నీకు నచ్చింది చేసుకో.. మేమూ చూసుకుంటాం..! | Former TDP MLC Adireddy Apparao Threatens Man Over Alleged Scams In Rajahmundry | Sakshi
Sakshi News home page

నీకు నచ్చింది చేసుకో.. మేమూ చూసుకుంటాం..!

Mar 14 2026 11:26 AM | Updated on Mar 14 2026 12:10 PM

TDP Adireddy Apparao audio leaked

ఆదిరెడ్డి అప్పారావు బెదిరింపుల ఆడియో వైరల్‌ 

రాజమహేంద్రవరం సిటీ: మీ స్కామ్‌లు, దందాల వ్యవహారాన్ని  ప్రెస్‌మీట్‌ పెట్టి చెబుతానన్న ఒక వ్యక్తితో ‘నీకు నచ్చింది చేసుకో.. మేమూ చూసుకుంటాం’ అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఫోన్‌చేసి మరీ బెదిరించిన ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఆడియోలో అప్పారావు అటువైపు వ్యక్తిని దుర్భాషలాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆడియో ప్రకారం..

 ఎమ్మెల్యేగా గెలిపించిన తమకు శ్రీనివాస్‌ ఏమీ చేయలేదని, ఆయన చేయలేని పనులు తాము చేస్తున్నామని అవతలి వ్యక్తి చెబుతుండగా అప్పారావు ఎదురుదాడికి దిగి తిట్టడానికి యత్నించారు. దీంతో ‘తాను లీగల్‌గా చర్యలు చేపడతా’ అని ఆ వ్యక్తి అప్పారావుకు సమాధానమిచ్చారు. కొద్దిసేపు వాగ్వాదం సాగిన అనంతరం.. ఆ వ్యక్తి ‘మీ అబ్బాయిని ఎంచుకుని తప్పు చేశాం. ప్రెస్‌మీట్‌ పెట్టి మీ స్కామ్‌లు, దందాలు బయటపెడతా’ అని చెప్పాడు. దీనికి అప్పారావు బదులిస్తూ ‘నీకు నచ్చిన పని చేసుకో.. మేమూ చూసుకుంటాం’ అని పేర్కొన్నారు. కాగా, వివాదం ఏమిటి? బెదిరింపులకు గురైన వ్యక్తి ఎవరన్నది తెలియాల్సి ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement