
గౌరారంలో రాజీవ్ రహదారి మీదుగా ఆర్యవైశ్యుల పాదయాత్ర
వర్గల్ (గజ్వేల్): ఎట్టకేలకు మంగళవారం ఆర్యవైశ్యుల పాదయాత్ర ప్రారంభమైంది. రూ.1,000 కోట్లతో ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సోమవారం గజ్వేల్ నుంచి హైదరాబాద్‌కు వైశ్యులు వేర్వేరుగా చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే.. మంగళవారం మధ్యాహ్నానానికి పోలీసు కమిషనర్ వద్ద అనుమతి లభించడంతో వర్గల్ మండలం గౌరారం రాజీవ్ రహదారి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభమైంది.
కాగా, ఈ పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్ గుప్త పాల్గొని సంఘీభావం తెలిపారు. కాగా, వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ మంగళవారం వర్గల్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీస్తున్న ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్నారు.