ఆర్య వైశ్యులపై వేధింపులను వెంటనే ఆపాలి: సజ్జల | Ysrcp Leader Sajjala Ramakrishna Reddy Meeting With Arya Vaishyas | Sakshi
Sakshi News home page

ఆర్య వైశ్యులపై వేధింపులను వెంటనే ఆపాలి: సజ్జల

Feb 13 2026 10:25 PM | Updated on Feb 13 2026 10:25 PM

Ysrcp Leader Sajjala Ramakrishna Reddy Meeting With Arya Vaishyas

సాక్షి, తాడేపల్లి: ఆర్యవైశ్యులతో వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఆర్య వైశ్యుల సమస్యలపై చర్చించారు. ఆర్యవైశ్యులపై జరుగుతున్న వేధింపులను వెంటనే ఆపాలన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులపై వివక్ష బాగా పెరిగిందని సజ్జల అన్నారు.

ఆర్యవైశ్యులను లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగం వేధింపులకు పాల్పడుతోందని.. చిన్న, మధ్య తరహా వ్యాపారులపై అకారణంగా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన వ్యాపార రంగానికి ప్రభుత్వం నుంచి భరోసా లేదన్న సజ్జల.. వైఎస్‌ జగన్ హయాంలో ఆర్యవైశ్యులకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement