breaking news
sharib hashmi
-
నాలుగుసార్లు క్యాన్సర్ ఆపరేషన్.. 'జేకే' భార్య గురించి తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు లాంటి మాటలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. దీంతో నటీనటులందరూ ఇంతేనేమో అనేది చాలామంది నెటిజన్ల అభిప్రాయం. కానీ తెరపైనే కాదు రియల్ లైఫ్‌లోనూ తాము ఫెర్ఫెక్ట్ అనేలా కొందరు యాక్టర్స్ ఉంటారు. అలాంటి నటుడే షరీబ్ హష్మీ. ఈ పేరు చెబితే మీకు తెలియకపోవచ్చు గానీ 'ద ఫ్యామిలీ మ్యాన్' జేకే అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. నటుడిగా మనల్ని ఎంతగానో నవ్వించే ఇతడి జీవితంలో షాకయ్యే కష్టాలున్నాయని మీలో ఎంతమందికి తెలుసు?షరీబ్ హష్మీది ముంబై. 2003లో నస్రీన్‌ని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకునే టైంలో ఓ టీవీ ఛానెల్లో పనిచేసేవాడు. నటుడిగా ఛాన్సుల కోసం ప్రయత్నించేవాడు. కొన్నాళ్లకు ఉద్యోగం విడిచిపెట్టి పూర్తిగా ఇండస్ట్రీపైనే దృష్టి పెట్టాడు. అప్పటికే ఓ కొడుకు కూడా పుట్టాడు. దీంతో నస్రీన్.. కుటుంబ బాధ్యతల్ని తీసుకుంది. తన డబ్బులు, బంగారంతో పాటు ఇంటిని కూడా తాకట్టు పెట్టి మరీ భర్తని ప్రోత్సాహించింది. అలా 2008లో 'స్లమ్ డాగ్ మిలియనీర్'లో చిన్న పాత్రలో నటించే అవకాశం షరీబ్కి వచ్చింది. తర్వాత అటు సినిమాలు, ఇటు సీరియల్స్ చేస్తూ కెరీర్ పరంగా బిజీ అయ్యాడు. సరిగ్గా ఇలాంటి టైంలో షాకిచ్చే వార్త. భార్యకు ఓరల్(నోటి) క్యాన్సర్ అనే విషయం తెలిసి షరీబ్ గుండె బద్దలైంది.ఏకంగా నాలుగు సర్జరీలు జరిగాయి. కీమో థెరపీ కూడా తీసుకోవాల్సి వచ్చింది. చికిత్స తీసుకున్న తర్వాత మనిషి ఎలా మారిపోతారనే విషయాన్ని డాక్టర్స్ చెబుతుంటే షరీబ్-నస్రీన్ గుండె ఆగినంత పనయ్యింది. అయినా సరే బలంగా నిలబడ్డారు. క్యాన్సర్‌ని జయించారు. అయితే క్యాన్సర్ కారణంగా సర్జరీలు చేసుకోవడంతో నస్రీన్ ముఖాకృతి పూర్తిగా మారిపోయింది. అయినా సరే భార్య వెన్నంటే షరీబ్ నిలబడ్డాడు. అలా 2022 తర్వాత నస్రీన్ పూర్తిగా క్యాన్సర్ నుంచి కోలుకుంది. ఇదంతా చూసిన నెటిజనం.. ఈ జంటని తెగ అభినందిస్తున్నారు. ఒకరికి ఒకరు తోడుగా నిలిచి విధినే గెలిచారు కదా అని మాట్లాడుకుంటున్నారు.షరీబ్ విషయానికొస్తే.. సినిమాలు, సీరియల్స్ చాలానే చేసినప్పటికీ 'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ఇతడికి ఎక్కడలేని గుర్తింపు తీసుకొచ్చింది. శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయ్)పక్కనే కనిపించే జేకే తల్పడే పాత్రలో షరీబ్ హష్మీ అదరగొట్టేశాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. యాక్టింగ్ సంగతి పక్కనబెడితే భార్యకు కష్టసుఖాల్లో తోడునీడలా నిలిచి రియల్ 'ఫ్యామిలీ మ్యాన్' అనిపించుకుంటున్నాడు. -
ఉదయం 9కల్లా సెట్లో.. అర్దరాత్రి వరకు షూటింగ్స్‌తోనే బిజీ!
వయసు మీద పడుతుంటే ఒంట్లో శక్తి సన్నగిల్లుతుంది. అందులోనూ 80 దాటిందంటే అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. కానీ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మాత్రం 83 (తన వయసు) అనేది జస్ట్ నంబర్ మాత్రమేనని, తానింకే కుర్రవాడినేనంటున్నారు. ఆయన చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి.కేబీసీ షో హోస్ట్‌గా..అమితాబ్ సినిమాలతో పాటు కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) అనే షోను హోస్ట్ చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ షోని విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం కేబీసీ 17వ సీజన్ రన్ అవుతోంది. ఈ షోకి ఇటీవలే ద ఫ్యామిలీ మ్యాన్ టీమ్ మనోజ్ బాజ్‌పాయ్, జైదీప్ అహ్లావత్, షరీబ్ హష్మీ అతిథులుగా విచ్చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కేబీసీ అనుభవాలను పంచుకున్నాడు షరీబ్ హష్మీ. అంతా కలలా ఉందిఆయన మాట్లాడుతూ.. అమితాబ్ (Amitabh Bachchan) గారిని కలిశానంటే ఇప్పటికీ అంతా ఒక కలలా ఉంది. ఆ అనుభవాన్ని నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నా జర్నీ గురించి అడిగినప్పుడు ఆయన నాతోనే మాట్లాడారా? అని గాల్లో తేలిపోయాను. కానీ, ఆయన ఎనర్జీకి మాత్రం దండం పెట్టాల్సిందే! ఈ వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఒక్క రోజులోనే మూడు ఎపిసోడ్ షూటింగ్స్ పూర్తి చేస్తారు. పొద్దున తొమ్మిదికల్లా సెట్‌కు వస్తే అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటారు. మేము హాజరైన ఎపిసోడ్ షూటింగ్ అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. అలసట లేకుండా..మేమందరం కాసేపైనా ఓ చిన్న కునుకు తీస్తే బాగుండు అన్నట్లుగా ఉన్నామా? ఆయన మాత్రం నిద్రను దరిచేరనీయకుండా యాక్టివ్‌గా ఉన్నారు. అందుకే ఆయన అంత సెద్ద సూపర్ హీరో అయ్యారు అని షరీబ్ (Sharib Hashmi) చెప్పుకొచ్చాడు. ఇటీవల అమితాబ్ సైతం ఓ బ్లాక్‌లో తాను ఉదయం ఐదున్నర గంటల వరకు పని చేసినట్లు తెలిపారు. ఇదంతా చూసిన అభిమానులు మీకున్న ఎనర్జీ, డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కాంతార హీరోయిన్‌కు బాలీవుడ్లో ఆఫర్ -
జై జై కత్రినా... జయహో కత్రినా!
దేవుళ్లు, దేవతలకు హారతి పాటలుంటాయి. ఎవరినైనా ఎక్కువగా అభిమానిస్తే వాళ్లకి కూడా ఇలాంటి పాటలు రాస్తుంటారు కొంతమంది. ముఖ్యంగా సినిమా తారలకు. బాలీవుడ్ నటుడు, రచయిత షరీబ్ హష్మి ఇప్పటివరకు ఇలాంటి పాటలు చాలానే రాశారు. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితర తారలపై ఈయనగారు హారతి పాటలు రాశారు. తాజాగా, కత్రినా కైఫ్‌పై కూడా ఓ పాట రాశారు. ‘జై జై కత్రినా.. ఓ జీ జయహో కత్రినా..’ అనే పల్లవితో ఈ పాట సాగుతుంది. షరీబ్ హష్మి నటించిన ‘ఫిల్మిస్తాన్’ అనే సినిమా ప్రచారంలో భాగంగా ఈ పాటను ఉపయోగించనున్నారు. ఇందులో సినిమా తారలను అభిమానించే వ్యక్తిగా షరీబ్ నటించారు. కత్రినా కైఫ్‌ని ఆరాధిస్తూ సినిమాలో ఓ పాట పాడతారు. స్వతహాగా రచయిత కావడంతో ఈ పాటను తనే రాశారు. దీన్ని ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేశారు. కత్రినా కైఫ్ ఈ పాట వింటే బాగుంటుందని భావించిన చిత్ర దర్శకుడు నితిన్ కక్కడ్ ఇటీవల ఆమెను కలిశారు. కానీ, ఈ పాటను వినడానికి కత్రినా తిరస్కరించారు. అది అహంభావం వల్ల కాదు.. బిడియంతో. తనని పొగిడే పాటను వినడానికి ఇబ్బందిపడటం వల్లే కత్రినా నిరాకరించారట. ఈ సందర్భంగా షరీబ్ మాట్లాడుతూ -‘‘సినిమాను ఓ మతంలా భావించే దేశం మనది. దాదాపు అందరికీ నచ్చే మతం ఇది. హిందీ సినిమాకి నేను వీరాభిమానిని. తారలను అభిమానులు దేవునితో పోలుస్తారు. నాకు కూడా తారలంటే చాలా అభిమానం. అందుకే ఇలా హారతి పాటలు రాస్తుంటా’’ అన్నారు.


