బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తన ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని వెల్లడించాడు. ప్రియురాలు గాబ్రియెల్లా డెమట్రాయిడ్స్‌తో తన నిశ్చితార్థం జరిగిందని తెలిపాడు. ఈ విషయాన్ని రియా చక్రవర్తి చాప్టర్ 2 అనే పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. ఈ పాడ్‌కాస్ట్‌కు అర్జున్ ప్రేయసి గాబ్రియెల్లాతో కలిసి హాజరయ్యాడు. మాకింకా పెళ్లి కాలేదు.
ఆరేళ్లుగా డేటింగ్
అదెప్పుడు జరుగుతుందో ఎవరికి తెలుసు? అని గాబ్రియెల్లా అంది. అందుకు అర్జున్ వెంటనే.. కాకపోతే మా నిశ్చితార్థం మాత్రం జరిగిపోయింది అన్నాడు. అలా నిశ్చితార్థం విషయాన్ని తొలిసారి బయటపెట్టారు. అంటే ఆరేళ్లుగా డేటింగ్ చేసుకుంటున్న వీరు ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారన్నమాట!!
మొదటి పెళ్లి
కాగా అర్జున్ రాంపాల్.. 1998లో నిర్మాత మెహర్ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2018 మేలో భార్యాభర్తలు విడిపోతున్నట్లు ప్రకటించారు. మరుసటి ఏడాది విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది నటి గాబ్రియెల్లాతో ప్రేమలో పడటంతో పాటు ఆమెను గర్భవతిని చేశాడు అర్జున్. అలా పెళ్లికి ముందే వీరు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం.
ఎవరీ గాబ్రియెల్లా?
గాబ్రియెల్లా 16 ఏళ్లకే మోడలింగ్ చేసింది. పలు మ్యూజిక్ వీడియోల్లో నటించింది. ఇష్క్ ఝమేలా అనే హిందీ మూవీలో అర్జున్-గాబ్రియెల్లా కలిసి నటించారు. తెలుగులో ఊపిరి మూవీలో ఫ్రెంచ్ డ్యాన్సర్‌గా గాబ్రియెల్లా అలరించింది. ఇక అర్జున్ రాంపాల్ విషయానికి వస్తే.. ఆంఖేన్, డాన్, ఓం శాంతి ఓం, ఈఎమ్‌ఐ, హౌస్‌ఫుల్, రాజ్‌నీతి, చక్రవ్యూహ్, సత్యాగ్రహ, ధాకడ్, ధురంధర్ వంటి పలు హిందీ సినిమాలు చేశాడు. తెలుగులో భగవంత్ కేసరి చిత్రంలో నటించాడు.


