సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇవాళ పార్టీ సమావేశం జరగనుంది. ఏలూరు నియోజకవర్గ కేడర్‌తో బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశానికి కీలక నేతలు కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించి కేడర్‌కు దిశానిర్దేశం చేస్తారని వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటనలో తెలిపింది.


