
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి నోరు పారేసుకున్నారు. జిల్లాలోని ఎ. కొండూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడకల్లో జిల్లా కలెక్టర్లతో కలిసి కొలికపూడి పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఎ. కొండూరు మండలంలో నీటి సరఫరాపై జరుగుతున్న ప్రచారంపై కొలికపూడి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలా ప్రచారం చేస్తే చెప్పుతో కొడతానంటూ అవాకులు చవాకులు పేలారు.
అదే క్రమంలో స్థానిక టిడిపి ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) ముఖ్య అనుచరుడిని టార్గెట్ చేశారు కొలికపూడి. గిరిజనులకు మరుగుదొడ్లు కట్టించేందుకు గతంలో కాంట్రాక్ట్ తీసుకున్న టీడీపీ నేత రమేష్‌రెడ్డిపై పరోక్షంగా వ్యంగ్యస్త్రాలు సంధించారు. 320 మరుగుదొడ్లు కట్టించేందుకు బిల్లులు తీసుకున్నారన్నారు. అటువంటి వారి వెనుక తిరుగుతారా? అంటూ గిరిజనును నిలదీశారు. అసలు మీకు సిగ్గుందా? గిరిజనులపై సైతం నోరు పారేసుకున్నారు కొలికపూడి.