చిన్న సినిమాకు టాలీవుడ్‌ హీరో సపోర్ట్.. ఉచితంగా టికెట్స్..! | Sundeep Kishan free tickets for latest tollywood movie Patang | Sakshi
Sakshi News home page

Sundeep Kishan : చిన్న సినిమాకు టాలీవుడ్‌ హీరో సపోర్ట్.. ఉచితంగా టికెట్స్..!

Dec 28 2025 10:36 AM | Updated on Dec 28 2025 10:55 AM

Sundeep Kishan free tickets for latest tollywood movie Patang

ఇటీవల క్రిస్‌మస్‌ సందర్భంగా చిన్న సినిమాలన్నీ సందడి చేశాయి. శ్రీకాంత్ తనయుడి ఛాంపియన్, ఆది సాయికుమార్ శంబాల చిత్రాలపై కాస్తా బజ్‌ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. వీటితో బ్యాడ్ గాళ్స్, ఈషా, దండోరా లాంటి చిత్రాలొచ్చాయి. వీటి గురించి ప్రమోషన్స్ చేయడం

అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మరో మూవీ పతంగ్. ఎలాంటి ప్రచారం చేయకపోయినా బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. కేవలం మౌత్‌ టాక్‌తోనే పతంగ్ దూసుకెళ్తోంది. ఈ సినిమాకు టాలీవుడ్‌ హీరో సందీప్ కిషన్‌ మద్దతుగా నిలిచారు. ఈ మూవీ చూసే వారికోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. పతంగ్ చూసేందుకు తానే స్వయంగా 500 టిక్కెట్లను ఉచితంగా ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ ఆఫర్‌తో పతంగ్ చూసే అభిమానుల సంఖ్య మరింత పెరగనుంది. చిన్న సినిమా కోసం సందీప్ కిషన్‌ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement