ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘పతంగ్’. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్‌పీ చరణ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది.
ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన దర్శకుడు దేవ కట్టా మాట్లాడుతూ– ‘‘ఇదొక కొత్త రకమైన సినిమా. ట్రైలర్ చూడగానే సూపర్ థ్రిల్ ఫీలయ్యాను. యూత్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాకు హిట్ కళ కనిపిస్తోంది’’ అన్నారు.
వంశీ పూజిత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా పేరు విస్కి. పక్కా హైదరాబాదీగా మాస్ ΄ాత్ర చేశాను. తెలుగు సినిమా గర్వంగా ఫీలయ్యేలా ఈ ‘పతంగ్’ చిత్రం ఉంటుంది. నా పుట్టినరోజున ఈ సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘కంటెంట్ పరంగా పెద్ద సినిమా ఇది. పతంగుల పోటీ సన్నివేశాలను చాలా కష్టపడి తీశాం. నాకు అన్ని విధాలా సపోర్ట్ చేసిన మా అమ్మానాన్నకు హిట్ ఇవ్వబోతున్నాను’’ అన్నారు ప్రణవ్ కౌశిక్. ‘‘ఈ సినిమా ఆడియన్స్‌కు రియలిస్టిక్ సినిమాటిక్ ఫీల్‌ను ఇస్తుంది’’ అని చె΄్పారు సహ నిర్మాత రమ్య వేములపాటి. ఈ కార్యక్రమంలో రాహుల్ మోపిదేవి, ఆదినారాయణ, నాని బండ్రెడ్డి, సంపత్ మక తదితరులు పాల్గొన్నారు.


