'ప్రభాస్‌'కు గాయం.. అసలు విషయం చెప్పిన టీమ్‌ | Prabhas Team Clarified On Injured news | Sakshi
Sakshi News home page

'ప్రభాస్‌'కు గాయం.. అసలు విషయం చెప్పిన టీమ్‌

Feb 16 2026 12:11 PM | Updated on Feb 16 2026 12:21 PM

Prabhas Team Clarified On Injured news

ఫౌజీ మూవీ షూటింగ్‌లో  హీరో ప్రభాస్‌  గాయపడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన టీమ్‌ ప్రకటించింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీ సెట్స్‌లో ప్రమాదం జరిగినట్లు సోషల్‌మీడియాతో పాటు ప్రధాన వెబ్‌సైట్స్‌లలో కూడా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే మన డార్లింగ్‌ టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. సినిమా సెట్స్‌ లో ప్రభాస్‌కు ఎలాంటి గాయం కాలేదని చెప్పింది. ఈరోజు కూడా షూటింగ్‌లో పాల్గొన్నారని తెలిపింది. మూవీ సెట్స్‌లో చిన్నచిన్న ప్రమాదాలు జరగడం సహజమని తన చేతి వద్ద చిన్న గీటు మాత్రమే పడినట్లు పేర్కొంది.  ఆ గీటు కూడా చికిత్స అవసరం లేనంతగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చింది.  అభిమానులు  ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదని ప్రభాస్‌ టీమ్‌ వెల్లడించింది.

‘సీతారామం’ మూవీ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న  ఫౌజీలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్‌ ఖేర్, మిథున్‌ చక్రవర్తి, భానుచందర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్‌ గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 దసరాకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement