Chatha Pacha Movie
-
ఓటీటీలో మలయాళ యాక్షన్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీల్లో కొత్త సినిమాలు ఏమొచ్చాయా అని ప్రతివారం తెలుగు ఆడియెన్స్ ఓ లుక్కేస్తూనే ఉంటారు. అందుకు తగ్గట్లే ఆయా భాషల మూవీస్.. డబ్బింగ్ రూపంలో అందుబాటులోకి వస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ మలయాళ యాక్షన్ కామెడీ సినిమా కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. 90స్ కిడ్స్‌కి ఎంతో ఇష్టమైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈకి లోకల్ టచ్ ఇచ్చిన తీసిన చిత్రమే 'చథా పచ్చ'. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సావియో (అర్జున్ అశోకన్), వెట్రి(రోషన్ మ్యాథ్యూ), థామస్ (ఇషాన్ సౌకత్).. కొచ్చిలో పెరిగిన అన్నదమ్ములు. ఒకే తల్లి కడుపున పుట్టనప్పటికీ కలిసిమెలసి ఉంటారు. వీళ్లు ముగ్గురు.. చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ షో చూస్తూ పెరుగుతారు. వాల్టర్ దగ్గర కుస్తీ కూడా నేర్చుకుంటారు. కానీ థామస్ అలియాస్ లిటిల్.. తల్లితో కలిసి ఢిల్లీ వెళ్లిపోవాల్సి వస్తుంది. సావియో, వెట్రి మాత్రం కొచ్చిలోనే ఉండిపోతారు. కొన్నేళ్ల తర్వాత సోదరులని వెతుక్కుంటూ లిటిల్, సొంతూరికి వస్తాడు. కుస్తీ క్లబ్ మొదలుపెడదామని సావియోకు చెబుతాడు. దీంతో కొంతమందితో కలిసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సైల్ ఫైటింగ్ క్లబ్ ప్రారంభిస్తారు. తర్వాత ఏమైంది? జైలు నుంచి వెట్రి బయటకొచ్చాడా? అసలు వాల్టర్ ఎవరు? చెరియన్(వైశాఖ్ నాయర్)తో సావియోకి శత్రుత్వం ఏంటనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ(WWE) షోకి ఇప్పుడు పెద్దగా క్రేజ్ లేదు గానీ 90స్ కిడ్స్‌ని అడిగితే దాని గురించి కథలు కథలుగా చెబుతారు. ఎందుకంటే చాలామంది అబ్బాయిలు.. స్కూల్‌కి వెళ్లేముందు, వచ్చిన తర్వాత ఈ షోని తెగ చూసేవారు. ఇందులో చూపించిన స్టంట్స్‌ని నిజజీవితంలోనూ చేసి గాయాలపాలయ్యేవారు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తీసుకుని తీసిన సినిమానే 'చథా పచ్చ'. ఈ టైటిల్‌కి తెలుగులో చావోరేవో(డూ ఆర్ డై) అని అర్థం.స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఇప్పటివరకు మలయాళంలో కావొచ్చు తెలుగులో కావొచ్చు చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో తీసుకున్న నేపథ్యం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కథ పరంగా చూస్తే మాత్రం చాలా సింపుల్. ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ల మధ్య పొరపొచ్చలు. చివరకు కలిసిపోవడం ఇంతే. కానీ దీనికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్ టచ్ ఇవ్వడం ఆసక్తికరంగా అనిపించింది. దాదాపు రెండు గంటల పాటు బాగానే ఎంటర్టైన్ చేసింది.డబ్బింగ్ పరంగా బాగానే ఉన్నప్పటికీ ప్రధాన పాత్రల పేర్లు.. తెలుగు ప్రేక్షకులకు సరిగా అర్థం కావు. దీన్ని వదిలిస్తే సినిమా మాత్రం వేరే లెవల్ ఎంటర్టైనింగ్గా ఉంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఈ టచ్ అని మొత్తం ఫైట్స్ పెట్టేయకుండా ఎమోషన్ కూడా ఎంత కావాలో అంత పెట్టారు. స్టోరీ కూడా చాలా ఆర్గానిక్‌గా వెళ్తుంది. ఎక్కడా కూడా కృత్రిమంగా అనిపించదు. కాకపోతే డబ్బింగ్ పాటలు అస్సలు సెట్ కాలేదు. వాటిని లైట్ తీసుకుని మూవీ చూస్తే మాత్రం బాగుంది.ఎవరెలా చేశారంటే?అన్నదమ్ములుగా చేసిన అర్జున్ అశోకన్, ఇషాన్ సౌకత్, రోషన్ మ్యాథ్యూ అద్భుతంగా చేశారు. కలర్‌ఫుల్ డ్రస్‌ల్లో భలే సెట్ అయ్యారు. నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేసిన వైశాఖ్ నాయర్ కూడా తనదైన కామెడీ, సీరియస్ యాక్టింగ్‌తో మెప్పించాడు. మిగతా పాత్రలు చేసిన యాక్టర్స్ కూడా తమ వంతు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. అద్వైత్ నాయర్ డైరెక్షన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. యాక్షన్ టచ్ ఉన్న కామెడీ మూవీ చూద్దామనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీపై లుక్కేయండి. ఎలాంటి అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు. మీరు 90స్ కిడ్స్ అయితే ఫైట్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.- చందు డొంకాన -
ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్
వాలంటైన్స్ డే వీకెండ్ కూడా అయిపోయింది. మరో కొత్తవారం వచ్చేసింది. ఈ వీకెండ్.. థియేటర్లలోకి 'హే భగవాన్', 'నవాబ్ కేఫ్', 'త్రిశంకు' అనే తెలుగు మూవీస్ రాబోతున్నాయి. అలానే మృణాల్ ఠాకుర్ 'దో దివానే సెహర్ మైన్', తాప్సీ 'అస్సీ' అనే హిందీ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. ప్రస్తుతానికైతే వీటిలో దేనిపై పెద్దగా బజ్ అయితే లేదు. మరోవైపు ఓటీటీల్లోనూ ఓ మేరకు ఆసక్తి ఉన్న సినిమాలు మాత్రమే రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతానికైతే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం లేవు. చథా పచ్చ, హాట్ స్పాట్ 2 మచ్, లక్కీ ద సూపర్‌స్టార్, కెన్నడీ లాంటి డబ్బింగ్-హిందీ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇవి కాకుండా వీకెండ్ వచ్చేసరికి మరేవైనా సడన్ సర్ప్రైజ్ ఇవ్వొచ్చేమో చూడాలి? సంక్రాంతి చిత్రాల్లో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' స్ట్రీమింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ వారం సడన్ ఎంట్రీ ఇస్తుందేమో? ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 16-22 వరకు)నెట్ఫ్లిక్స్మై పెంగ్విన్ ఫ్రెండ్ (హిందీ డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 16ద లెటర్ ఆఫ్ ద డే (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 16స్కిన్ కేర్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 16వైట్ బర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 16చథా పచ్చ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 19ద నైట్ ఏజెంట్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 19స్ట్రిప్ లా (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20అమెజాన్ ప్రైమ్హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 2056 డేస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 18హాట్స్టార్లక్కీ: ద సూపర్‌స్టార్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 20ఆహాహాట్స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 20జీ5కెన్నడీ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 20ఆపిల్ టీవీ ప్లస్ద లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 19లయన్స్ గేట్ ప్లేహీటెడ్ రైవల్రీ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా) -
థియేటర్లలో రిలీజైన 6 రోజులకే ఓటీటీలోకి తెలుగు సినిమా
ఇప్పుడంతా ఓటీటీ జమానా నడుస్తోంది. థియేటర్లలోకి వచ్చిన కొన్నిరోజులకే చాలా సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అలానే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ స్టైల్లో ఉండే ఓ యాక్షన్ మూవీ.. డిజిటల్‌గా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా తేదీని ప్రకటించేశారు. కాకపోతే మరీ బిగ్ స్క్రీన్‌పైకి వచ్చిన ఆరు రోజులకే స్ట్రీమింగ్ కానుండటం ఇక్కడ విశేషం.(ఇదీ చదవండి: కాబోయే భార్యకు ముద్దుపేరు.. అల్లు శిరీష్ వాలంటైన్స్ డే వీడియో)మలయాళంలో గత నెల 22న రిలీజైన సినిమా 'చథా పచ్చ'. రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో దీన్ని తీశారు. అర్జున్ అశోకన్, రోషన్ మ్యాథ్యూ, ఇషాన్ సౌకత్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. అద్వైత్ నాయర్ దర్శకుడు. తొలుత తెలుగులోనే జనవరిలోనే విడుదల చేయాలనుకున్నారు గానీ వాయిదా వేశారు. నిన్ననే అంటే ఫిబ్రవరి 13న థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇంతలోనే ఇప్పుడు ఓటీటీ డేట్ ప్రకటించారు. వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 19) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.'చథా పచ్చ' విషయానికొస్తే.. ముగ్గురు అన్నదమ్ములు సవి(అర్జున్ అశోకన్), లిటిల్ (ఇషాన్ షౌకత్), వెట్రి(రోషన్) తమ చిన్నప్పటి నుంచి టీవీల్లో రెజ్లింగ్, కుస్తీ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లాంటివి చూస్తూ పెరుగుతారు. కొన్ని కారణాల వల్ల వీళ్లు విడిపోతారు. లిటిల్, సవి.. కొచ్చిలో కాస్ట్యూమ్ రెజ్లింగ్ ప్రారంభించే పనిలో ఉంటారు. వీళ్లకు వెట్రి ఎందుకు దూరంగా ఉన్నాడు. లిటిల్, సవి మొదలుపెట్టిన రెజ్లింగ్ పోటీ సక్సెస్ అయిందా? ఈ ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్గా ఇన్‌స్టా ఫేమస్ భామ.. గ్లింప్స్ రిలీజ్)


