‘నా స్టేటస్‌లు ఆగవు.. నా ట్వీట్‌లు ఆగవు’ | TDP MLA Kolikapudi On His Social Media Status | Sakshi
Sakshi News home page

‘నా స్టేటస్‌లు ఆగవు.. నా ట్వీట్‌లు ఆగవు’

Feb 13 2026 1:02 PM | Updated on Feb 13 2026 3:34 PM

TDP MLA Kolikapudi On His Social Media Status

విజయవాడ:  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు తనకు క్లాస్‌ పీకారనేది అవాస్తమన్నారు ఎమ్మెల్యే కొలికపూడి. తమ నియోజకవర్గ సమస్యలు చెప్పడానికే తాను సీఎం కలిశానని అంతకు మించి ఏమీ లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియాతో చిట్‌చాట్‌లో కొలికపూడి మాట్లాడారు.  గ్రామాల్లో రోడ్లు లేవు,.. వసతులు లేవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

‘సమస్యలు ఉన్నంతవరకు,  నా స్టేటస్ లు  ఆగవు, నా ట్వీట్ లు ఆగవు. మా అధ్యక్షుడు పల్లా నాకు క్లాస్ పీకారు అనేది అవాస్తవం. మా నియోజకవర్గ సమస్యలు చెప్పడానికి నేను సీఎంని కలిశాను. నా వాట్సాప్ స్టేటస్ లపై ఎవరు ఏమీ అడగలేదు,  నేను ఏమీ చెప్పలేదు’ అని వ్యాఖ్యానించారు. 

కాగా, ఇటీవలి కొలికపూడి సోషల్ మీడియా పోస్టులు వంటి అంశాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గట్టి హెచ్చరిక జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి.. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు తుది హెచ్చరిక జారీ చేశారని మీడియాలో వార్తలు వెలుగుచూశాయి. ఇకపై పార్టీ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కొలికపూడి వివరణ ఇస్తూ.. తనకు పార్టీ అధ్యక్షుడిని నుంచి ఎటువంటి హెచ్చరికలు రాలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. 

	అన్నీ సమస్యేలే... చంద్రబాబుకు మరో షాక్.. రెచ్చిపోయిన కొలికపూడి

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement