మలయాళ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గాయత్రి గోపి పెళ్లిపీటలెక్కింది. బ్రిటీష్ అబ్బాయి జాకబ్‌ను పెళ్లాడింది. గతేడాది ఇంగ్లాండ్‌లో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. తాజాగా ఇండియాలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 15న ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహ తంతు జరిగింది.
ఏడాదిన్నరగా క్లోజ్..
అందుకు సంబంధించిన వీడియోను గాయత్రి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇతడు ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. నేను అక్కడే నెట్‌వర్క్ రైల్వేస్ సంస్థలో టీమ్ లీడర్‌గా పని చేస్తున్నాను. ఓ కేర్ హోమ్ సెంటర్‌లో మూడున్నరేళ్ల క్రితం మేమిద్దరం కలుసుకున్నాం. ఏడాదిన్నరగా బాగా క్లోజ్ అయ్యాం. మా పెళ్లి పట్ల ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి.
పాదాలు తాకినప్పుడు..
జాకబ్‌కు మన సంస్కృతి, సంప్రదాయాలపై కొంత అవగాహన ఉంది. అతడికి మలయాళ భాష కూడా వచ్చు. మేమిద్దరం ఇంగ్లాండ్‌లోనే అక్టోబర్ 17న పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మన ఆచారం ప్రకారం మరోసారి వివాహం చేసుకున్నాం. నేను అతడి పాదాలు తాకినప్పుడు అతడు కూడా నా కాళ్లకు నమస్కరించాడు. ఇది పరస్పర గౌరవాన్ని, ప్రేమను సూచిస్తుంది అని గాయత్రి చెప్పుకొచ్చింది.


