మూడు ఓటీటీలలో యూత్‌ఫుల్ సినిమా స్ట్రీమింగ్‌ | Patang Movie Now Streaming Three OTT Platform | Sakshi
Sakshi News home page

మూడు ఓటీటీలలో యూత్‌ఫుల్ సినిమా స్ట్రీమింగ్‌

Feb 16 2026 9:42 AM | Updated on Feb 16 2026 9:56 AM

Patang Movie Now Streaming Three OTT Platform

యూత్‌ను బాగా ఆకట్టుకున్న చిత్రం పతంగ్‌.. ఇప్పుడు ఏకంగా 3 ఓటీటీలలో స్ట్రీమింగ్‌ అవుతుంది. వంశీ పూజిత్‌. ప్రణవ్‌ కౌశిక్‌, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది క్రిస్మస్‌ కానుకగా విడుదలైంది.  దర్శకుడు ప్రణీత్‌ ప్రత్తిపాటి తెరకెక్కించిన ఈ మూవీని డి.సురేశ్‌బాబు సమర్పణలో సురేశ్‌ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఇందులో గౌతమ్‌ మేనన్, ఎస్పీ చరణ్‌ కీలక పాత్రలు పోషించారు.

ట్రయాంగిల్ ప్రేమకథ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే,  'పతంగ్' మూవీని దర్శకుడు తెరకెక్కించిన తీరు బాగుంటుంది. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఏకంగా మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జనవరి 30న సన్ నెక్స్ట్ (SUN NXT)ఓటీటీలో విడుదలైన పతంగ్‌.. ప్రస్తుతం అమెజాన్‌(Amazon Prime), ఆహా(Aha) తెలుగు ఓటీటీలలో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది.

కథేంటి..?
హైదరాబాద్‌లోని ఓ బస్తీకి చెందిన విజయ్‌ కృష్ణ అలియాస్‌ విస్కీ(వంశీ పూజిత్‌), అదే ప్రాంతంలో ఉండే అరుణ్‌(ప్రణవ్‌ కౌశిక్‌) అనే డబ్బున్న కుర్రాడితో ఫ్రెండ్‌షిప్ చేస్తుంటాడు. చిన్ననాటి నుంచి వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క రోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలోకి  ఐశ్వర్య (ప్రీతి పగడాల) వస్తుంది. ఈమె ఏ విషయంలోనూ సొంతంగా, త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. తర్వాత అరుణ్‌ని ఇష్టపడుతుంది. దీంతో ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్ మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యని దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్‌ల పోటీ. మరి ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే మిగతా స్టోరీ.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement