ప్రియంకా చోప్రా భారత్‌కు గర్వకారణం: శశి థరూర్ | Shashi Tharoor Meets Priyanka Chopra Backstage At Harvard's India Conference Event 2026, Photos Viral On Social Media | Sakshi
Sakshi News home page

ప్రియంకా చోప్రా భారత్‌కు గర్వకారణం: శశి థరూర్

Feb 16 2026 11:17 AM | Updated on Feb 16 2026 1:10 PM

Tharoor meets Priyanka Chopra backstage at Harvard event

కేంబ్రిడ్జి: అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ‘ఇండియా కాన్ఫరెన్స్ 2026’ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ బ్యాక్‌స్టేజ్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రియాంక చోప్రాతో దిగిన ఫోటోలను ‘ఎక్స్‌’వేదికగా షేర్‌ చేస్తూ, ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘భారతీయులు అరుదుగా కనిపించే అంతర్జాతీయ వేదికలపై, దేశం గర్వపడేలా ప్రియాంక రాణిస్తోంది. ఆమె అద్భుతంగా కనిపిస్తోంది. ఎంతో హుందాగా, విజ్ఞతతో మాట్లాడుతోంది. ఇంతకంటే గర్వకారణం ఇంకేముంటుంది?’ అని థరూర్ తన ట్వీట్‌లో‌ రాశారు.
 

హార్వర్డ్ వేదికగా జరిగిన ఈ సదస్సులో ‘మనం ఊహించే భారతదేశం’ (The India We Imagine) అనే ఇతివృత్తంపై చర్చలు సాగాయి. గ్లోబల్ అఫైర్స్ నిపుణురాలు మహిమా కౌల్‌తో పాటు యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ హోదాలో ప్రియాంక చోప్రా కూడా ఈ వేదికపై ప్రసంగించారు. భారతదేశానికి  అంతర్జాతీయంగా వస్తున్న ఖ్యాతి, భవిష్యత్ అవకాశాలపై ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో శశి థరూర్ కుమారుడు ఈశాన్ థరూర్, కోడలు భూమి థరూర్ కూడా పాల్గొనడం విశేషం. యువతలో దేశంపై ఉన్న ఆసక్తి, భవిష్యత్తుపై ఉన్న తపన తనను ఎంతగానో ప్రభావితం చేశాయని థరూర్ పేర్కొన్నారు. నెటిజన్లు థరూర్ వ్యాఖ్యలకు రకరకాల మీమ్స్‌తో స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కారు మీద కూలిన భారీ కరెంట్‌ స్తంభం.. ఎస్‌పీ నేత మృతి

Advertisement
 
Advertisement
Advertisement