అనీశ్, అనస్వర రాజన్ జంటగా నటిస్తోన్న చిత్రం ఇట్లు అర్జున. ఈ మూవీతో అనీశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మొదటి సినిమాగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో రూపొందించారు. నాగార్జున చేతుల మీదుగా రిలీజైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తే భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు.
Loved doing the voice over for this love story!!
To everyone who loved, But never said "I love you" ♥️
Introducing #Aniesh as #NewGuyInTown in @WhatNextEnts’ Production No.1 - #ItlluArjuna ✨
God bless🙏
Discover the #SoulOfArjuna 💕
🔗 https://t.co/E1KSWtAZOy@NewGuyInTown06…— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 14, 2025


