ఇప్పుడు సెట్‌ అయ్యింది

Samyuktha Romance With Prabhudeva Soon - Sakshi

సినిమా: కొన్ని కాంబినేషన్లు మొదల్లో సెట్‌ కావు. అలా ప్రభుదేవాతో నటించే అవకాశాన్ని నటి సంయుక్త జారవిడుచుకుంది. ఈ కన్నడ భామ ఇంతకు ముందు మెర్యూరీ చిత్రంలో ప్రభుదేవాతో కలిసి నటించాల్సింది. అయితే కాల్‌షీట్స్‌ సమస్య, ఇతర చిత్ర వర్గాలు ఈ బ్యూటీపై ఫిర్యాదుల కారణంగా ఆ అవకాశాన్ని వదులుకోక తప్పలేదు. అలా మిస్‌ అయిన అవకాశం మరోసారి నటి సంయుక్త తలుపు తట్టింది. ఈ సారి మాత్రం ఈ బ్యూటీ వదలుకోదలచుకోలేదు. వెంటనే ఓకే చెప్పేసింది. ఇక పోతే నటుడు వ్రభుదేవా 2019లో హిందిలో సల్మాన్‌ఖాన్‌ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఈలోగా తమిళంలో వరుసగా చిత్రాలు చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈయన చేతిలో యంగ్‌ మంగ్‌ చంగ్, చార్లి చాప్లిన్‌–2, దేవి–2 అంటూ నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. తేల్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. స్టూడియోగ్రీన్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సత్య సంగీతాన్ని, విఘ్నేశ్‌ ఛాయాగ్రహణను అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ తొలి షెడ్యూల్‌ చెన్నైలో జరుపుకుంటోంది. ఇందులో హీరోయిన్‌ ఎవరన్నది చిత్ర వర్గాలు ఇంతకు ముందు వెల్లడించలేదు. తాజాగా నటి సంయుక్తను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆమెతో పాటు తేల్‌ చిత్రంలో ప్రధాన కథా పాత్రలో నటి ఈశ్వరీరావు నటిస్తున్నారు. ఈమె పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌ అంటున్నారు చిత్ర వర్గాలు. మరో ముఖ్య పాత్రలో నటుడు యోగిబాబు నటిస్తున్నారు. కాగా మెర్క్యూరీ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వవలసిన నటి సంయుక్తకి ఇప్పుడు ప్రభుదేవాతో సెట్‌ అయ్యిందన్న మాట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top