజ్రాలూ దూసుకొస్తున్నారు. మూడో కేటగిరిలో ఉన్న ఈ హిజ్రాలకు ప్రభుత్వాలు సైతం ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తున్నాయి. కోర్టులు సైతం అండగా నిలబడుతుండడంతో పట్టభద్రులైన వారు వారికి నచ్చిన ఉద్యోగాల్ని దక్కించుకుంటున్నారు. ఇదే ఉత్సాహంతో ఉన్నత చదువులపై దృష్టి పెట్టే వారు క్రమంగా పెరుగుతున్నారు. మూడో కేటగిరిలో తాము ఉన్నా, ఏ రంగంలోనైనా రాణిస్తామన్న ధీమాతో పరుగులు తీస్తున్నారు. ఆ దిశగా ప్రస్తుతం తమిళనాడుకు చెందిన హిజ్రా సంయుక్తా విజయన్ ప్రముఖ ఫుడ్ డెలివర్ సంస్థ స్విగ్గిలో కీలక బాధ్యతలు చేపట్టడం విశేషం. మూడో కేటగిరికి ప్రాధాన్యత.... సంయుక్త విజయన్ తమిళనాడు వాసి. పుట్టింది ఇక్కడే. ఇక్కడి పీఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో బీఈ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ పూర్తి చేశారు. తాను హిజ్రాగా ఉన్నా, కుటుంబం నుంచి లభించిన ప్రోత్సాహంతో అడుగుల వేగాన్ని పెంచారు. ఐరోపా, అమెరికాల్లో ఫ్యాషన్ రంగంలోని కొన్ని సంస్థల్లో పనిచేశారు. భారత్‌కు తిరిగి వచ్చిన అనంతరం ఆన్లైన్ విక్రయ సంస్థ అమెజాన్‌లో పనిచేశారు. సొంతంగా ఫ్యాషన్ సంస్థతో ముందుకు సాగుతూ వచ్చిన సంయుక్తా విజయన్ ప్రస్తుతం స్విగ్గీలో కీలక బాధ్యతలు స్వీకరించారు. ఆ సంస్థలో ప్రిన్సిపల్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా నియమించబడ్డ సంయుక్త తమిళనాడు వాసి కావడంతో ఇక్కడి మీడియా ఆమె హిజ్రాలకు ఆదర్శంగా పేర్కొంటూ వార్తలను ప్రచూరించడం విశేషం. ఇక, తాను టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా స్విగ్గీలో హిజ్రాలకు ప్రాధాన్యతను కల్పించే దిశగా ముందుకు సాగుతానని సంయుక్తా పేర్కొన్నారు. మూడో కేటగిరిలో ఉన్న వారికి కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యతను పెంచే విధంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేటగిరిలో పట్టభద్రులైన వారికి ఉద్యోగ అవకాశాలు మరింతగా మెరుగుపడాలని, అవకాశాలు దరి చేరాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. తనకు కుటుంబం ప్రోత్సాహం ఉండబట్టే ఈ స్థాయికి చేరానని పేర్కొంటూ ఈ కేటగిరిలో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు ఆదరించాలని, అక్కున చేర్చుకుని ప్రోత్సాహాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కల్గిన వారికి తన వంతుగా ఉద్యోగ అవకాశాల కల్పనలో సహాకారం అందిస్తానని, అలాగే, ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ తరగతుల్ని నిర్వహించి మూడో కేటగిరి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఇప్పుడు సెట్ అయ్యింది
సినిమా: కొన్ని కాంబినేషన్లు మొదల్లో సెట్ కావు. అలా ప్రభుదేవాతో నటించే అవకాశాన్ని నటి సంయుక్త జారవిడుచుకుంది. ఈ కన్నడ భామ ఇంతకు ముందు మెర్యూరీ చిత్రంలో ప్రభుదేవాతో కలిసి నటించాల్సింది. అయితే కాల్షీట్స్ సమస్య, ఇతర చిత్ర వర్గాలు ఈ బ్యూటీపై ఫిర్యాదుల కారణంగా ఆ అవకాశాన్ని వదులుకోక తప్పలేదు. అలా మిస్ అయిన అవకాశం మరోసారి నటి సంయుక్త తలుపు తట్టింది. ఈ సారి మాత్రం ఈ బ్యూటీ వదలుకోదలచుకోలేదు. వెంటనే ఓకే చెప్పేసింది. ఇక పోతే నటుడు వ్రభుదేవా 2019లో హిందిలో సల్మాన్‌ఖాన్ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈలోగా తమిళంలో వరుసగా చిత్రాలు చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈయన చేతిలో యంగ్ మంగ్ చంగ్, చార్లి చాప్లిన్–2, దేవి–2 అంటూ నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. తేల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. స్టూడియోగ్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్య సంగీతాన్ని, విఘ్నేశ్ ఛాయాగ్రహణను అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ చెన్నైలో జరుపుకుంటోంది. ఇందులో హీరోయిన్ ఎవరన్నది చిత్ర వర్గాలు ఇంతకు ముందు వెల్లడించలేదు. తాజాగా నటి సంయుక్తను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆమెతో పాటు తేల్ చిత్రంలో ప్రధాన కథా పాత్రలో నటి ఈశ్వరీరావు నటిస్తున్నారు. ఈమె పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు చిత్ర వర్గాలు. మరో ముఖ్య పాత్రలో నటుడు యోగిబాబు నటిస్తున్నారు. కాగా మెర్క్యూరీ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వవలసిన నటి సంయుక్తకి ఇప్పుడు ప్రభుదేవాతో సెట్ అయ్యిందన్న మాట. -
బరువు.. బాధ్యత!
