హీరోగా సినిమాలు ఫ్లాప్‌.. కౌంటరిచ్చిన తరుణ్‌ భాస్కర్‌ | Tharun Bhascker Dasyam About his Movies no Doing well at Box Office | Sakshi
Sakshi News home page

Tharun Bhascker: నా సినిమాలు ఫ్లాప్‌ అవాలా? సక్సెస్‌ వచ్చేవరకు ట్రై చేస్తా!

Feb 9 2026 4:28 PM | Updated on Feb 9 2026 4:43 PM

Tharun Bhascker Dasyam About his Movies no Doing well at Box Office

ఈ నగరానికి ఏమైంది?, పెళ్లి చూపులు సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు తరుణ్‌ భాస్కర్‌. మీకు మాత్రమే చెప్తా మూవీతో హీరోగా మారాడు. ఇటీవల ఈయన హీరోగా నటించిన చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. మలయాళ హిట్‌ సినిమా జయజయజయహేకి ఇది రీమేక్‌గా తెరకెక్కింది. తెలుగమ్మాయి ఈషా రెబ్బా కథానాయికగా నటించింది. థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.

గాయపడ్డ సింహం
తాజాగా తరుణ్‌ భాస్కర్‌ గాయపడ్డ సింహంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. కశ్యప్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని కల్యాణ్‌ చక్రవర్తి, భానుకిరణ్‌, విజయ్‌ కృష్ణ, ఉమేశ్‌ కుమార్‌ నిర్మించారు. సోమవారం ఈ మూవీ ట్రైజర్‌ రిలీజ్‌ చేశారు. టీజర్‌, ట్రైలర్‌ను మిక్స్‌ చేస్తే వచ్చిన పదమే ట్రైజర్‌. ఈ ట్రైజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో తరుణ్‌పై కొన్ని కామెంట్స్‌ వచ్చాయి.

హీరోగా సక్సెస్‌ లేదు
ఓ రిపోర్టర్‌ మాట్లాడుతూ.. తరుణ్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు కొన్ని నిరాశపర్చాయి. ఆయన ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నాడు కానీ బాక్సాఫీస్‌ మనసులు గెల్చుకోలేదు అన్నాడు. దానికి వెంటనే తరుణ్‌ భాస్కర్‌ స్పందిస్తూ.. సర్‌, మీరు ఓ కథ రాసి నిర్మించండి, మనం దాన్ని హిట్టు కొడదాం.

ఫెయిలైతే..
అయినా నేను ఫెయిలవ్వాలని మీరు ఎందుకని అంతలా కోరుకుంటున్నారు అని సెటైర్‌ వేశాడు. జీవితంలో ఒక్కసారి ఫెయిలైనందుకు ప్రయత్నం ఆపొద్దు. మళ్లీ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎంతమంది ఇలాంటి ప్రశ్నలడిగినా సరే మళ్లీ ట్రై చేస్తా, సక్సెస్‌ వచ్చేవరకు ప్రయత్నిస్తా అనాలి. ఆ ప్రయత్నంలోనే మమీ విజయం దాగి ఉంది. మిగతాదంతా మర్చిపోండి అని యూత్‌కి సలహా ఇచ్చాడు తరుణ్‌ భాస్కర్‌.

చదవండి: స్పిరిట్‌ నుంచి ఎగ్జిట్‌.. స్పందించిన ప్రకాశ్‌ రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement