ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్ | Upcoming OTT Movies Telugu February Third Week 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీల్లో ఈ వారం వచ్చే సినిమాలివే.. మరి థియేటర్లలో?

Feb 16 2026 12:22 PM | Updated on Feb 16 2026 12:31 PM

Upcoming OTT Movies Telugu February Third Week 2026

వాలంటైన్స్ డే వీకెండ్ కూడా అయిపోయింది. మరో కొత్తవారం వచ్చేసింది. ఈ వీకెండ్.. థియేటర్లలోకి 'హే భగవాన్', 'నవాబ్ కేఫ్', 'త్రిశంకు' అనే తెలుగు మూవీస్ రాబోతున్నాయి. అలానే మృణాల్ ఠాకుర్ 'దో దివానే సెహర్ మైన్', తాప్సీ 'అస్సీ' అనే హిందీ చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. ప్రస్తుతానికైతే వీటిలో దేనిపై పెద్దగా బజ్ అయితే లేదు. మరోవైపు ఓటీటీల్లోనూ ఓ మేరకు ఆసక్తి ఉన్న సినిమాలు మాత్రమే రాబోతున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతానికైతే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం లేవు. చథా పచ్చ, హాట్ స్పాట్ 2 మచ్, లక్కీ ద సూపర్‌స్టార్, కెన్నడీ లాంటి డబ్బింగ్-హిందీ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇవి కాకుండా వీకెండ్ వచ్చేసరికి మరేవైనా సడన్ సర్‌ప్రైజ్ ఇవ్వొచ్చేమో చూడాలి? సంక్రాంతి చిత్రాల్లో రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' స్ట్రీమింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ వారం సడన్ ఎంట్రీ ఇస్తుందేమో? ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఫిబ్రవరి 16-22 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • మై పెంగ్విన్ ఫ్రెండ్ (హిందీ డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 16

  • ద లెటర్ ఆఫ్ ద డే (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 16

  • స్కిన్ కేర్ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 16

  • వైట్ బర్డ్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 16

  • చథా పచ్చ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఫిబ్రవరి 19

  • ద నైట్ ఏజెంట్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 19

  • స్ట్రిప్ లా (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20

అమెజాన్ ప్రైమ్

  • హాట్ స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 20

  • 56 డేస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 18

హాట్‌స్టార్

  • లక్కీ: ద సూపర్‌స్టార్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఫిబ్రవరి 20

ఆహా

  • హాట్‌స్పాట్ 2 మచ్ (తమిళ సినిమా) - ఫిబ్రవరి 20

జీ5

  • కెన్నడీ (హిందీ మూవీ) - ఫిబ్రవరి 20

ఆపిల్ టీవీ ప్లస్

  • ద లాస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 19

లయన్స్ గేట్ ప్లే

  • హీటెడ్ రైవల్రీ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 20

(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement