Kolikapudi Srinivasa Rao
-
సుప్రీంకోర్టు తీర్పుపై కొలికపూడి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఎన్టీఆర్: సుప్రీంకోర్టు తీర్పుపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన తీర్పు ఇచ్చిందని కొల్లికపూడి కామెంట్స్ చేశారు.విస్సన్నపేటలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో కొలికపూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు ఒక దుర్మార్గమైన.. దారుణమైన.. అన్యాయమైన తీర్పు ఇచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కులాలకు రిజర్వేషన్లు అందిస్తే.. సుప్రీంకోర్టు మతాలకు ముడిపెట్టడం దారుణం. ఇలాంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినా.. ఎవరిచ్చినా తప్పు అవుతుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
కొలికపూడిపై టీడీపీ సీనియర్ నేతల ఆగ్రహం
-
కొలికిపూడితో విసిగిపోయాం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వైఖరితో విసిగిపోయామని, ఆయనతో కలిసి పనిచేయలేమని టీడీపీ సీనియర్లు తేలి్చచెప్పారు. తిరువూరు నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఆదివారం తిరువూరులో జరిగింది. అధిక శాతం నాయకులు సమావేశాన్ని బహిష్కరించడంతో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కంగుతిన్నారు.ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్న నాయకులతో లక్ష్మీపురం మనో గార్డెన్స్‌లో సమావేశం ఏర్పాటు చేసి బుజ్జగించేందుకు ప్రయత్నించగా.. నాయకులెవరూ వెనక్కి తగ్గలేదు. పార్టీ శ్రేణులతో సమన్వయ లేమి, నాయకులను సైతం దూషించే ఎమ్మెల్యేతో పనిచేసేది లేదని తెగేసి చెప్పారు. టీడీపీ నేతలపైనే ఎమ్మెల్యే కేసులు పెట్టించడం, వేధింపులకు గురిచేయడంతో తాము అభద్రతా భావానికి లోనవుతున్నామని, ఎన్నికల్లో కష్టపడి గెలిపించిన తమకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం కాగా.. తిరువూరు టీడీపీ నేతలను సమన్వయం చేసేందుకు ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. ఎంపీ చిన్ని, వర్ల రామయ్య హామీలతో సంతృప్తి చెందని నాయకులు నియోజకవర్గ పార్టీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు. కాగా.. తన భార్యను ఎమ్మెల్యే వేధింపులకు గురిచేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చిట్టేల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు తన అనుచరులతో చిట్టేలలో నిరసనకు దిగారు. ఎమ్మెల్యే వేధింపులతో తన భార్య ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల్లో ఉందని, ఈ విషయమై తాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వాపోయారు. -
వంచించిన చంద్రబాబు.. దగాపడ్డ రైతన్న
రైతులకు మళ్లీ కష్టాలు.. ‘క్యూ’ కట్టిన పాస్ పుస్తకాలువైఎస్ జగన్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, సబ్సిడీలు తదితర ప్రభుత్వ సేవలన్నీ అందించగా.. టీడీపీ ప్రభుత్వం రావడంతో రైతుల పరిస్థితి మళ్లీ తలకిందులైంది. గతంలో చంద్రబాబు పాలనలో వారు ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. సబ్సిడీ శనగ విత్తనాల కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు గురువారం కర్నూలు జిల్లా మద్దికెరలోని రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులుదీరారు. ఎంతసేపు నిరీక్షించినా ఉపయోగం లేకపోవడంతో.. చివరకు పాస్‌పుస్తకాలను క్యూలైన్లో పెట్టారు. – మద్దికెరసాక్షి, అమరావతి : అన్నదాతలకు మళ్లీ కష్టకాలం దాపురించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు తమ పట్ల కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుండడం పట్ల రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్లుగా వారికి ఎంతగానో అక్కరకొచ్చిన రైతు సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా చాప చుట్టేస్తుండడంతో వారి భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైంది. మరొక వైపు హామీల అమలుపై నిలదీస్తోన్న రైతన్నలపై కూటమి నేతలు ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారు. ‘కుక్కలకున్న విశ్వాసం రైతులకు లేదంటూ హేళనగా మాట్లాడిన తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై రాష్ట్రంలోని రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే పదవి నుంచి ఆయన్ను సస్పెండ్ చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి రైతుల పట్ల చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ‘రైతులన్నా, వ్యవసాయం అన్నా తనకు గిట్టదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. విద్యుత్ బకాయిల కోసం రోడ్డెక్కితే అన్నదాతల గుండెల్లో తూటాలు దింపి గుర్రాలతో తొక్కించిన వ్యక్తిలో మార్పు వస్తుందని భావించడం అత్యాశే అవుతుంది’ అని నాటి ఘటనను గుర్తు చేసుకుని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రైతుకు రూ.20 వేల సాయమేది? ⇒ ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్ హామీల పేరుతో కూటమి నేతలు రైతులను నమ్మించారు. కానీ పగ్గాలు చేపట్టి నాలుగు నెలలు కావస్తున్నా ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేసిన పాపాన పోలేదు. ⇒ అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 76 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో సన్న, చిన్నకారు రైతులే 68 లక్షల మంది. సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన ఏటా రూ.15,214 కోట్లు జమ చేయాలి. కేంద్ర ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన వారం రోజుల్లోనే పీఎం కిసాన్ కింద తొలి విడతలో 40.91 లక్షల మందికి రూ.824.61 కోట్లు జమ చేసింది. రెండో విడత ఈ నెల 5న జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ⇒ రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీ మేరకు కనీసం ఒక విడత సాయం కూడా జమ చేయలేదు. పెట్టుబడి కోసం రైతులు రూ.3–5 చొప్పున వడ్డీలకు ప్రైవేటు వ్యాపారస్తుల నుంచి అప్పులు చేయాల్సిన అగత్యం వచ్చింది. పరిహారం అందక పడరానిపాట్లు ⇒ రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు నోటిఫై పంటలకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ ఉచిత పంటల బీమా పథకాన్ని గత జగన్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. ఈ పథకం ద్వారా ఏటా ఏ సీజన్లో జరిగిన నష్టానికి సంబంధించిన బీమా పరిహారాన్ని ఆ మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభంలోనే ఇస్తూ రైతులకు అండగా నిలిచింది. ⇒ 2019–23 మధ్య 54.55 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం చెల్లించింది. 2023–24 సీజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రైతుల వాటాతో సహా రాష్ట్ర ప్రభుత్వ వాటా మొత్తం రూ.1278.80 కోట్ల ప్రీమియం మొత్తాన్ని జమ చేసే సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ⇒ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ బకాయిలు చెల్లించకుండా ఎగనామం పెట్టడంతో ఆ సీజన్‌కు సంబంధించి పంట నష్టపోయిన 15 లక్షల మంది రైతులకు రూ.1,568 కోట్ల బీమా పరిహారం అందకుండా పోయింది. జాతీయ స్థాయిలో ప్రశంసలందుకున్న ఈ పథకాన్ని ప్రస్తుత రబీ సీజన్ నుంచి నిలిపి వేస్తున్నట్టు ప్రభుత్వం చేసిన ప్రకటన రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ⇒ కంపెనీలు నిర్ధేశించే ప్రీమియం మొత్తం (8 శాతం)లో ఖరీఫ్‌లో 2 శాతం, రబీలో 1.5 శాతం చొప్పున రైతులు చెల్లించాల్సి ఉంటుంది. 50ః50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఈ లెక్కన ఏటా రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు భారం పడనుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ బకాయిలూ ఎగ్గొట్టారు.. ⇒ 2023 ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయిన 10.44 లక్షల మందికి రూ.1289.57 కోట్లు జమ చేసేందుకు గత జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా, కోడ్ సాకుతో కూటమి నేతలు అడ్డుకున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఈసీ అనుమతితో 8.89 లక్షల మంది రైతులకు రూ.1,126.31 కోట్లు జమ చేశారు. ⇒ వివిధ రకాల సాంకేతిక కారణాల వల్ల 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ కాలేదు. ఈ బకాయిల కోసం వ్యవసాయ శాఖ పంపిన ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. మరో పక్క 2023–24 రబీ సీజన్లో 6 జిల్లాల్లోని 87 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. పోలింగ్ అనంతరం ఈసీ అనుమతితో పంట నష్టం తుది అంచనాలు తయారు చేశారు. 2.52 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్న 2.32 లక్షల మంది రైతులకు రూ.164.05 కోట్లు చెల్లించాలని లెక్క తేల్చారు. ⇒ ఈ మొత్తాన్ని వైఎస్సార్ రైతు భరోసాతో పాటు జూన్‌లో జమ చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సంకల్పించింది. కాగా ఈ కరువు సాయం కోసం పంపిన ప్రతిపాదనలను సైతం కూటమి ప్రభుత్వం బుట్ట దాఖలు చేసింది. 2023–24 సీజన్‌కు సంబంధించి రూ.327.71 కోట్ల కరువు బకాయిలు 3.91 లక్షల మంది రైతులకు అందకుండా చేసి, వారి నోట్లో మట్టికొట్టింది. ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి కోతలు ⇒ ఒకపక్క వరదలు, మరో పక్క తీవ్ర వర్షాభావ పరిస్థితుల ఉన్న రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కష్టకాలంలో రైతులను ఊదారంగా ఆదుకోవాల్సింది పోయి అంచనాలను కుదించి అడ్డగోలుగా పరిహారం ఎగవేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కింది. ⇒ జూలైలో కురిసిన వర్షాలకు తొలుత 16 జిల్లాల్లో 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. చివరికి దానిని 4 జిల్లాల్లో 54 వేల ఎకరాలకు పరిమితం చేశారు. 29,944 మంది రైతులకు రూ.37.33 కోట్లు పరిహారం చెల్లించాలని లెక్క తేల్చారు. కానీ ఆచరణకు వచ్చేసరికి కేవలం 23 వేల మందికి మాత్రమే రూ.25.75 కోట్లకు కుదించేశారు. ⇒ సాంకేతిక కారణాల సాకుతో ఐదారు వేల మందికి ఆరు కోట్లకుపైగా జమ కావాల్సిన పరిస్థితి నెలకొంది. సెపె్టంబర్లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు తొలుత 5.93 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా లెక్క తేల్చారు. పంటలతో పాటు పాడి, ఆక్వా, మత్స్యకారులకు కలిపి రూ.557 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనా వేశారు. ఆచరణకు వచ్చేసరికి 2.15 లక్షల మందికి మాత్రమే రూ.319.59 కోట్లుగా కుదించేశారు. సాంకేతిక కారణాలతో 50 వేల మందికి రూ.100 కోట్లకు పైగా జమ కావాల్సి ఉంది. మరో పక్క వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రాయలసీమ రైతులకు అధిక వర్షాల సాకుతో కరువు సాయం ఊసెత్తడం లేదు.వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే.. ప్రస్తుతం వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే.. జూన్‌లో తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా సాయం అందేది. గత సీజన్ మాదిరిగానే ఈ ఏడాది కూడా 53.58 లక్షల మందికి మే నెలలో రూ.7500, అక్టోబర్‌లో రూ.4000 చొప్పున జమ చేసేవారు. 2023 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన బీమా పరిహారం సైతం తొలి విడత భరోసా సాయంతో కలిపి అందించేవారు. ఈ లెక్కన రెండు విడతల్లో కలిపి రూ.6 వేల కోట్లకు పైగా పెట్టుబడి సాయం, 23 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.1,568 కోట్ల బీమా పరిహారం రైతుల ఖాతాలకు జమయ్యేది. ఖరీప్, రబీ సీజన్లకు సంబంధించిన కరువు సాయం బకాయిలు రూ.327.71 కోట్లు కూడా జమయ్యేవి. ఇలా దాదాపు రూ.8,058 కోట్లు రైతుల ఖాతాలకు చేరేది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పూర్తి స్థాయిలో పరిహారం జమయ్యేది. కొలికపూడిని సస్పెండ్ చేయకపోతే ఉద్యమిస్తాం ఎమ్మెల్యేగా 100 రోజులు కూడా పూర్తి కాకముందే ఆడ వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ, రైతులను కుక్కలతో పోల్చిన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును తక్షణమే ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలి. టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి. అలా చేయని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు, పోరాటాలను ఉ«ధృతం చేస్తాం. – పోతిరెడ్డి భాస్కర్, ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ జిల్లా దుర్మార్గపు వ్యాఖ్యలవి భారతదేశంలో రైతులను అన్నదాతగా అందరూ దైవంలా కొలుస్తుంటారు. అటువంటి రైతులను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కుక్కలతో పోల్చడం దుర్మార్గం. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రతి రైతు స్పందించాల్సిన అవసరం ఉంది. రైతులకు ఎమ్మెల్యే కొలికపూడి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. – బొప్పన సుబ్బారావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్, హుకుంపేట, తూర్పుగోదావరి జిల్లా హామీల మాటేమిటి? సూపర్ సిక్స్‌లో ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది. ఖరీఫ్ సీజన్ కూడా ముగిసిపోయింది. అయినా ఒక్క విడత పెట్టుబడి సాయం కూడా జమ చేయలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు పెట్టుబడి కోసం నానా అగచాట్లు పడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, రైతులను అవహేళన చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అవమానకరంగా మాట్లాడడం దుర్మార్గం. రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రైతుల తరఫున ఆందోళన చేస్తాం. – జీ.ఈశ్వరయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు లేదు: టీడీపీ ఎమ్మెల్యే
తిరువూరు: కుక్కలకు ఉన్న విశ్వాసం కూడా రైతులకు లేదని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దారుణ వ్యాఖ్యలు చేశారు. తాను వారి కోసం ఎంతో కష్టపడి పనిచేస్తుంటే వారు తనకు మద్దతుగా నిలవట్లేదన్నారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాత్రి దీక్ష చేపట్టిన ఆయన మంగళవారం తిరువూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తన సొంత డబ్బు కోట్లాది రూపాయలను పలువురి వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశానన్నారు. సాగునీటి కాలువల్లో పూడికతీతకు లక్షలాది రూపాయలు వెచ్చించానని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనకు రైతు సంఘాలు సన్నద్ధమవుతున్నాయి.దూషణలు, బెదిరింపులుఎమ్మెల్యేగా గెలిచిననాటి నుంచి టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి పలు వివాదాల్లో కూరుకున్నారు. కొద్ది రోజుల క్రితం తన ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై వార్తలు రాసినందుకు మీడియా ప్రతినిధులను బెదిరించారు. దీంతో స్వయంగా సీఎం చంద్రబాబుకు వారు మొరపెట్టుకున్నారు. అలాగే టీడీపీ సర్పంచ్‌ను దూషించడంతో ఆయన భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాజాగా నియోజకవర్గంలో మహిళా ఉద్యోగుల వాట్సాప్ నంబర్లకు అసభ్యకరంగా సందేశాలు పంపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని మహిళలు మొర పెట్టుకున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిట్టేల గ్రామంలో మహిళలు ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. కొలికపూడి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఇవి చాలవన్నట్టు ఆయన ఇప్పుడు రైతులను కుక్కలతో పోల్చారు. -
రైతుల్ని దూషించిన కొలికపూడి శ్రీనివాస్
ఎన్టీఆర్,సాక్షి: రైతులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. కుక్కలకైనా విశ్వాసముంటుంది కానీ రైతులకు లేదని వ్యాఖ్యానించారు. లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడికలు తీయించానని తెలిపారు. రైతులకు తన పట్ల విశ్వాసం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై కృష్ణా జిల్లా చిట్టేల గ్రామానికి చెందిన మహిళలు భగ్గుమన్నారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ ఆందోళనకు దిగారు. కొలికపూడిపై సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.మహిళల పట్ల ఎమ్మెల్యే వ్యవరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సిబ్బంది ఫోన్లకు అసభ్యకరంగా మెసేజ్‌లు పంపి వేధిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తన రక్షణ కావాలని వేడుకున్నారు. -
కొలికపూడి శ్రీనివాస్ కొత్త డ్రామా
ఎన్టీఆర్, సాక్షి: కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా టీడీపీకి వ్యతిరేకంగా దీక్ష చేపట్టి కొత్త డ్రామాకు తెర తీశారాయన. దీంతో కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కొలికపూడి వైఖరి వివాదాస్పదంగా ఉంటూ వస్తోంది. అధిష్టానం మందలించినా కొలికపూడి వైఖరిలో మార్పు రాలేదు. తాజాగా చిట్టేల సర్పంచ్ , అతని భార్య కవిత పై చర్యలు తీసుకోవాలంటూ దీక్షకు దిగారు. వీఆర్వోను వేధించిన ఆయన.. తిరిగి వారికి వ్యతిరేకంగానే దీక్షకు దిగడం గమనార్హం. మరోవైపు.. ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ చిట్టేలలో మహిళలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా పార్టీ అధిష్టానానికి తిరువూరు టీడీపీ శ్రేణులు వరుస ఫిర్యాదు చేస్తున్నాయి. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధినేత చంద్రబాబుని కోరుతున్నాయి. అయితే ఈలోపే.. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొలికపూడి దీక్ష డ్రామా చేపట్టడంపై చేయడంపై మండిపడుతున్నాయి. ఇదీ చదవండి: కొలికపూడి మమ్మల్ని వేధిస్తున్నాడు సార్! -
సింగల్ గా వస్తావా..! మహిళలకు కొలికపూడి మెసేజ్ లు
-
ఈ ఎమ్మెల్యే మాకొద్దు.. కొలికపూడిపై భగ్గుమన్న మహిళలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చిట్టేల మహిళలు భగ్టుమంటున్నారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ ఆందోళనకు దిగారు. కొలికపూడి సీఎం చంద్రబాబు తక్షణమే చర్యలు చేపట్టాలని మహిళలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యకర మెసేజ్‌లు పంపి ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఆరోపించారు. మహిళల్ని వేధిస్తున్న ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.కాగా, తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వారం రోజులుగా జరుగుతున్న రగడకు ఫుల్స్టాప్ పెట్టేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు దిగుతున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు తలంటి దూకుడు తగ్గించుకోవాలని, నాయకులను కలుపుకొని పోవాలని పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరువూరు మండలంలోని చిట్టేల సర్పంచి తుమ్మలపల్లి శ్రీనివాసరావును ఎమ్మెల్యే బహిరంగంగా దూషించడమే కాక గుడ్డలూడదీసి కొడతానంటూ అసభ్య పదజాలంతో తిట్టడంతో నియోజకవర్గంలోని టీడీపీ వర్గాలు నిరసనలకు దిగాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావును సైతం నాయకులు కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.ఇంతవరకు నియోజకవర్గంలోని సీనియర్ల ముఖం సైతం చూడని ఎమ్మెల్యే శ్రీనివాసరావు వైఖరిని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ‘తిరువూరును రక్షించండి’ నినాదంతో సోమవారం సాయంత్రం పట్టణంలో పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే, అధిష్టానం ఆదేశాలతో విరమించుకున్నారు. దీనికి తోడు ఫేస్బుక్ వేదికగా ‘అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు భయంకరమైన ప్రశాంతంగా ఉంటుంది’ అంటూ ఎమ్మెల్యే పోస్టింగ్ పెట్టడంతో టీడీపీ నాయకులు మరింత ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా ఎమ్మెల్యే తీరును తప్పుబట్టడం, విలేకరులను ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషించడం తదితర ఘటనలతో పార్టీకి, ప్రజలకు ఎమ్మెల్యే దూరమవుతున్నారని గ్రహించిన అధిష్టానం వెంటనే నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది. -
కొలికపూడి పద్ధతి మార్చుకో.. స్వామిదాస్ వార్నింగ్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచే ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు రాక్షసంగా వ్యవహరిస్తున్నారని తిరువూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, యథేచ్ఛగా దాడులు, ఆస్తుల విధ్వంసం చేస్తూ వైస్సార్సీపీ నాయకులు లక్ష్యంగా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.ఏకంగా ప్రొక్లెయిన్లతోనే ఇళ్లపై దాడులు చేస్తున్న కొలకపూడి, చివరకు మీడియానూ వదలడం లేదని చెప్పారు. కూటమి 100 రోజుల పాలనపై, తమది మంచి ప్రభుత్వం అంటూ.. తిరువూరులో ఇంటింటా స్టిక్కర్లు వేస్తున్నారన్న స్వామిదాస్.. అసలు ఇన్ని రోజుల్లో ఏ మంచి చేశారో చెప్పాలని, సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని నిలదీసిన స్వామిదాస్.. ధైర్యం ఉంటే చెప్పాలన్నారు. తిరువూరు నియోజకవర్గ చరిత్రలో కొలికపూడి శ్రీనివాసరావు లాంటి ఎమ్మెల్యే ఎవరూ లేరని... దాడులు, దౌర్జన్యాలు మితిమీరాయని, మీడియానూ బెదిరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘బట్టలూడదీసి ఇంటికొచ్చి కొడతాను’ అంటూ మీడియా ప్రతినిధులను బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. ఇకనైనా ఎమ్మెల్యే తన భాష మార్చుకోవాలని, ఇలాంటి సంస్కృతి మంచిది కాదని హితవు చెప్పారు. అలాగే అధికారులు కూడా ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తే, వారు భవిష్యత్తులో ఇబ్బందుల్లో పడతారన్న స్వామిదాస్.. చట్టవిరుద్దంగా వ్యవహరించే వారికి వత్తాసు పలకొద్దన్నారు. ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని కొలికపూడికి స్వామిదాస్ వార్నింగ్ ఇచ్చారు.ఇదీ చదవండి: 4 జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం -
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే ఆగడాలు..సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిట్టేల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆగడాలతో తీవ్ర మనస్తాపం చెందిన సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యకు యత్నించారు. ఎమ్మెల్యే అతనిని బహిరంగంగా దూషించడమే కాక బుధవారం చిట్టేల వెళ్లి దాడికి యత్నించడంతో ఆమె కలతచెంది నిద్రమాత్రలు మింగారు. ఆపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను తిరువూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హుటాహుటిన విజయవాడ తరలించారు. కవిత కోకిలంపాడు వీఆర్వోగా పనిచేస్తున్నారు.ఎమ్మెల్యే వేధింపులతోనే ఆత్మహత్యాయత్నంఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనను చంపడానికి యత్నిస్తుండడంతో భయపడి తన భార్య కవిత ఆత్మహత్యా యత్నం చేసుకున్నట్లు తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. తిరువూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులతో తప్పుడు కేసులు బనాయించి తనను అరెస్టు చేయించడమేకాక చిట్టేల వాగు నుంచి ఇసుక తోలకాలను తాను అడ్డుకుంటున్నానని ఆరోపిస్తూ అంతమొందిస్తానని బెదిరించారని చెప్పారు. తిరువూరు మెయిన్‌రోడ్డులో బహిరంగంగా తనను అసభ్య పదజాలంతో తిట్టడమే కాక ఆయన అనుచరులను రెచ్చగొట్టి తనపైకి ఉసిగొల్పుతున్నాడని సర్పంచ్ వివరించారు. చిట్టేలలో బుధవారం 20 మంది అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే పొలానికి వెళ్తున్న తనను అంతమొందించడానికి ప్రయత్నించారని, ఆయన దురుసు ప్రవర్తన, దౌర్జన్యంతో ఆందోళనకు గురైన తన భార్య కవిత నిద్రమాత్రలు మింగిందని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామస్తుల ఆందోళన..ఈ ఘటన నేపథ్యంలో చిట్టేల గ్రామస్తులు బుధవారం తిరువూరులో ఆందోళనకు దిగారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించారు. కవితను మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుధారాణి çకూడా పరామర్శించిఅండగా ఉంటామని చెప్పారు. -
ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులతో మహిళా VRO ఆత్మహత్యాయత్నం
-
టీడీపీ సర్పంచ్‌పై కొలికిపూడి ఓవరాక్షన్.. కవిత ఆత్మహత్యాయత్నం
సాక్షి, తిరువూరు: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలను కాకుండా సొంత పార్టీకి చెందిన వారిని కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ సర్పంచ్ ఫ్యామిలీని కొలికపూడి శ్రీనివాస్ టార్గెట్ చేసి వేధింపులకు గురిచేయడంతో సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం చేసింది.టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. తాజాగా చిట్టేల టీడీపీ సర్పంచ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేసి బూతులు తిట్టాడు. చిట్టేల సర్పంచ్ పేకాట ఆడుతూ పోలీసులకు దొరికాడు. ఆయనకు సిగ్గుంటే సర్పంచ్‌గా ఉంటాడా?. సర్పంచ్ కనపడితే చెప్పుతో కొడతాను. నా కొడకా ఇంకోసారి కనపడితే గుడ్డలు ఉడదీసి కొడతాను అంటూ తనకు వచ్చిన తీరుగా మాట్లాడాడు. అసభ్యకర పదజాలంతో దూషించాడు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతనే ఎమ్మెల్యే ఇలా టార్గెట్ చేయడంతో సర్పంచ్ ఫ్యామిలీ మనస్తాపానికి గురైంది. సర్పంచ్ శ్రీనివాస్‌ను ఇలా తిట్టడంతో ఆయన భార్య, వీఆర్వో కవిత ఆత్మహత్యకు పాల్పడింది. వీఆర్వో కవిత నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో, వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కవిత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: వైఎస్సార్సీపీ నేతలు -
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే
-
కొలికపూడి కంపు.. డ్వాక్రా మహిళలు ఆగ్రహం
సాక్షి, ఎన్టీఆర్: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ రావుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా గ్రూప్‌కు సంబంధించి మాట్లాడేందుకు వెళ్లిన మహిళలతో ఎమ్మెల్యే కొలికిపూడి అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. దీంతో, మహిళలకు ఎమ్మెల్యే ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు.తమను బూతులతో దూషించారని మహిళలు ఆరోపించారు. డ్వాక్రా గ్రూప్‌నకు సంబంధించి బుక్ కీపర్లుగా పాతవారినే కొనసాగించాలని ఎమ్మెల్యే కొలికిపూడి వద్దకు వెళ్లిన మహిళలు. ఈ సందర్భంగా మహిళలను తీవ్ర పదజాలంతో దూషించిన కొలికపూడి. మిమ్మల్ని ఎవడు ఇక్కడికి పంపించాడు? అంటూ ఊగిపోయిన ఎమ్మెల్యే. మహిళలు అని కూడా వారిని బూతులు తిట్టాడని సదరు మహిళలు తెలిపారు. అనంతరం, పోలీసులను పిలిపించి మహిళలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి స్టేషన్లో తమకు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కూటమి ప్రభుత్వంలో మహిళల్ని గౌరవించే విధానం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. -
నాడు అత్యుత్సాహం.. నేడు అతి వినయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచీ వివాదాలే.. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని వివాదాల మయం చేస్తున్నారు. ఏదోక దుందుడుకు చర్యతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సైతం వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత క్యాడర్లోనే అసంతృప్తి రేగింది. ఆది నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నవారిని లెక్క చేయపోవడంతో ఆయన తీరుపైన పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఆయన ప్రవర్తనలో మాత్రం మార్పురాలేదు. తీరా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదం అవుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త, చెన్నారావు నిర్మించిన భవనాన్ని అక్రమ కట్టడం పేరుతో కూల్చివేసే ప్రయత్నం చేశారు. తానే స్వయంగా బుల్డోజర్ని తీసుకెళ్లి కూల్చివేస్తానని హంగామా చేశారు. పోలీసులు, అక్కడ అధికారులు వారిస్తున్నా వినకుండా డాబా దిగువన ఉన్న గదిని కూల్చేశారు. రోడ్లపైన ఉన్న గోతులను పూడ్చాల్సింది అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయనదే బాధ్యత. అయితే బాధ్యత మరిచి రోడ్డుపై ఉన్న నీటి గుంత ముందు కూర్చొని నిరసన తెలిపారు. సొంత పార్టీనేతలను లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంతో విస్సన్నపేటలో గ్రామ కమిటీ నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పారు.తాజాగా మరొక వివాదంతో..తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదానికి తెరతీశారు. ఎమ్మెల్యే ప్రధానవీధిలో నడిబొడ్డున ఉన్న ఒక భారీ అక్రమ కట్టడంపై నగరపంచాయతీ తీసుకున్న చట్టపరమైన చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఆ కట్టడం ఒక వార్డు కౌన్సిలర్‌కు చెందినది కావడంతో ఆ సామాజికవర్గానికి తాను అండగా ఉంటానంటూ సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే చేస్తున్న హడావుడి చర్చనీయాంశమైంది. దీనికి తోడు అక్రమ కట్టడంపై చర్యలు తీసుకోవాలని మరో వార్డు కౌన్సిలర్ చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే రాజకీయ రంగు పులిమారు. మంగళవారం అక్రమ కట్టడాలపై నగర పంచాయతీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ పాలకవర్గం వైఎస్సార్ సీపీ ఆధీనంలో ఉండగా, వ్యాపారులకు నష్టం కలిగించే చర్యలకు ఆ పార్టీ పాల్పడుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే పోస్టు చేస్తున్నారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ, అక్రమ కట్టడాలపై చర్య తీసుకోవాలంటూ 9వ వార్డు కౌన్సిలర్ దుర్గారావు నగరపంచాయతీ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.ప్రజల దృష్టి మళ్లించేందుకే..అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికే తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఏనాడూ తిరువూరులో వ్యాపారులతో కక్షసాధింపు ధోరణికి పాల్పడలేదని, సామరస్య పూర్వకంగానే వ్యవహరించిందని పార్టీ నాయకులు చెబుతున్నారు.పార్టీకి సంబంధం లేదు..అక్రమ కట్టడాల విషయంలో అధికారులే తగు నిర్ణయం తీసుకుంటారు. ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు సైతం తనకు సంబంధం లేని అంశాల్లో తలదూరుస్తూ నియోజకవర్గంలో అభద్రతా వాతావరణాన్ని సృష్టించడం సరికాదు. ఆయన వివాదాస్పద వైఖరి ఇకనైనా మార్చుకోవాలి.– నల్లగట్ల స్వామిదాసు, తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి -
దాడులు చేస్తే సహించేది లేదు.. ఎమ్మెల్యే కొలికపూడికి వార్నింగ్
-
బెదిరిస్తే ఎవరు భయపడరు
-
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై కేసు నమోదు
-
తిరువూరు: కొలికపూడి అరాచకం.. కేసు నమోదు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదైంది. నిన్న(మంగళవారం) జరిగిన కంభంపాడు ఘటనపై వైఎస్సార్సీపీ ఎంపీపీ నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి, టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తన ఇల్లు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి, మరికొందరిపై కేసు నమోదు చేసిన ఏ.కొండూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్నటి ఘటనలో వీడియోల ఆధారంగా ఇప్పటివరకు 60 మందికిపైగా పోలీసులు గుర్తించారు.తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో అరాచకం సృష్టించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటనను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్సీపీకి చెందిన ఎ.కొండూరు ఎంపీపీపై కక్షసాధింపు చర్యలకు దిగారు. జేసీబీతో ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి ఇంటిని ధ్వంసం చేయించి, కంభంపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని కంభంపాడు పోలింగ్ కేంద్రంలోకి తన అనుచరులతో కలిసి అక్రమంగా ప్రవేశించబోయారు. అనుచరులతో కలిసి వెళ్లడాన్ని ఎంపీపీ నాగలక్ష్మి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు ఎంపీపీపై కక్షకట్టారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఉదయమే మందీ మార్బలంతో కంభంపాడు వచ్చారు. ఎంపీపీ నిర్మిస్తున్న భవనం ఆక్రమిత స్థలంలో ఉందంటూ అధికారులపై వత్తిడి తెచ్చారు. దానిని కూల్చివేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారు.ఎమ్మెల్యే ఆదేశాలతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కంభంపాడు చేరుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భవనం కూల్చివేతకు చేసిన హంగామా స్థానికుల్ని భయాందోళనలకు గురి చేసింది. ఎమ్మెల్యే వర్గీయులే పొక్లయిన్‌ను తీసుకొచ్చి పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఎంపీపీ భవనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. -
కొలికపూడికి నల్లగట్ల స్వామి దాస్ వార్నింగ్
-
తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అరాచకం
-
కొలికపూడిపై నందిగం సురేష్ ఫైర్
-
కొలికపూడి ఒక అరాచక శక్తి.. తిరువూరు ఘటనపై కైలే అనిల్ కుమార్ ఫైర్
-
తిరువూరు ఎమ్మెల్యే అరాచకం.. ఎ.కొండూరు ఎంపీపీ ఇల్లు ధ్వంసం
తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కంభంపాడులో అరాచకం సృష్టించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటనను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్సీపీకి చెందిన ఎ.కొండూరు ఎంపీపీపై కక్షసాధింపు చర్యలకు దిగారు. జేసీబీతో ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి ఇంటిని ధ్వంసం చేయించి, కంభంపాడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని కంభంపాడు పోలింగ్ కేంద్రంలోకి తన అనుచరులతో కలిసి అక్రమంగా ప్రవేశించబోయారు. అనుచరులతో కలిసి వెళ్లడాన్ని ఎంపీపీ నాగలక్ష్మి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు ఎంపీపీపై కక్షకట్టారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం ఉదయమే మందీ మార్బలంతో కంభంపాడు వచ్చారు. ఎంపీపీ నిరి్మస్తున్న భవనం ఆక్రమిత స్థలంలో ఉందంటూ అధికారులపై వత్తిడి తెచ్చారు. దానిని కూల్చివేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కంభంపాడు చేరుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భవనం కూల్చివేతకు చేసిన హంగామా స్థానికుల్ని భయాందోళనలకు గురి చేసింది. ఎమ్మెల్యే వర్గీయులే పొక్లయిన్‌ను తీసుకొచ్చి పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఎంపీపీ భవనాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. అయినా పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ప్రేక్షకపాత్రే వహించారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని కూల్చివేస్తున్నారని ఎంపీపీ ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు స్పందించలేదు. తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు సంఘటన స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే చర్యలను ఖండించారు. ఇటువంటి అసాంఘిక చర్యలను సహించబోమని, అధికారులు నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. ఇంతవరకు తిరువూరు నియోజకవర్గంలో ఇటువంటి కక్షసాధింపు చర్యల్లేవని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు బహిరంగంగా దౌర్జన్యపూరితంగా వ్యవహించారని స్వామిదాసు ఆరోపించారు. ఈ çఘటనకు బా«ద్యుౖలెన వారిపై చర్యలు తీసుకోవాలని స్వామిదాసు ఏ కొండూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంపీపీకే నోటీసు పట్టపగలు నడిరోడ్డుపై అరాచకం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోని అధికారులు ఎంపీపీకే తిరిగి నోటీసు ఇవ్వడం గమనార్హం. భవనానికి వెనుక వైపు స్థలాన్ని ఆక్రమించారంటూ ఎంపీపీ నాగలక్షి్మకి కంభంపాడు పంచాయతీ కార్యదర్శి నోటీసు ఇచ్చారు. భవనానికి వెనుకవైపు స్థలం ఆక్రమించారని, దారి వదల్లేదని వచి్చన ఫిర్యాదు మేరకు వెంటనే భవన నిర్మాణం నిలిపివేయాలని, స్థలానికి సంబంధించిన ధృవపత్రాలను పంచాయతీ కార్యాలయంలో వారం రోజుల్లోగా సమరి్పంచాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.