జన నాయగన్‌కు మరో షాక్‌.. ఆ రోజు వరకు వచ్చే ఛాన్సే లేదు | Vijay Jana nayagan will be released by this month | Sakshi
Sakshi News home page

జన నాయగన్‌కు మరో షాక్‌.. ఆ రోజు వరకు వచ్చే ఛాన్సే లేదు

Feb 16 2026 7:17 AM | Updated on Feb 16 2026 7:17 AM

Vijay Jana nayagan will be released by this month

విజయ్‌ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం జననాయగన్‌ చిత్రానికి ఎదురౌతున్న అవరోధాలు అన్నీ ఇన్నీ కావు. నటుడు విజయ్‌ చిత్ర షూటింగ్‌కు ముందే తన చిత్ర విడుదల సమయంలో ఆటకాలు ఎదురౌతాయని, వాటిని అధిగమించగలరా? అని ఏ ముహూర్తానా అన్నారో తెలీదు గానీ.. ఇప్పుడు అక్షరాలా అదే జరుగుతోంది. చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికెట్‌ కోసం గత డిసెంబర్‌ నెలలో సెన్సార్‌బోర్డుకు పంపారు. అయితే ఇప్పటి వరకూ సర్టిఫికెట్‌ రాలేదు. సెన్సార్‌ బోర్డుకు వ్యతిరేకంగా నిర్మాత చేసిన ప్రయత్రాలన్నీ సఫలం కాలేదు. చివరికి హైకోర్టు నుంచి పిటిషన్‌ను వాపస్‌ తీసుకున్నారు. అయితే సెన్సార్‌ ప్రత్యేక కమిటీకి పంపిన జననాయగన్‌ చిత్రానికి ఆ కమిటీ ఎప్పుడు సర్టిఫికెట్‌ ఇస్తుందో తెలియని పరిస్థితి.  

జనవరి 9న విడుదల కావలసిన ఈ చిత్రం ఫిబ్రవరి నెల సగభాగం గడిచిపోతున్నా, ఎప్పుడు తెరపైకి వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి. ఈ నెల 20న చిత్రం విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జననాయకన్‌ చిత్రం కెనడాలో విడుదలకు హక్కులు పొందిన యార్క్‌ సినిమాస్‌ సంస్థ అధినేత ఈ చిత్రం ఏప్రిల్‌ 30 వరకూ విడుదల అవ్వడానికి అవకాశం లేదని, అందుకే టిక్కెట్‌ బుక్కింగ్‌ డబ్బులను  రిఫండ్‌ చేసుకోండి అని పేర్కొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది. 

ఈ ఏడాది మే నెలలో శాసన సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అలాంటిది ఆ సమయంలో జననాయగన్‌ చిత్రాన్ని విడుదల చేయడం సాధ్యం అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.ఈ పరిస్ధితులు విజయ్‌ అభిమానులకు జీర్ణయింకుకోవడం కష్టమే అవుతుంది. ఇక జననాయకన్‌ చిత్ర నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement