సాక్షి, విజయవాడ: టీడీపీ తిరువూరు పంచాయితీపై నివేదిక సిద్ధమైంది. ఇవాళ చంద్రబాబు టేబుల్ మీదకు తిరువూరు పంచాయితీ రిపోర్ట్ రానుంది. కేశినేని చిన్ని దందాల చిట్ట క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. ఎన్నికల్లో సీటు కోసం చిన్నికి రూ.5 కోట్లు ఇచ్చినట్లు లెక్కలిచ్చారు.
తిరువూరులో గంజాయి, మద్యం, రేషన్, ఇసుక దందాలలో కేశినేని చిన్ని పాత్రపై ఆరోపణలు ఉన్నాయి. పార్టీ పదవులు కేశినేని చిన్ని అమ్ముకున్నారని కమిటీకి కొలికపూడి ఫిర్యాదు చేశారు. కొలికపూడి ఆరోపణలపై కమిటీకి ఎంపీ కేశినేని చిన్ని వివరణ ఇచ్చారు. కొలికపూడి కోవర్టు అంటూ కేశినేని చిన్ని ఆరోపిస్తున్నారు. నేడు చంద్రబాబు దగ్గరకు కమిటీ నివేదిక వెళ్లనుంది. టీడీపీ దళితుడి వైపా? ధనికుడి వైపా..? అంటూ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయా లేక మీడియా డ్రామాతో ముగిస్తారా? అనే చర్చ జరుగుతోంది.


