పాన్ ఇండియా హీరో ప్రభాస్ మూవీ షూటింగ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ మూవీ సెట్స్‌లో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మూవీలో భాగంగా కీలక సన్నివేశం కోసం గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రభాస్ కిందపడిపోయారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ఆయన చేతికి గాయమైందని సోషల్‌మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే, అభిమానులు కంగారుపడాల్సిన పనిలేదని గాయం చిన్నదేనని తెలుపుతున్నారు. ఈ విషయంపై సినిమా యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన ఇవ్వాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు.
‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 దసరాకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
‘‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూస్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్‌ఫుల్ పాత్రలో చూపించబోతున్నారు హను రాఘవపూడి. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలో విడుదల కానుంది.


