‘పతంగ్‌’.. ఇదో కొత్తరకమైన స్పోర్ట్స్‌ డ్రామా | Patang Movie Release Date Ott | Sakshi
Sakshi News home page

‘పతంగ్‌’.. ఇదో కొత్తరకమైన స్పోర్ట్స్‌ డ్రామా

Oct 15 2024 5:41 PM | Updated on Oct 15 2024 7:04 PM

Patang Movie Release Date Ott

ఇప్పటి వరకు తెలుగు తెరపై చాలా స్పోర్ట్స్‌ డ్రామాలు వచ్చాయి. కబడ్డి, ఖోఖో, వాలీబాల్‌, క్రికెట్‌..ఇలా పలు ఆటలకు సంబంధించిన సినిమాలను చూశాం. కానీ ఇప్పుడు ఓ కొత్తరమైన స్పోర్ట్స్‌ డ్రామాను చూడబోతున్నాం. పతంగులతో పోటీ పడే సినిమా రాబోతుంది. అదే ‘పతంగ్‌’. ఇన్‌స్టాగ్రామ్‌ సెన్సేషన్‌ ప్రీతి పగడాల, జీ స‌రిగ‌మ‌ప ర‌న్న‌ర‌ప్ ప్ర‌ణ‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ​ పూజిత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి  ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి ద‌ర్శ‌కత్వం వహిస్తున్నాడు. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిష‌న్ సినిమాస్ ప‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మ‌క, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 27నప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన పాటలకు  చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్‌. డిసెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'ఈ సినిమా థియేటర్‌లో యూత్‌ఫెస్టివల్‌లా వుంటుంది. కొత్త‌వాళ్ల‌తో చేసిన మా  సినిమా కొత్త‌గా వుండ‌టంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో వుంటుంది అన్నారు. ఈ సినిమాకు క‌థే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుత‌మైన పాట‌లు ఇచ్చాడు. పాట వింటూంటే అంద‌రిలో పాజిటివ్ వైబ్స్ క‌లుగుతాయి. త‌ప్ప‌కుండా మా ప‌తంగ్ చిత్రం అన్నివ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. డిసెంబరు 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement