ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పతంగ్’. గౌతమ్ వాసుదేవ్ మీనన్ , ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో డి. సురేష్‌బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి, రమ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రణవ్ కౌశిక్ మాట్లాడుతూ–‘‘పతంగుల పోటీ నేపథ్యంతో సినిమా చేయడం అంత సులభం కాదు. మా ‘పతంగ్’లో వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ కోసం దర్శక–నిర్మాతలు, టెక్నికల్ టీమ్ చాలా కష్టపడ్డారు. ఈ క్రిస్మస్‌కి మా చిత్రంతో పాటు విడుదలవుతున్న అన్ని సినిమాలు హిట్ కావాలి. ఫైనల్‌గా సినిమా గెలవాలి’’ అన్నారు.
‘‘మా సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని వంశీ పూజిత్, విజయ్ శేఖర్ అన్నే, సురేష్ కొత్తింటి, ప్రీతి పగడాల తెలి΄ారు. ‘‘ఈ సినిమా నిర్మాణంలో రోజూ ఓ కొత్త సవాల్ ఎదుర్కొన్నాం’’ అన్నారు రమ్య. ‘‘ఈ ఏడాది విడుదలయ్యే మంచి సినిమాల్లో ‘పతంగ్’ కూడా ఉంటుంది’’ అని పేర్కొన్నారు సంపత్ మకా, నాని బండ్రెడ్డి.


