పెళ్లి భోజనాలనగానే కొందరు పండగ చేసుకుంటారు. నచ్చిన వంటకాలను కడుపునిండా ఆరగించవచ్చని ఉబలాటపడతారు. మరికొందరు మాత్రం అంతమందిలో లైను కట్టి మరీ తినడానికి మొహమాటపడతారు. తనకు ఆ మొహమాటం కాస్త ఎక్కువేనంటున్నాడు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్.
నాకంత ఓపిక లేదు
కృతి కర్బందా, పులకిత్ సామ్రాట్ హోస్ట్ చేస్తున్న 'ద మాన్యావర్ షాదీ' షోకి తాజాగా కరణ్ జోహార్ హాజరయ్యాడు. కృతి, పులకిత్ పెళ్లి విందు గురించి మాట్లాడారు. ఎంతమంది జనాలున్నా సరే అందరూ తమ వంతు వచ్చేవరకు ఓపికగా నిల్చుకుని భోజనం చేస్తారని పేర్కొన్నారు. ఇంతలో కరణ్ కలగజేసుకుటూ తనకు మాత్రం అంత ఓర్పు, సహనం లేదన్నాడు.
భోజనం చేయకుండా వచ్చేస్తా!
పెళ్లిలో నేనెప్పుడూ భోజనం చేయలేదు. భోజనం దగ్గర పెద్ద పెద్ద లైన్లుంటాయి. ఆహారం కోసం ప్లేటు పట్టుకుని అంత పెద్ద క్యూలో నిల్చోవాలంటే నాకు ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే పెళ్లిళ్లకు వెళ్తాను.. కానీ అక్కడ భోజనం చేయకుండానే వెనుదిరుగుతాను అని పేర్కొన్నాడు. అతడి సమాధానం విని కృతి అవాక్కయింది.
సినిమా
ఇకపోతే కరణ్ నిర్మించిన తాజా చిత్రం "తూ మేరీ మే తేరా -మే తేరా తు మేరీ". సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. వీళ్లిద్దరూ గతంలో 'పతీ పత్నీ ఔర్ వో' సినిమాలో తొలిసారి జోడీ కట్టారు. ఇప్పుడు రెండోసారి జత కట్టిన ఈ చిత్రం క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.
చదవండి: మౌగ్లీ ఫస్ట్ డే కలెక్షన్స్


