రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్‌! | Selvaraghavan Second Divorce With Gitanjali Rumours Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Selvaraghavan: దర్శకుడి ఫోటోలు డిలీట్‌ చేసిన భార్య.. అదే కారణమా?

Dec 14 2025 1:36 PM | Updated on Dec 14 2025 3:52 PM

Buzz: Selvaraghavan, Gitanjali are Part Away

తమిళ దర్శకుడు సెల్వరాఘవన్‌ రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాడంటూ కోలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది. అందుకు కారణం లేకపోలేదు. భార్య, దర్శకురాలు గీతాంజలి.. తన సోషల్‌ మీడియా ఖాతాలో భర్తతో దిగిన ఫోటోలను డిలీట్‌ చేసింది. పెళ్లయిన దాదాపు 14 ఏళ్లకు ఇలా ఫోటోలన్నీ సడన్‌గా తీసేయడంతో వీళ్ల మధ్య గొడవలు తలెత్తాయని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అసలే ఈ కాలంలో విడాకులు తీసుకునేముందు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకుని ఇలా ఫోటోలు డిలీట్‌ చేసుకుంటున్నారు. దీంతో ఈ జంట కూడా విడిపోయిందేమోనని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ప్రచారంపై గీతాంజలి, సెల్వరాఘవన్‌.. ఎవరో ఒకరు స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

రెండు పెళ్లిళ్లు
సెల్వరాఘవన్‌ (Selvaraghavan).. కాదల్‌ కొండేన్‌ అనే తమిళ చిత్రంతో వెండితెరపై దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించాడు. ఇందులో సెల్వ తమ్ముడు ధనుష్‌ హీరోగా నటించాడు. సోనియా అగర్వాల్‌ను హీరోయిన్‌గా బిగ్‌స్క్రీన్‌కు పరిచయం చేశారు. సెల్వ నెక్స్ట్‌ మూవీ 7/G రెయిన్‌బో కాలనీ (7/G బృందావనం) మూవీలోనూ సోనియానే హీరోయిన్‌! ధనుష్‌- సోనియాను జంటగా పెట్టి మూడో సినిమా తీశాడు. ఈ మధ్యకాలంలో సోనియాతో సాన్నిహిత్యం ప్రేమగా మారడంతో 2006లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

కానీ భార్యాభర్తలుగా ఎంతోకాలం కలిసుండలేకపోయారు. 2010లో సెల్వ- సోనియా విడాకులు తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది సెల్వ.. దర్శకురాలు గీతాంజలి (Gitanjali Raman)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. 14 ఏళ్లుగా ఎంతో బాగా కలిసున్న ఈ దంపతులు ఇప్పుడిలా విడిపోతున్నారన్న వార్త అభిమానులను కలిచివేస్తోంది. అటు సెల్వ తమ్ముడు ధనుష్‌ కూడా ఐశ్వర్య రజనీకాంత్‌తో విడాకులు తీసుకోవడం గమనార్హం!

చదవండి: మ్యాచ్‌ చూసేందుకు వచ్చి మెస్సీ అంటే ఇష్టం లేదన్న అర్హ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement