సింగర్‌గా హీరోయిన్ రాశీ ఖన్నా ‘జోరు, జవాన్, ప్రతిరోజూ పండగే’ వంటి సినిమాల్లో పాటలు పాడారు. తాజాగా ‘శివ్ కైలాశోం కే వాసి’ అనే భక్తి పాటను పాడారు రాశీ. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పాటను తన ఇన్‌స్టా ఖాతాలో ఆమె షేర్ చేయగా, వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా రాశీ మాట్లాడుతూ– ‘‘శివ్ కైలాశోం కే వాసి’ అనేది అహంకారాన్ని నాశనం చేయడం, అంతరంగాన్ని మేల్కొల్పడం, అతీంద్రియ శక్తి అయిన మహాదేవుడి మీద భక్తిని చాటే ప్రార్థనగా నిలుస్తుంది. ‘మహా శివరాత్రి’ అత్యంత పవిత్రమైన పర్వదినం. ఇలాంటి విశిష్టమైన రోజున పాడటం హ్యాపీగా ఉంది’’ అన్నారు.