శ్రీకాకుళం, వీరఘట్టం: కోడి రామ్మూర్తి నాయుడు నుంచి కరణం మల్లీశ్వరి వరకు జిల్లా క్రీడాకారులు బరువును బాధ్యతగానే తీసుకున్నారు. అదే వరుసలో పయనిస్తోంది వీరఘట్టం అమ్మాయి తూముల సంయుక్త. రాజాం జీఎంఆర్‌ఐటీలో ద్వితీయ ఏడాది ట్రిపుల్ ఈ చదువుతున్న సంయుక్త పవర్‌లిఫ్టింగ్‌లో జాతీయ స్థాయిలో సిక్కోలు కీర్తి పతాకం ఎగురవేస్తోంది. ఇంటర్మీడియెట్ వరకు కనీసం క్రీడల్లో ప్రావీణ్యత లేని సంయుక్త ఇంజినీరింగ్‌లో మాత్రం కళాశాల యాజమాన్యం చొరవతో పవర్ లిఫ్టింగ్‌పై దృష్టి సారించింది. ట్రైనర్ మహేష్ పర్యవేక్షణలో ప్రతి రోజూ 4 గంటల చొప్పున సాధన చేస్తూ పవర్ లిఫ్టింగ్ క్రీడలో జాతీయ స్థాయిలో రాణిస్తోంది ఈ వీరఘట్టం వనిత. పవర్ లిఫ్టింగ్ క్రీడలో రాణిస్తున్న సంయుక్తకు వీరఘట్టం కళింగ వైశ్యసంఘం సభ్యులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కూర్మనా«థ్, బి.సంపత్‌కుమార్, రిటైర్డ్ ఎంఈఓ బీవీ సత్యానందం, తహసీల్దార్ ఎస్.ఆంజనేయులు అభినందనలు తెలిపారు. ప్రాథమిక విద్య వీరఘట్టంలోనే.. వీరఘట్టంకు చెందిన వ్యాపారి తూముల శ్రీనివాసరావు, తేజశ్రీల కుమార్తె సంయుక్త 1 నుంచి 7వ తరగతి వరకు స్థానిక మహర్షి హైస్కూల్లో, 8 నుంచి పదో తరగతి వరకు పాలకొండ నవోదయ విద్యాలయంలో చదివి టెన్త్‌లో 8.5 గ్రేడ్ పాయింట్లతో పాసైంది. తర్వాత విశాఖలోని నారాయణ జూనియర్ కళాశాలలో చదివి 940 మార్కులు సాధించింది. ప్రస్తుతం రాజాం జీఎంఆర్ ఐటీలో ద్వితీయ సంవత్సరం ట్రిపుల్ ఈ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ కోర్సు చేస్తోంది. అంతర్జాతీయ పతకాలే లక్ష్యం ఇంజినీరింగ్‌లో చేరిన తర్వాత పవర్ లిఫ్టింగ్ పై ఆసక్తి కలిగింది. జీఎంఆర్ యాజమాన్యం పూర్తి సహకారాన్ని అందించడంతో ట్రైనర్ మహేష్ శిక్షణలో రాణిస్తున్నాను. అంతర్జాతీ య వేదికపై సత్తాచాటి బంగారు పతకం సాధించడంమే నా లక్ష్యం. అందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నాను.– తూముల సంయుక్త, వీరఘట్టం పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తూ.. ♦ ఈ ఏడాది మే 26, 27 తేదీల్లో విశాఖ బుల్లయ్య కాలేజీలో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ♦ ఈ ఏడాది జూన్ 21 నుంచి 25 వరకు జీఎంఆర్ కాలేజీలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఐదో స్థానంలో నిలిచింది. ♦ జూలై 14, 15వ తేదీల్లో విజయవాడలో జరిగిన సబ్ జూనియర్ అంతర జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలో రెండో స్థానం కైవసం చేసుకుంది. ♦ గత ఏడాది నవంబర్‌లో రాజమహేంద్రవరంలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. ♦ తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు లక్నోలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 63 కిలోల విభాగంలో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించి రికార్డు సృష్టించింది. -
మార్చి 16న ‘కిర్రాక్ పార్టీ’
నిఖిల్ హీరోగా తెరెకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కిర్రాక్ పార్టీ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 16 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. నిఖిల్ స్టైలిష్ మ్యాచో లుక్స్ చిత్రంపై అంచనాలను మరింత పెంచేసాయి. కన్నడ సినిమా కిరిక్ పార్టీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమా నిఖిల్‌కు మరో హిట్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కిర్రాక్ పార్టీ సినిమాతో శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిఖిల్ తో ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకులు సుధీర్ వర్మ, చందూ మొండేటి ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీన్జ నిఖిల్ సరసన హీరోయిన్ లు గా నటిస్తుండగా రామబ్రహ్మం సుంకర, కిషోర్ గరికిపాటి, అజయ్ సుంకర, అభిషేక్ అగ్రవాల్ నిర్మాతలుగా ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏటివి బ్యానర్ ల పై నిర్మిస్తున్న కిర్రాక్ పార్టీ మార్చ్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీ గా విడుదల కానుంది. -
వివాదంలో అందాల భామ
సాక్షి, బొమ్మనహళ్లి: శాండల్‌వుడ్‌లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న అందాల సుందరి సంయుక్త హెగ్డే చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. ఆమె నటించిన ‘కాలేజీ కుమార’ సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ చేస్తున్న ప్రచారంలో హీరోయిన్ సంయుక్త హెగ్డే పాల్గొనలేదంటూ నిర్మాత పద్మనాభశెట్టి సినీ వాణిజ్య మండలికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ షూటింగ్ నుంచే నటి సంయుక్త ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉందని ఆరోపించారు. సినిమా ప్రచార కార్యక్రమాలకు ఆమె రావడం లేదని అన్నారు. ఈ ఇబ్బందులు మరొక నిర్మాతకు కలగరాదనే తాను ఈ విషయంపైన వాణిజ్య మండలికి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నానని చెప్పారు. సీనియర్ నటి శృతి మాట్లాడుతూ కళాకారులకు సినిమాల్లో నటించగానే మన పని అయిపోదని, సినిమా ముగిసే వరకు జరిగే ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని పేర్కొన్నారు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు నిర్మాత వ్యాఖ్యలపై స్పందించిన సంయుక్త.. తనకు కొంచెం అనారోగ్యం కారణంగా ప్రచార కార్యక్రమాలకు వెళ్ళలేదని.. ఇలాంటి చిన్న విషయానికి తన పైన లేని పోని ఆరోపణలు చేయడం మంచిది కాదని అన్నారు. సినిమా షూటింగ్ సమయంలో తానెవరినీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. -
మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్‌లో దారుణం
సాక్షి, హైదరాబాద్ : మాదాపూర్‌లో శ్రీ చైతన్య కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న తోట సంయుక్త(17) బుధవారం అర్థరాత్రి కాలేజ్ హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సంయుక్త స్వస్థలం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని రణంపల్లె గ్రామం. సంయుక్త తండ్రి రాజేందర్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. నీట్ మెడికల్ లాంగ్ టర్మ్ కోర్సు తీసుకునేందుకు సంయుక్త మాదాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో చేరినట్లు తెలుస్తోంది. సరిగా చదవలేకపోతున్నాననే బాధతోనే సంయుక్త ఈ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకున్న సంయుక్తను కాలేజి యాజమాన్యం ఆసుపత్రి తరలించగా.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
మంటల్లో ప్రేమ జంట
-
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..
హైదరాబాద్‌సిటీ: ముషీరాబాద్‌లో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన అభిలాష్, సంయుక్త కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. బీటెక్ చదువుతున్న వీరిద్దరూ శుక్రవారం ముషిరాబాద్‌లోని స్నేహితుడి ఇంటికి వచ్చారు. ఏమైందో ఏమో గానీ ఇద్దరూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. రూములో ఎవరూ లేకపోవడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియురాలు సంయుక్త ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందగా.. తీవ్రగాయాలపాలైన అభిలాష్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.