breaking news
Patang Movie
-
ఆ పాత్ర కోసం సందీప్ రెడ్డి, నాగ్ అశ్విన్‌ని అడిగితే నో చెప్పారు: పతంగ్ డైరెక్టర్
ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల లీడ్ రోల్స్‌లో ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘పతంగ్’. డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలైంది. ఈ సందర్భంగా ప్రణీత్ పత్తిపాటి మాట్లాడుతూ–‘‘మా స్వస్థలం హైదరాబాద్. ఓ సంక్రాంతి పండగ రోజున పతంగుల పోటీ నేపథ్యంతో ఓ సినిమా తీయాలనే ఆలోచనతో ‘పతంగ్’ ఆరంభించాం. గాల్లో పతంగ్ ఎగరడం, దానికున్న మాంజాని మేము గ్రాఫిక్స్‌లోనే చూపించాం. క్వాలిటీ విషయంలో నిర్మాతలు రాజీ పడలేదు. మా మూవీకి థియేటర్స్‌లో మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు చేసిన పాత్రకు ‘దిల్ ’రాజు, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ , ఎస్జే సూర్య వంటి వారిని అనుకున్నాం. కానీ వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉండటం వల్ల ఒప్పుకోలేదు. ఇక సినిమాలో గౌతమ్ మీనన్ పాత్రనున గౌతమ్‌మీనన్ చేస్తే బాగుంటుందని అయన్ని ఆప్రోచ్ అయ్యాం. ఆయనపాత్ర కథ,విని ఒప్పుకున్నారు. ఆయన మీద పంచ్‌లు వేయడం కూడా బాగా నచ్చింది. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కాస్త కన్ఫ్యూజ్డ్గా కనిపిస్తుంది. చెప్పాలంటే అదీ నా క్యారెక్టరే. నేను కూడా చాలా కన్ఫ్యూజన్ తో ఉంటుంటాను. కానీ, పనిలో మాత్రం క్లారిటీతో ఉంటాను. డి.సురేష్ బాబుగారితో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. జనవరి 1న మా చిత్రం ఓవర్సీస్లో కూడా విడుదలవుతోంది’’ అన్నారు. -
చిన్న సినిమాకు టాలీవుడ్ హీరో సపోర్ట్.. ఉచితంగా టికెట్స్..!
ఇటీవల క్రిస్మస్ సందర్భంగా చిన్న సినిమాలన్నీ సందడి చేశాయి. శ్రీకాంత్ తనయుడి ఛాంపియన్, ఆది సాయికుమార్ శంబాల చిత్రాలపై కాస్తా బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. వీటితో బ్యాడ్ గాళ్స్, ఈషా, దండోరా లాంటి చిత్రాలొచ్చాయి. వీటి గురించి ప్రమోషన్స్ చేయడంఅయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మరో మూవీ పతంగ్. ఎలాంటి ప్రచారం చేయకపోయినా బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. కేవలం మౌత్ టాక్‌తోనే పతంగ్ దూసుకెళ్తోంది. ఈ సినిమాకు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మద్దతుగా నిలిచారు. ఈ మూవీ చూసే వారికోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. పతంగ్ చూసేందుకు తానే స్వయంగా 500 టిక్కెట్లను ఉచితంగా ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ ఆఫర్‌తో పతంగ్ చూసే అభిమానుల సంఖ్య మరింత పెరగనుంది. చిన్న సినిమా కోసం సందీప్ కిషన్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. Giving away 500 tickets for #Patang the film,with love for this Adorable/Passionate Team 🧿@PranavKaushikk @VPujit @Preethipagadal @praneethdirects Hearing Fab Things about the film..Please go check it out in Theatres now ♥️For tickets : pls contact @adithyamerugu pic.twitter.com/EbmBbRbAtI— Sundeep Kishan (@sundeepkishan) December 27, 2025 -
‘పతంగ్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: పతంగ్నటీనటులు: వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ఎస్పీబీ చరణ్, వడ్లమాని శ్రీనివాస్,విష్ణు ఓఐ, అను హసన్ తదితరులురచన, దర్శకత్వం: ప్రణీత్ ప్రత్తిపాటినిర్మాతలు: విజయ్ శేఖర్ అన్నె, సంపత్ మాకా, సురేష్ రెడ్డి కొత్తింటి, నాని బండ్రెడ్డిసంగీతం: జోస్ జిమ్మిసినిమాటోగ్రఫి: శక్తి అరవింద్ఎడిటర్: చాణక్య రెడ్డి తూర్పువిడుదల తేది: డిసెంబర్ 25, 2025ఈ ఏడాది చివరి వారంలో తెలుగులో ఛాంపియన్, శంబాల, దండోరాతో పాటు మొత్తం ఎనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిల్లో ఒకటి పతంగ్. ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ బాగున్నప్పటికీ నటీనటులంతా కొత్తవారే కావడం.. ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయకపోవడంతో సినిమాపై బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. దీంతో ఎలాంటి అంచనాలు లేకుండానే డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘పతంగ్’ కథేంటంటే.. హైదరాబాద్‌లోని ఓ బస్తీకి చెందిన విజయ్ కృష్ణ అలియాస్ విస్కీ(వంశీ పూజిత్), అదే ప్రాంతంలో ఉండే రిచ్ కిడ్ అరుణ్(ప్రణవ్ కౌశిక్) చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్క రోజు కూడా కలుసుకోకుండా ఉండలేరు. అలాంటి ప్రాణ స్నేహితుల జీవితంలోకి ఐశ్వర్య (ప్రీతి పగడాల) ప్రవేశిస్తుంది. ఆమెది కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్. ఏ విషయంలో అయినా సొంతంగా, త్వరగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటి అమ్మాయి మొదట విస్కీతో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత అరుణ్‌ని ఇష్టపడుతుంది. ఆమె వల్ల ప్రాణ స్నేహితులైన విస్కీ, అరుణ్‌ల మధ్య విబేధాలు వస్తాయి. ఐశ్వర్యను దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య పతంగ్‌ల పోటీ పెడతారు. ఇద్దరి మధ్య పతంగ్‌ల పోటీనే ఎందుకు పెట్టారు? ఈ పోటీలో ఎవరు గెలిచారు? చివరకు ఐశ్వర్య ఎవరికి దక్కింది? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. కొన్ని సినిమా కథలలో కొత్తదనం ఉండదు. అలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలే వచ్చి ఉంటాయి. అయినా కూడా తెరపై చూస్తుంటే ఎంజాయ్ చేస్తాం. అలాంటి సినిమానే పతంగ్. ఈ సినిమాలో చెప్పుకోవడానికి కథే ఉండదు. దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి ఎంచుకున్న ట్రయాంగిల్ లవ్‌స్టోరీ పాయింట్ కూడా చాలా రొటీన్. అయితే దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్‌గా, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆర్య, ప్రేమదేశం లాంటి ట్రైయాంగిల్ లవ్‌స్టోరీని హైదరాబాద్ స్టైల్లో చెబుతూ.. తనదైన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు దర్శకుడు ప్రణీత్. సన్నివేశాలు పాతవే అయితే.. డైలాగ్స్ ఫ్రెష్‌గా, యూత్‌ని ఆకట్టుకునేలా ఉంటాయి. అలా అని బూతు సంభాషణలు, సన్నివేశాలేవి ఇందులో ఉండవు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించారు.ఫస్టాఫ్ మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఐశ్వర్య-విస్కీల లవ్‌స్టోరీతో పాటు అరుణ్‌తో ఐశ్వర్య క్లోజ్ అయ్యేలా సాగే సన్నివేశాలన్నీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. అలా చూస్తుండగానే ఇంటర్వెల్ అవుతుంది. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కాస్త సాగదీతగా అనిపించినప్పటికీ.. పతంగ్‌ల పోటీ మొదలైన తర్వాత పరుగులు పెడుతుంది. సెకండాఫ్ కథ మొత్తం పతంగ్‌ల పోటీ చుట్టూనే తిరుగుతుంది. అయినా కూడా ఒక్క చోట బోర్ కొట్టదు. విష్ణు ఇచ్చే కామెంటరీ నవ్వుల డోస్‌ని మరింత పెంచేస్తుంది. ఇక ముగింపులో దర్శకుడు ఇచ్చిన సందేశం కూడా యువతను ఆలోచింపజేస్తుంది. మొత్తంగా కొత్త కథను ఆశించకుండా పతంగ్ సినిమాకు వెళ్తే మాత్రం రెండున్నర గంటల పాటు హాయిగా ఎంటర్టైన్ అవ్వొచ్చు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన నటీనటులంతా కొత్తవారే.అయినా కూడా చక్కగా నటించారు. హైదరాబాద్‌లోని బస్తీ యువకుడు విస్కీగా వంశీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రణవ్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రీతి పగడాల ఇందులో హీరోయిన్గా నటించింది.కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ ఉన్న ఐశ్వర్య పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. అరుణ్ చెల్లిగా నటించిన విజ్ఞాని తెరపై క్యూట్‌గా కనిపించింది. అరుణ్ తండ్రిగా నటించిన ఎస్పీ చరణ్.. ఎమోషనల్ సీన్లని బాగా పండించాడు. అరుణ్‌ని ఇష్టపడే లక్ష్మీ పాత్ర పోషించిన నటి కూడా బాగా చేసింది. ముఖ్యంగా పతంగ్‌లో పోటీలో ఆమె చేసిన డ్యాన్స్ నవ్వులు పూయిస్తుంది. అరుణ్-విస్కీల ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జోస్ జిమ్మీ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వెరైటీగా, ఆకట్టుకునేలా ఉంటాయి. బీజీఎం అదిరిపోయింది. శక్తి అరవింద్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. చిన్న సినిమానే అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
పతంగుల పోటీ నేపథ్యంలో సినిమా..అంత ఈజీ కాదు : ప్రణవ్ కౌశిక్
ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పతంగ్’. గౌతమ్ వాసుదేవ్ మీనన్ , ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి, రమ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ప్రణవ్ కౌశిక్ మాట్లాడుతూ–‘‘పతంగుల పోటీ నేపథ్యంతో సినిమా చేయడం అంత సులభం కాదు. మా ‘పతంగ్’లో వీఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం దర్శక–నిర్మాతలు, టెక్నికల్ టీమ్ చాలా కష్టపడ్డారు. ఈ క్రిస్మస్కి మా చిత్రంతో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలు హిట్ కావాలి. ఫైనల్‌గా సినిమా గెలవాలి’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని వంశీ పూజిత్, విజయ్ శేఖర్ అన్నే, సురేష్ కొత్తింటి, ప్రీతి పగడాల తెలి΄ారు. ‘‘ఈ సినిమా నిర్మాణంలో రోజూ ఓ కొత్త సవాల్ ఎదుర్కొన్నాం’’ అన్నారు రమ్య. ‘‘ఈ ఏడాది విడుదలయ్యే మంచి సినిమాల్లో ‘పతంగ్’ కూడా ఉంటుంది’’ అని పేర్కొన్నారు సంపత్ మకా, నాని బండ్రెడ్డి. -
‘పతంగ్’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
పతంగ్ సినిమాకి హిట్ కళ కనిపిస్తోంది
ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘పతంగ్’. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ– ‘‘ఇదొక కొత్త రకమైన సినిమా. ట్రైలర్ చూడగానే సూపర్ థ్రిల్ ఫీలయ్యాను. యూత్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాకు హిట్ కళ కనిపిస్తోంది’’ అన్నారు. వంశీ పూజిత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా పేరు విస్కి. పక్కా హైదరాబాదీగా మాస్ ΄ాత్ర చేశాను. తెలుగు సినిమా గర్వంగా ఫీలయ్యేలా ఈ ‘పతంగ్’ చిత్రం ఉంటుంది. నా పుట్టినరోజున ఈ సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘కంటెంట్ పరంగా పెద్ద సినిమా ఇది. పతంగుల పోటీ సన్నివేశాలను చాలా కష్టపడి తీశాం. నాకు అన్ని విధాలా సపోర్ట్ చేసిన మా అమ్మానాన్నకు హిట్ ఇవ్వబోతున్నాను’’ అన్నారు ప్రణవ్ కౌశిక్. ‘‘ఈ సినిమా ఆడియన్స్‌కు రియలిస్టిక్ సినిమాటిక్ ఫీల్‌ను ఇస్తుంది’’ అని చె΄్పారు సహ నిర్మాత రమ్య వేములపాటి. ఈ కార్యక్రమంలో రాహుల్ మోపిదేవి, ఆదినారాయణ, నాని బండ్రెడ్డి, సంపత్ మక తదితరులు పాల్గొన్నారు. -
కొత్త వారితో 'పతంగ్'.. ట్రైలర్ విడుదల
నూతన నటీనటులతో తెరకెక్కిన చిత్రం పతంగ్.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ఎస్పీ చరణ్‌లతో ముఖ్య తారలుగా ఇందులో నటించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్‌శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. -
‘పతంగ్’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)
-
పతంగుల పోటీ రెడీ
‘‘కొత్తవాళ్లంతా కలిసి ఎంతో రిచ్‌గా ‘పతంగ్’ సినిమా చేశారు. నాని బండ్రెడ్డి క్రియేటివిటీ ఉన్న వ్యక్తి. ఈ సినిమా కోసం ఎంతో ఖర్చు పెట్టి ఓ స్టేడియంలో పతంగుల పోటీ పెట్టి భారీగా పతాక సన్నివేశాలు తీశారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అని నిర్మాత సురేష్‌బాబు తెలిపారు. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ఎస్పీ చరణ్‌లతో ముఖ్య తారలుగా నూతన నటీనటులతో రూ పొందిన చిత్రం ‘పతంగ్’. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు.డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్‌శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. జోస్ జిమ్మి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘ఎమోషనల్ డ్రామా...’ అంటూ సాగే పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ పాటని సురేష్‌బాబు విడుదల చేశారు. నాని బండ్రెడ్డి మాట్లాడుతూ– ‘‘పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’’ అన్నారు. ‘‘ఎమోషనల్ డ్రామా..’ పాటలో శ్రీమణిగారి లిరిక్స్ ఆకట్టుకుంటాయి’’ అన్నారు ప్రణవ్ కౌశిక్. ‘‘మా సినిమాలోని పతంగుల పోటీ ప్రేక్షకుల్లో ఉత్సుకతను కలిగిస్తుంది’’ అని నిర్మాతలు తెలిపారు. -
‘పతంగ్’.. ఇదో కొత్తరకమైన స్పోర్ట్స్ డ్రామా
ఇప్పటి వరకు తెలుగు తెరపై చాలా స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి. కబడ్డి, ఖోఖో, వాలీబాల్, క్రికెట్..ఇలా పలు ఆటలకు సంబంధించిన సినిమాలను చూశాం. కానీ ఇప్పుడు ఓ కొత్తరమైన స్పోర్ట్స్ డ్రామాను చూడబోతున్నాం. పతంగులతో పోటీ పడే సినిమా రాబోతుంది. అదే ‘పతంగ్’. ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 27నప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన పాటలకు చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'ఈ సినిమా థియేటర్లో యూత్‌ఫెస్టివల్‌లా వుంటుంది. కొత్తవాళ్లతో చేసిన మా సినిమా కొత్తగా వుండటంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో వుంటుంది అన్నారు. ఈ సినిమాకు కథే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. పాట వింటూంటే అందరిలో పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. తప్పకుండా మా పతంగ్ చిత్రం అన్నివర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం ఉంది. కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. డిసెంబరు 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని తెలిపారు. -
Preethi Pagadala: పతంగ్ హీరోయిన్ ఎంత క్యూట్‌గా ఉందో! (ఫోటోలు)


