సాక్షి, అమరావతి: ఈ విడత గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి జూలై 7 తేదీల మధ్య 12 రోజులు జరపనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు పరిశీలనల అనంతరం పుష్కరాల నిర్వహణకు తేదీలను ఖరారు చేస్తున్నట్టు దేవదాయశాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరిజవహర్‌లాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


