థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా | Chatha Pacha Movie OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Chatha Pacha OTT Release: నిన్ననే రిలీజైంది.. ఇంతలోనే ఓటీటీ స్ట్రీమింగ్

Feb 14 2026 6:15 PM | Updated on Feb 14 2026 6:20 PM

Chatha Pacha Movie OTT Telugu Details

ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలోకి వచ్చిన కొన్నిరోజులకే చాలా సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అలానే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ స్టైల్‌లో ఉండే ఓ యాక్షన్ మూవీ.. డిజిటల్‌గా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా తేదీని ప్రకటించేశారు. కాకపోతే మరీ బిగ్ స్క్రీన్‌పైకి వచ్చిన ఆరు రోజులకే స్ట్రీమింగ్ కానుండటం ఇక్కడ విశేషం.

(ఇదీ చదవండి: కాబోయే భార్యకు ముద్దుపేరు.. అల్లు శిరీష్ వాలంటైన్స్ డే వీడియో)

మలయాళంలో గత నెల 22న రిలీజైన సినిమా 'చథా పచ్చ'. రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. అర్జున్ అశోకన్, రోషన్ మ్యాథ్యూ, ఇషాన్ సౌకత్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. అద్వైత్ నాయర్ దర్శకుడు. తొలుత తెలుగులోనే జనవరిలోనే విడుదల చేయాలనుకున్నారు గానీ వాయిదా వేశారు. నిన్ననే అంటే ఫిబ్రవరి 13న థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇంతలోనే ఇప్పుడు ఓటీటీ డేట్ ప్రకటించారు. వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 19) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

'చథా పచ్చ' విషయానికొస్తే.. ముగ్గురు అన్నదమ్ములు సవి(అర్జున్ అశోకన్), లిటిల్ (ఇషాన్ షౌకత్), వెట్రి(రోషన్) తమ చిన్నప్పటి నుంచి టీవీల్లో రెజ్లింగ్, కుస్తీ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లాంటివి చూస్తూ పెరుగుతారు. కొన్ని కారణాల వల్ల వీళ్లు విడిపోతారు. లిటిల్, సవి.. కొచ్చిలో కాస్ట్యూమ్ రెజ్లింగ్ ప్రారంభించే పనిలో ఉంటారు. వీళ్లకు వెట్రి ఎందుకు దూరంగా ఉ‍న్నాడు. లిటిల్, సవి మొదలుపెట్టిన రెజ్లింగ్ పోటీ సక్సెస్ అయిందా? ఈ ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్‌గా ఇన్‌స్టా ఫేమస్ భామ.. గ్లింప్స్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement