డార్లింగ్ ప్రభాస్ ఫుల్ స్పీడుమీదున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన హారర్ మూవీ ది రాజాసాబ్. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నుంచి ఇటీవలే రెబల్ సాబ్ పాట రిలీజైంది. రెబల్ స్టార్ పేరుపై వచ్చిన సాంగ్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
సెకండ్ సాంగ్ ప్రోమో
తాజాగా రాజాసాబ్ నుంచి సెకండ్ సాంగ్ 'సహానా సహానా' ప్రోమో వదిలారు. 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ పాటలో ప్రభాస్.. నిధితో స్టెప్పులేశాడు. తమన్ సంగీతం అందించాడు. సహానా సహానా ఫుల్ సాంగ్ డిసెంబర్ 17న సాయంత్రం 6.35 గంటలకు విడుదల కానున్నట్లు వెల్లడించారు. తొలిసారి హారర్ జానర్‌లో ప్రభాస్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కన్నా ముందే అంటే జనవరి 9న విడుదల కానుంది.
It all begins with the #SahanaSahana PROMO setting the mood in pure soothing vibes ❤️🔥❤️🔥
Video Song arrives on Dec 17th at 6:35 PM 💥💥
A @MusicThaman musical vibe 🎧#TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas @AgerwalNidhhi @peoplemediafcy pic.twitter.com/mM4hiaj8QX— Director Maruthi (@DirectorMaruthi) December 14, 2025


