లోకేశ్‌.. చిల్లర రాజకీయాలు మానుకో! | YSRP Leader Narayana Murthy Fires On Nara Lokesh Over Petty Politics, Demand Action On Social Media Defamation | Sakshi
Sakshi News home page

లోకేశ్‌.. చిల్లర రాజకీయాలు మానుకో!

Mar 14 2026 11:20 AM | Updated on Mar 14 2026 11:36 AM

YSRP Leaders Narayana Murthy Fires On Nara lokesh

వైఎస్‌ జగన్‌పై అసభ్య పోస్టులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు 

హెచ్చరించిన వైఎస్సార్‌సీపీ నాయకులు 

తాడేపల్లి రూరల్‌: ‘మిస్టర్‌ లోకేశ్‌.. చిల్లర రాజకీయాలు మానుకోండి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ప్రతిపక్ష నేతలను కించపరిచేందుకు జీతాలు ఇచ్చి మరీ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదు’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుల విభా­గం రాష్ట్ర అధ్యక్షుడు అంకిరెడ్డి నాగనారాయణమూర్తి అన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి లోకేశ్‌ను హెచ్చరించారు. 

మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌సీపీ పేరుతో సీమరాజ, జెట్టి రేణుక, కిరాక్‌ ఆర్పీ, కిరణ్‌ లాంటి వారితో దు్రష్పచారం చేయించడంపై శుక్రవారం తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వారి వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ మేక అంజిరెడ్డి, అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement