ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల లీడ్ రోల్స్‌లో ప్రణీత్ పత్తిపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘పతంగ్’. డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలైంది. ఈ సందర్భంగా ప్రణీత్ పత్తిపాటి మాట్లాడుతూ–‘‘మా స్వస్థలం హైదరాబాద్. ఓ సంక్రాంతి పండగ రోజున పతంగుల పోటీ నేపథ్యంతో ఓ సినిమా తీయాలనే ఆలోచనతో ‘పతంగ్’ ఆరంభించాం.
గాల్లో పతంగ్ ఎగరడం, దానికున్న మాంజాని మేము గ్రాఫిక్స్‌లోనే చూపించాం. క్వాలిటీ విషయంలో నిర్మాతలు రాజీ పడలేదు. మా మూవీకి థియేటర్స్‌లో మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు చేసిన పాత్రకు ‘దిల్ ’రాజు, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ , ఎస్‌జే సూర్య వంటి వారిని అనుకున్నాం. కానీ వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉండటం వల్ల ఒప్పుకోలేదు. ఇక సినిమాలో గౌతమ్ మీనన్ పాత్రనున గౌతమ్‌మీనన్ చేస్తే బాగుంటుందని అయన్ని ఆప్రోచ్ అయ్యాం. ఆయనపాత్ర కథ,విని ఒప్పుకున్నారు. ఆయన మీద పంచ్‌లు వేయడం కూడా బాగా నచ్చింది.
ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కాస్త కన్‌ఫ్యూజ్డ్‌గా కనిపిస్తుంది. చెప్పాలంటే అదీ నా క్యారెక్టరే. నేను కూడా చాలా కన్‌ఫ్యూజన్ తో ఉంటుంటాను. కానీ, పనిలో మాత్రం క్లారిటీతో ఉంటాను. డి.సురేష్ బాబుగారితో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. జనవరి 1న మా చిత్రం ఓవర్‌సీస్‌లో కూడా విడుదలవుతోంది’’ అన్నారు.


