వయసు మీద పడుతుంటే ఒంట్లో శక్తి సన్నగిల్లుతుంది. అందులోనూ 80 దాటిందంటే అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మాత్రం 83 (తన వయసు) అనేది జస్ట్ నంబర్ మాత్రమేనని, తానింకే కుర్రవాడినేనంటున్నారు. ఆయన చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి.
కేబీసీ షో హోస్ట్‌గా..
అమితాబ్ సినిమాలతో పాటు కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) అనే షోను హోస్ట్ చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ షోని విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం కేబీసీ 17వ సీజన్ రన్ అవుతోంది. ఈ షోకి ఇటీవలే ద ఫ్యామిలీ మ్యాన్ టీమ్ మనోజ్ బాజ్‌పాయ్, జైదీప్ అహ్లావత్, షరీబ్ హష్మీ అతిథులుగా విచ్చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కేబీసీ అనుభవాలను పంచుకున్నాడు షరీబ్ హష్మీ.
అంతా కలలా ఉంది
ఆయన మాట్లాడుతూ.. అమితాబ్ (Amitabh Bachchan) గారిని కలిశానంటే ఇప్పటికీ అంతా ఒక కలలా ఉంది. ఆ అనుభవాన్ని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నా జర్నీ గురించి అడిగినప్పుడు ఆయన నాతోనే మాట్లాడారా? అని గాల్లో తేలిపోయాను. కానీ, ఆయన ఎనర్జీకి మాత్రం దండం పెట్టాల్సిందే! ఈ వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఒక్క రోజులోనే మూడు ఎపిసోడ్ షూటింగ్స్ పూర్తి చేస్తారు. పొద్దున తొమ్మిదికల్లా సెట్‌కు వస్తే అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటారు. మేము హాజరైన ఎపిసోడ్ షూటింగ్ అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది.
అలసట లేకుండా..
మేమందరం కాసేపైనా ఓ చిన్న కునుకు తీస్తే బాగుండు అన్నట్లుగా ఉన్నామా? ఆయన మాత్రం నిద్రను దరిచేరనీయకుండా యాక్టివ్‌గా ఉన్నారు. అందుకే ఆయన అంత సెద్ద సూపర్ హీరో అయ్యారు అని షరీబ్ (Sharib Hashmi) చెప్పుకొచ్చాడు. ఇటీవల అమితాబ్ సైతం ఓ బ్లాక్‌లో తాను ఉదయం ఐదున్నర గంటల వరకు పని చేసినట్లు తెలిపారు. ఇదంతా చూసిన అభిమానులు మీకున్న ఎనర్జీ, డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అని కామెంట్లు చేస్తున్నారు.


