తమిళ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ కొత్త సినిమాను లాక్ చేసే పనిలో ఉన్నాడు. గతేడాదిలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బైసన్‌తో భారీ బ్లాక్ బస్టర్ సాధించాడు. అయితే, ఈసారి డైరెక్ట్‌గా తెలుగు సినిమా చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మణిరత్నంతో ఒక లవ్‌స్టోరీ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అందమైన ప్రేమకథకి హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ని ఎంపిక చేసినట్లు వైరల్ అయింది.

అయితే, ఈ ప్రాజెక్టుకు నూతన దర్శకుడు దీపక్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. అతను తన షార్ట్ ఫిల్మ్ 'మనసానమః' తో ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ధ్రువ్‌తో సినిమా ఛాన్స్ దక్కినట్లు సమాచారం. ఈ చిత్రం ఒక రొమాంటిక్-కామ్ ఎంటర్టైనర్ అని, ఇందులో రుక్మిణీ వసంత్‌తో పాటు శ్రీలీల మరో మహిళా కథానాయికగా నటించనుందని చెబుతున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ధ్రువ్ విక్రమ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనుంది. ఈ చిత్రానికి మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ సాయి అబ్యాంకర్ సంగీతం అందిస్తున్నట్లు చెబుతున్నారు. అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఈ వార్త వైరల్ అవుతోంది.


