శిరోద్కర్ సిస్టర్స్ ఇండస్ట్రీలో తామేంటో రుజువు చేసుకున్నారు. అక్క నమ్రత తెలుగులో హీరోయిన్‌గా రాణిస్తే.. చెల్లి శిల్ప బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా దుమ్ము లేపింది. కాకపోతే ఇద్దరూ పెళ్లయ్యాక సినిమాలను పట్టించుకోవడం మానేశారు. శిల్ప రీఎంట్రీకి సిగ్నల్ ఇస్తూ గతేడాది హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌లో పాల్గొంది. ఈ ఏడాది 'జటాధర' సినిమాతో పలకరించింది.
పర్ఫెక్ట్ బర్త్‌డే డిన్నర్
ఇదిలా ఉంటే శిల్ప- రంజిత్ దంపతుల కూతురు అనౌష్క ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను నటి ఆలస్యంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. "నా పర్ఫెక్ట్ కూతురికి పర్ఫెక్ట్ బర్త్‌డే డిన్నర్.. ఫ్యామిలీ, ఫుడ్, అంతులేని సంతోషం.." అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో అనౌష్క పెద్దమ్మాయిగా కనిపిస్తోంది. అందంలో తల్లికే కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది. ఈ ఫోటోల్లో శిల్ప భర్త రంజిత్ కూడా ఉన్నాడు.
ఎంత ఎదిగిపోయావో..
అనౌష్క పుట్టినరోజునాడు తను చిన్నప్పుడు దేశీ గర్ల్ పాటకు స్టెప్పేసిన ఓ డ్యాన్స్ వీడియోను సైతం షేర్ చేసింది. నా గారాలపట్టి అప్పుడే ఎంత పెద్దదైపోయింది. కాలం చాలా వేగంగా పరిగెడుతోంది. నువ్వు ఎన్ని బర్త్‌డేలు జరుపుకున్నా సరే నాకు మాత్రం ఎప్పుడూ చిన్న పాపవే! ఒక ధృడమైన అమ్మాయిగా నువ్వు ఎదిగిన తీరు చూస్తుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. నా ప్రపంచం, సంతోషం అన్నీ నువ్వే.. నమ్ముతావో, లేదో కానీ.. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి కూడా! నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా బంగారం. ఎల్లప్పుడూ నేను నీకు అండగా నిలబడతానని మాటిస్తున్నాను అని రాసుకొచ్చింది.


