breaking news
vaishya community
-
మళ్లీ మంచి రోజులు వస్తాయి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మళ్లీ మంచి రోజులు వస్తాయని.. త్వరలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్య వైశ్యులు అత్యంత సున్నిత మనస్కులు.. ఘర్షణ లేని వాతావరణం కోరుకునేవారిలో ఆర్యవైశ్యులు ముందుంటారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.‘‘ఇప్పుడు ఏపీలో ప్రశాంత వాతావరణం లేనే లేదు. కూటమి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉన్నదంతా అరాచకమే. తమ పార్టీ కాని వారందరినీ వేధించి.. వైఎస్సార్సీపీ ముద్ర వేస్తున్నారు. ప్రజల పక్షాన బలంగా ప్రశ్నించేది వైఎస్సార్సీపీ మాత్రమే. వైఎస్సార్సీపీ 10 వేల మంది ఆర్యవైశ్యులు ఉన్నారు. మహిళలు కూడా రాజకీయంగా బయటికి వస్తున్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి కూడా వైఎస్ జగన్ అండగా నిలిచారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘ఒకప్పుడు ప్రభుత్వ బడులకు వెళ్లడం నామోషీగా భావించేవారు. ప్రభుత్వ బడులకు వెళ్లడం గొప్పగా భావించేలా చేసిన ఘనత జగన్‌కు దక్కింది. స్కూల్ బ్యాగ్ నుంచి ప్రతి అంశంలోనూ జగన్ కేర్ తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో అకడమిక్ ప్రారంభమైనప్పటికీ స్కూల్ బుక్స్, బ్యాగ్‌ల ఊసే లేదు. రాష్ట్ర ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని వైఎస్ జగన్ చూశారు. చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాడు’’ అంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.సొమ్ము ఆర్యవైశ్యులది.. సోకు మాత్రం చంద్రబాబు, పవన్దిమాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘వాసవీమాత ఆలయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండొద్దని జీవో తెచ్చిన ఘనత వైఎస్సార్ , రోశయ్యలదే. ఆర్యవైశ్యులకు సంబంధించి కొన్ని ట్రస్ట్‌లు ఉన్నాయి. ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉన్న ఆర్యవైశ్యుల ట్రస్ట్‌లపై వైఎస్ జగన్ ఆర్యవైశ్యులకే హక్కులు కల్పించారు. ఎండోమెంట్ పరిధి నుంచి తప్పించి దుర్వినియోగం కాకుండా జీవో ఇచ్చారు. వైఎస్ జగన్ చేసినంత మేలు ఆర్యవైశ్యులకు మరెవరూ చేయలేదు. ఎండోమెంట్ పరిధిలో ఉన్న ఆర్య వైశ్యుల ట్రస్ట్‌లపై ఆర్య వైశ్యులకే వైఎస్ జగన్ హక్కులు కల్పించారు...గతంలో రాష్ట్రంలో ఉన్న ఆర్య వైశ్యులంతా ఆలయాల్లో దర్శనాలకు వెళ్లేవారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాల్లో ఆర్య వైశ్యులకు అవకాశం లేకుండా చేశారు. అమరావతిలో వృధాగా పడి ఉన్న స్థలంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంపై ఆర్యవైశ్యులకు ఎలాంటి హక్కు లేదంటున్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టడానికి డబ్బులిచ్చింది ఆర్య వైశ్య సంఘం. సొమ్ము ఆర్యవైశ్యులది సోకు మాత్రం చంద్రబాబు, పవన్‌ది’’ అంటూ వెలంపల్లి దుయ్యబట్టారు. -
ఆర్య వైశ్యులపై వేధింపులను వెంటనే ఆపాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఆర్యవైశ్యులతో వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఆర్య వైశ్యుల సమస్యలపై చర్చించారు. ఆర్యవైశ్యులపై జరుగుతున్న వేధింపులను వెంటనే ఆపాలన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులపై వివక్ష బాగా పెరిగిందని సజ్జల అన్నారు.ఆర్యవైశ్యులను లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగం వేధింపులకు పాల్పడుతోందని.. చిన్న, మధ్య తరహా వ్యాపారులపై అకారణంగా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన వ్యాపార రంగానికి ప్రభుత్వం నుంచి భరోసా లేదన్న సజ్జల.. వైఎస్ జగన్ హయాంలో ఆర్యవైశ్యులకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. -
ఆర్యవైశ్యులు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి : సజ్జల
-
బీసీగా ప్రచారం చేసుకుని ప్రధాని అయ్యారు
హైదరాబాద్: వైశ్య కులంలో పుట్టిన మోదీ బీసీగా ప్రచారం చేసుకుని ప్రధాని అయ్యారని టీమాస్ ఫోరం చైర్మన్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య విమర్శించారు. ఈ క్రమంలో దేశంలో పెద్ద మార్పు రావాల్సిన అవసరం ఉందని.. దీనికి గానూ కమ్యూనిస్టులు నిర్మాణాత్మకమైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎన్నికల రంగంలో దిగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో మార్క్సిజం–అంబేడ్కర్ ఆలోచనా విధానం–సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం అనే అంశంపై సదస్సు జరిగింది. ఐలయ్య మాట్లాడుతూ కింది కులాల వారిని ఐక్యం చేసి రాజ్యధికారం వైపు పయనించేలా చేయాలని సూచించారు. బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మద్దికాయల అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్, తాండ్ర కుమార్, జయరాజు, నల్లా సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. -
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో బ్రాహ్మణులు, వైశ్యులే అధికం
హైదరాబాద్: దేశంలోని బడా కంపెనీలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా బ్రాహ్మణులు, వైశ్యులే అధిక శాతం ఉన్నారని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. గురువారం ఓయూ క్యాంపస్ ఆర్ట్స్ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి, టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కంచ ఐలయ్య 65వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ‘ఇండియన్ ఇంగ్లిష్ డే’ను నిర్వహించారు. ఓయూ సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కంచ ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐలయ్య మాట్లాడుతూ, ప్రైవేటు రంగాల్లో ఉన్న వంద మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో 46 శాతం వైశ్యులు, 44.6 శాతం బ్రాహ్మణులు కమ్మ, రెడ్లు 3.8 శాతం, ఎస్సీ, ఎస్టీలు 3.5 శాతం మాత్రమే ఉన్నారన్నా రు. అందుకే ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. తన రచనలు, మాటల్లో మహిళలను ఎక్కడ విమర్శించడంలేదని చెప్పారు. ప్రతి గ్రామంలో ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను, ప్రతి మండలంలో డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసి తెలుగు, ఇంగ్లిష్ మీడియాలలో విద్యా బోధన జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో దంసా అధ్యక్షుడు ధారవత్ మోహన్, ఉసా, నలిగంలి శరత్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు వైశ్యుల పాదయాత్ర ప్రారంభం
వర్గల్ (గజ్వేల్): ఎట్టకేలకు మంగళవారం ఆర్యవైశ్యుల పాదయాత్ర ప్రారంభమైంది. రూ.1,000 కోట్లతో ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సోమవారం గజ్వేల్ నుంచి హైదరాబాద్‌కు వైశ్యులు వేర్వేరుగా చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే.. మంగళవారం మధ్యాహ్నానానికి పోలీసు కమిషనర్ వద్ద అనుమతి లభించడంతో వర్గల్ మండలం గౌరారం రాజీవ్ రహదారి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభమైంది. కాగా, ఈ పాదయాత్రలో వైఎస్సార్సీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్ గుప్త పాల్గొని సంఘీభావం తెలిపారు. కాగా, వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ మంగళవారం వర్గల్లో విలేకరులతో మాట్లాడుతూ ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీస్తున్న ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్నారు. -
తాండూర్ వాసవీక్లబ్కు ‘సూపర్‌స్టార్’ క్లబ్ అవార్డు
తాండూర్ : తాండూర్ వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు కె.సంతోష్‌కుమార్‌కు వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ 5 స్టార్ ప్రసిడెంట్ అవార్డు దక్కింది. ఆదివారం వరంగల్‌లో జరిగిన వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయి సంకల్పం మిడ్కాన్ 2016 కార్యక్రమంలో పలు అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా తాండూర్ వాసవీక్లబ్లకు సూపర్‌స్టార్ క్లబ్ అవార్డు రాగా, క్లబ్ అ«ధ్యక్షుడు సంతోష్‌కు 5 స్టార్ అవార్డు దక్కింది. ఈ అవార్డును క్లబ్ గోల్డెన్ స్టార్ పబ్బ విజయ్‌కుమార్ అందజేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ గవర్నర్ ముక్తా శ్రీనివాస్, జోన్ చైర్మన్ బోనగిరి వేణుగోపాల్, ఇంటర్నేషనల్ సభ్యులు రేణుకుంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


