రోషన్ కనకాల మౌగ్లీ.. తొలి రోజే ఎన్ని కోట్లు వచ్చాయంటే? | Roshan Kanakala Mowgli Movie First Day Box Office Collections Crossed Rs 1 Crore, Check Out Details | Sakshi
Sakshi News home page

Mowgli First Day Collections: రోషన్ కనకాల మౌగ్లీ.. తొలి రోజే ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Dec 14 2025 1:11 PM | Updated on Dec 14 2025 3:16 PM

Roshan Kanakala Movie Mowgli First Day Collections

రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్‌ జంటగా వచ్చిన తాజా చిత్రం మోగ్లీ 2025. సందీప్ రాజ్ డైరెక్షన్‌లో వచ్చిన డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజే నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంటోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.

తొలి రోజే మౌగ్లీ కలెక్షన్ల పరంగా అదరగొట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.1.22 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ప్రీమియర్స్‌తో కలిసి ఈ మొత్తం కలెక్షన్స్ సాధించిందని తెలిపింది. వైల్డ్ బ్లాక్‌బస్టర్‌ అంటూ పోస్టర్‌ను షేర్ చేసింది.

అయితే మౌగ్లీ ముందు అనుకున్న ప్రకారం ఈనెల 12నే థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా బాలయ్య నటించిన అఖండ-2 బాక్సాఫీస్ బరిలో నిలిచింది. దీంతో ఒక్క రోజు ఆలస్యంగా మోగ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈనెల 13న థియేటర్లలో రిలీజైంది. కాగా.. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement